అత్యంత తీవ్ర తుపానుగా ఆక్వాన్: ఆంధ్రా తీరానికి పెనుముప్పు.!

Publish Date:Nov 18, 2026

Advertisement

బంగాళాఖాతంలో ఏర్పడిన  అక్వాన్ పెను తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. ఈ తుపాను ప్రస్తుతం ఈ తుపాను చాలా నెమ్మదిగా పయనిస్తూ, అంతకంతకూ బలపడుతోంది. దీని ప్రభావం ఆంధ్రా తీరంపై తీవ్రాతి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను ఉటంకిస్తూ  రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ పేర్కొన్నారు. 

గత ఆరు గంటల వ్యవధిలో గంటకు  3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను,   చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం,  విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  

పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తున్న ఈ తుపాను గురువారం (నవంబర్ 19) సాయంత్రానికి మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్వాన్  శుక్రవారం (నవంబర్ 20) తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

తుపాను తీరం దాటే సమయంలో తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, అత్యంత భారీ వర్షాలు ఉంటాయని పేర్కొంది. ఈదురుగాలుల వేగం గంటకు 150 కిలోమీటర్లకు మించి ఉంటుందని పేర్కొంది.

ఇది కూడా చదవండి:   అర్నాబ్ ఎఫెక్ట్: కోనసీమ అంధకారం.. లోతట్టు ప్రాంతాలు జలమయం, తగ్గని గాలుల తీవ్రత.!

ఈ తుపాను ప్రభావం వల్ల గురు, శుక్ర వారాల్లో (నవంబర్ 19, 20) రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో అలల ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందనీ,   మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని రాష్ట్ర విపత్తుల శాఖ సూచించింది. 

తుపాను తీరం దాటే సమయంలో ఎలాంటి ప్రాణ,  నష్టం జరగకుండా ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేశారు.

మీకు నచ్చవచ్చు:  న‌వంబ‌ర్ 19.. చ‌రిత్రలో చేదు జ్ఞాప‌కం.. దివిసీమ ఉప్పెన మాన‌ని గాయం.. 

ఆంధ్రప్రదేశ్.. 55 ఏళ్లలో 61 తీవ్ర తుపానులు!


[Cyclone Aquan, APweather, Heavyrains,  Warning, TeluguOne] 

By
en-us Political News

  
హత్యాయత్నం  కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న బీటెక్ రవి,  పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీలో ఉన్నప్పటికీ తానే స్వయంగా డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఇందిరా రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు పలికారు.  
వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్ అడ్డాలను నిలబెట్టడమే తమ లక్ష్య మని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.
మూడో విడత ఎన్నికలకు సంబంధించి  నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1 ద్వారా నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు  అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.   నామినేషన్ల పరిశీలనను నవంబర్ 24న చేపట్టనున్నారు.
తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆమె ఆ ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నారు. 
1999 డిసెంబర్ 28న పనులు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి టీటీడీ అధికారులు చెప్పిన రెండు నెలల గడువుకు కేవలం 49 రోజులే మిగిలింది. అంటే తిరుమలకు నీటిని తరలించే విషయంపై జరిపిన మేధో మథనం 11 రోజుల్లో ముగిసింది. సరిగ్గా 1999 డిసెంబర్ 28 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.  
ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20)  నాటికి  సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నవంబర్ లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందన్న వార్త వింటే ఆంధ్రప్రజలకు దివిసీమ, కోనసీమ ఉప్పెనలే గుర్తుకు వవస్తాయి. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన, 1996 నవంబర్ 6న కోనసీమ ఉప్పెన లు రాష్ట్ర తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వందలాది ప్రాణాలను హరించాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. 
 తుపాను తీరం దాటే సమయంలో సముద్రం  అల్లకల్లోలంగా మారుతుందనీ, అలలు సాధారణం కంటే కనీసం   రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో 160 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ పేర్కొంది.  
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీసీఅధికారులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో పరిస్థితిని సమీక్షించారు.  తుపాను కదలికలు,  తీవ్రత,  రాష్ట్రంపై ఆ తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.  
ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. భారీగా గ్యాస్ లీకౌతుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు వ్యక్త మౌతున్నాయి. 
ఈ మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు,ప్రతినిధులు,  సంబంధిత వర్గాలు తమ  సూచనలు, సలహాలు, అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేయడానికి వచ్చే నెల  31 వరకు గడువు విధించింది.
జీవితాంతం అనేక ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ రామోజీరావు ఎక్కడా తలవంచలేదని.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి శ్వాస వరకు పోరాడారని , తెలుగు జాతి కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి అని చెప్పిన చంద్రబాబు.. రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన స్థాపించిన  సంస్థలు తరతరాలకు శాశ్వత ఆస్తులుగా నిలుస్తాయని తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.