
యంగ్ హీరో రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏమో ఏమో ఇది’. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
చిత్ర ప్రకటన సమయంలో విడుదల చేసిన ‘ది ఫస్ట్ బ్రీజ్ ఆఫ్ #EmoEmoIdi’ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోతో సినిమాలోని ఆహ్లాదకరమైన ప్రేమకథా ప్రపంచాన్ని పరిచయం చేసిన మేకర్స్.. ఇప్పుడు మరింత అందమైన అనుభూతిని పంచేందుకు ‘ఏమో ఏమో ఇది’ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.
సున్నితమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే సాహిత్యంతో రూపొందిన ఈ పాట ఆద్యంతం ఆహ్లాదకరమైన ప్రేమానుభూతిని పంచుతుంది. రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ మధ్య అందమైన కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో తెరకెక్కించిన విజువల్స్ పాటకు డ్రీమీ రొమాంటిక్ ఫీల్‌ను అందిస్తున్నాయి.
ఈ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా.. కార్తీక్, రమ్య బెహరా తమ మధురమైన గాత్రాలతో ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. అందమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే గానం, కనువిందు చేసే విజువల్స్ కలగలిసి ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్‌ను ఈ సీజన్‌లోని సరికొత్త లవ్ ఆంథమ్‌గా నిలిపాయి.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నా ఈ చిత్రం అక్టోబర్ 30, 2026న విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్.. టాలీవుడ్ విలన్ ఇంట పండగ వాతావరణం.!
[Emo Emo Idi Title Song, Emo Emo Idi Movie, Sailesh Kolanu, Roshan Meka, Hesham Abdul Wahab, Telugu Love Songs, Telugu Songs 2026, Telugu Film News]





