12వ పీఆర్సీ మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ సర్కార్: అభ్యంతరాల నవేదనకు తుది గడువు డిసెంబర్ 31.!

Publish Date:Nov 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో  12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలతో  చంద్రబాబు సర్కార్  మార్గదర్శకాలను   విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు,ప్రతినిధులు,  సంబంధిత వర్గాలు తమ  సూచనలు, సలహాలు, అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేయడానికి వచ్చే నెల  31 వరకు గడువు విధించింది.

ఈ నిర్ణీత గడువులోగా వివిధ ఉద్యోగ సంఘాల నుంచి అందే అభిప్రాయాలను పీఆర్సీ పరిశీలించి,   తుది నివేదికను   ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అయితే యూజీసీ, ఎన్సీటీఈ, బార్ కౌన్సిల్ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల అధ్యాపక వర్గాలతో పాటు జాతీయ న్యాయ వేతన సంఘం పరిధికి చెందే న్యాయాధికారులకు ఈ పీఆర్సీ వర్తించదు. ఈ విషయాన్ని ప్రభుత్వం మార్గదర్శకాలలో విస్సష్టంగా పేర్కొంది. 

ప్రస్తుతం విడుదల చేసిన గైడ్ లైన్స్  ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, స్థానిక సంస్థల సిబ్బంది, ఎయిడెడ్ విద్యాసంస్థలు అలాగే విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగులు, శాశ్వత ప్రాతిపదికన ఉన్న కంటింజెంట్ సిబ్బంది జీతభత్యాలపై మాత్రమే పీఆర్సీ  పరిశీలిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం అమల్లో ఉన్న డీఏను మూలవేతనంలో ఏ ప్రాతిపదికన విలీనం చేయాలి, నూతన పే స్కేట్ల రూపకల్పన ఏ విధంగా ఉండాలనే అంశాలపై పీఆర్సీ దృష్టి పెడుతుంది.

అదే విధంగా, ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో  ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలులో తలెత్తుతున్న సమస్యలను సమీక్షించి, దానిని మరింత మెరుగుపరచడం లేదా తగిన మార్పులు చేయడంపై పీఆర్సీ సిఫారసులు చేయనుంది. 

ఇది కూడా చదవండి:   ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

వీటితో పాటు స్పెషల్ పే,  అలవెన్సులు, పెన్షనర్లకు వర్తించే ప్రస్తుత పింఛను విధానాన్ని కూడా పీఆర్సీ పరిశీలిస్తుంది. ఉద్యోగ పోస్టులను గ్రేడెడ్ విధానంలోకి మార్చడం, కాంట్రాక్ట్,  డిప్యుటేషన్ నిబంధనల ఆధారంగా వివిధ శాఖలవారీగా మానవ వనరుల అవసరాలపై కూడా పీఆర్సీ దృష్టి సారిస్తుంది. 

ఉద్యోగ సంఘాలు, సిబ్బంది నుంచి డిసెంబర్ 31లోగా వచ్చే విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకునేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వం కమిషన్‌కు సూచించింది. రాబోయే కాలంలో ఉద్యోగుల సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి మధ్య సమతుల్యత సాధించేలా  పీఆర్సీ సిఫారసులు ఉండాలని ప్రభుత్వపేర్కొంది. గడువులోగా ఉద్యోగ సంఘాలు తమ ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులు కోరారు.

మీకు నచ్చవచ్చు:  మెగా డీఎస్సీపై పిల్.. ఏపీ హైకోర్టు ఏమందంటే?

మెగా డీఎస్సీపై వైసీపీ పోరుకు కోర్టు తీర్పు ఎండ్ కార్డ్.!

[AP12thPRC, AndhraPradesh, Government, PRCguidelines, TeluguOne]

By
en-us Political News

  
హత్యాయత్నం  కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న బీటెక్ రవి,  పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీలో ఉన్నప్పటికీ తానే స్వయంగా డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఇందిరా రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు పలికారు.  
వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్ అడ్డాలను నిలబెట్టడమే తమ లక్ష్య మని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.
మూడో విడత ఎన్నికలకు సంబంధించి  నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1 ద్వారా నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు  అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.   నామినేషన్ల పరిశీలనను నవంబర్ 24న చేపట్టనున్నారు.
తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆమె ఆ ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నారు. 
1999 డిసెంబర్ 28న పనులు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి టీటీడీ అధికారులు చెప్పిన రెండు నెలల గడువుకు కేవలం 49 రోజులే మిగిలింది. అంటే తిరుమలకు నీటిని తరలించే విషయంపై జరిపిన మేధో మథనం 11 రోజుల్లో ముగిసింది. సరిగ్గా 1999 డిసెంబర్ 28 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.  
ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20)  నాటికి  సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నవంబర్ లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందన్న వార్త వింటే ఆంధ్రప్రజలకు దివిసీమ, కోనసీమ ఉప్పెనలే గుర్తుకు వవస్తాయి. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన, 1996 నవంబర్ 6న కోనసీమ ఉప్పెన లు రాష్ట్ర తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వందలాది ప్రాణాలను హరించాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. 
గత ఆరు గంటల వ్యవధిలో గంటకు  3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను,   చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం,  విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  
 తుపాను తీరం దాటే సమయంలో సముద్రం  అల్లకల్లోలంగా మారుతుందనీ, అలలు సాధారణం కంటే కనీసం   రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో 160 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ పేర్కొంది.  
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీసీఅధికారులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో పరిస్థితిని సమీక్షించారు.  తుపాను కదలికలు,  తీవ్రత,  రాష్ట్రంపై ఆ తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.  
ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. భారీగా గ్యాస్ లీకౌతుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు వ్యక్త మౌతున్నాయి. 
జీవితాంతం అనేక ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ రామోజీరావు ఎక్కడా తలవంచలేదని.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి శ్వాస వరకు పోరాడారని , తెలుగు జాతి కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి అని చెప్పిన చంద్రబాబు.. రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన స్థాపించిన  సంస్థలు తరతరాలకు శాశ్వత ఆస్తులుగా నిలుస్తాయని తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.