అభ్యర్థుల ప్రకటనలో తెలుగుదేశం జోరు: స్థానిక సమరం.. క్యాండేట్ల రెండో జాబితా విడుదల.!

Publish Date:Oct 17, 2026

Advertisement

స్థానిక ఎన్నికల సమాయత్తం విషయంలో తెలుగుదేశం దూకుడు ప్రదర్శిస్తున్నది. ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా స్థానిక అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నది. రాష్ట్రంలో   మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు,  నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను శనివారం (అక్టోబర్ 17) విడుదల చేసింది.  మొదటి జాబితాలో  36 మంది అభ్యర్థులను ప్రకటించిన అనంతరం, మిత్రపక్షాలతో చర్చలు పూర్తి చేసుకుని  22 మంది అభ్యర్థుల పేర్లతో  రెండో జాబితాను తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విడుదల చేశారు. 

రెండో జాబితాలో ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు,  నగర పంచాయతీలకు సంబంధించి మేయర్, ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా  మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబీదా పేరు  ప్రకటించారు. అదేవిధంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ స్థానానికి సీనియర్ నాయకురాలు చింతకాయల పద్మావతిని బరిలోకి దించారు. 

తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలోనూ స్థానిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థుల ఎంపిక సాగింది. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నాయకులు, వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా ప్రజాదరణ ఉన్న వర్గాలకు చోటు కల్పించారు. మొదటి జాబితా తరహాలోనే ఈ రెండో విడతలోనూ మహిళలకు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యానికి తగిన ప్రాధాన్యత ఇచ్చారు.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో, జాబితాలో పేర్లు ఖరారైన అభ్యర్థులు తక్షణమే క్షేత్రస్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టాలని అధిష్టానం ఆదేశించింది. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు అభ్యర్థులకు అండగా ఉంటూ నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయించాలని, ప్రజా సమస్యలపై పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు.  

  రెండో జాబితా విడుదల కావడంతో టీడీపీ పోటీ చేసే ప్రధాన పట్టణ స్థానాలన్నింటికీ అభ్యర్థుల ప్రకటన దాదాపు పూర్తైనట్లయింది. కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలతో సయోధ్య కుదుర్చుకుని, మిగిలిన చోట్ల పరస్పర సమన్వయంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సంక్షేమ పథకాలు,  అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా స్థానిక పోరులో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది.  

ప్రధాన పార్టీలు తమ జాబితాలను పూర్తిస్థాయిలో వెల్లడించడంతో రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడింది. అభ్యర్థులు తమ తమ స్థానాల్లో ప్రచార హోరెత్తించేందుకు కార్యాలయాలు ప్రారంభిస్తూ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తయిన వెంటనే ప్రచార పర్వం మరింత ఊపందుకునే అవకాశం ఉంది.

[AP Local Body Elections, TDP Second List, Candidates,  Chandrababu Naidu Candidates List, Machilipatnam Mayor CandidateTelugu One]

By
en-us Political News

  
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.