
డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రభుదేవా.. దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘పౌర్ణమి’, ‘శంకర్ దాదా జిందాబాద్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన, చాలా కాలంగా టాలీవుడ్‌లో దర్శకుడిగా మరో సినిమా చేయలేదు. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెలుగులో మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది.
ప్రభుదేవా తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కథకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని, ప్రాజెక్టు ఖరారైతే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
దర్శకుడిగా ప్రభుదేవా తన కెరీర్‌లో విభిన్నమైన కమర్షియల్ సినిమాలను తెరకెక్కించారు. తెలుగులో సిద్ధార్థ్, త్రిష నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘పౌర్ణమి’, ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలకు దర్శకత్వం వహించారు. హిందీలో ‘వాంటెడ్’, ‘రౌడీ రాథోర్’, ‘దబాంగ్ 3’ వంటి చిత్రాలతోనూ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇటీవల నటుడిగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభుదేవా.. ఇప్పుడు మళ్లీ దర్శకత్వంపై దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఆయన మార్క్ మాస్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొత్త సినిమా రూపొందితే ప్రేక్షకులు ఎలాంటి అనుభూతిని పొందుతారనేది చూడాలి.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి హీరో, నిర్మాణ సంస్థ, కథ వంటి వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ప్రభుదేవా టాలీవుడ్ రీఎంట్రీ ఏ స్టార్ హీరోతో ఉండబోతోంది? త్వరలోనే ఈ సస్పెన్స్‌కు తెరపడుతుందేమో చూడాలి.
ఇది కూడా చదవండి: ప్రభాస్ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. నంబర్ 1 ఏదో తెలుసా.?
[Prabhu Deva Telugu Comeback, Prabhu Deva Next Movie, Telugu Star Hero, Prabhas, Chiranjeevi, Prabhu Deva Director, Telugu Cinema, Telugu Film News]






