అమరావతి పనులు భేష్: పారదర్శకత శభాష్.. అదనపు ఆర్థిక సాయానికి అంతర్జాతీయ బ్యాంకులు సై.!

Publish Date:Oct 17, 2026

Advertisement

నవ్యాంధ్రప్రదేశ్  రాజధాని అమరావతి నిర్మణానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అనూహ్య స్థాయిలో అదనపు సహాయం లభిస్తున్నది.   రాజధాని అమరావతిలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన, శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధి బృందాలు..  మరో  15 వేల కోట్ల రూపాయల రుణాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయి.  

రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు  ఈ ప్రాజెక్టుకు నిధులు అందిస్తూ వస్తున్న సంగతి విదితమే.  ఇప్పటికే  15,000 కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు ఒప్పందాలు కుదిరిన సంగతి తెలిసిందే.  తాజాగా ఈ రెండు బ్యాంకుల ఉన్నత స్థాయి ప్రతినిధులు రాజధాని ప్రాంతంలో పర్యటించి, క్షేత్రస్థాయిలో సాగుతున్న రోడ్లు, డ్రైనేజీ, అడ్మినిస్ట్రేటివ్ సిటీ నిర్మాణాలు, కార్మికుల సంక్షేమ చర్యలను పరిశీలించాయి. 

ఈ సందర్శన ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ  సీఆర్డీయే అధికారులతో అంతర్జాతీయ బ్యాంకుల బృందం ప్రత్యేక  సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో రాజధాని తదుపరి దశల నిర్మాణాలకు అవసరమైన నిధుల అవసరాలను సీఆర్డీఏ అధికారులను ఈ బృందం అడిగి తెలుసుకుంది.  

సీఆర్డీయే అధికారుల అదనపు ప్రతిపాదనలను తెలియజేయగా,   సీఆర్డీఏ ప్రణాళికలు, పనులలో కనబరుస్తున్న పారదర్శకత పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన అంతర్జాతీయ బ్యాంకుల ప్రతినిథుల బృందం మరో 15 వేల కోట్ల రూపాయల రుణాన్ని అందించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.  

ఈ అదనపు ఆర్థిక సయానికి సంబంధించి   ప్రాజెక్ట్ ప్రాసెస్, పనుల నాణ్యత,  నిర్వహణ పర్యవేక్షణ కొరకు ప్రత్యేకంగా  ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌ను నియమించాలని బ్యాంకుల ప్రతినిధులు సూచించారు. వారి సూచనకు అనుగుణంగా త్వరితగతిన కన్సల్టెంట్‌ను నియమించేందుకు సీఆర్డీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ అదనపు ఆర్థిక సహకారం అందితే..    ప్రాజెక్టు మొదటి దశ పనులను నిర్దేశించుకున్న 2029 కాలపరిమితి నాటికి అత్యంత నాణ్యతతో పూర్తి చేయడానికి   మార్గం సుగమమవుతుంది.

ప్రస్తుతం అమరావతి రాజధాని పరిధిలో  52 వేల కోట్ల రూపాయల విలువైన 102  మౌలిక వసతుల కల్పన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఐకానిక్ వంతెనలు,   అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ, ప్రభుత్వ భవనాలు రూపుదిద్దుకుంటున్న తరుణంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి లభిస్తున్నఅదనపు నిధులు నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోవడానికి దోహదం చేస్తాయి.  అంతర్జాతీయ బ్యాంకులు అదనపు సాయానికి ముందుకు రావడం  ప్రాజెక్ట్ విశ్వసనీయతను మరింత పెంచుతుందని, దీనివల్ల అమరావతికి ప్రైవేటు పెట్టుబడులు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

[Amaravati Works progress Good, World Bank And ADB Accepts Additional Loan,    15000 Crore, Amaravati Capital Development, Telugu One]

By
en-us Political News

  
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.