రోజు కూలీల కోసం ఐలాక్: ఉఫాధి వేదికలుగా లేబర్ అడ్డాలు.!
Publish Date:Nov 19, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో అడ్డాకూలీలు, నిర్మాణ రంగ కార్మికుల పని వెతుక్కునే విధానంలో వినూత్న మార్పులు వస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేబర్ అడ్డాల వ్యవస్థను పరిచయం చేస్తున్నది. నిత్యం ఉదయాన్నే ప్రధాన కూడళ్లలో ఎండలో గంటల తరబడి పని కోసం నిరీక్షించే కార్మికులకు మెరుగైన సౌకర్యాలు, నైపుణ్య నమోదు, సంక్షేమ సమాచారం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 1, 2026న ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. తొలుత 15 కేంద్రాలతో ప్రారంభించాలని భావించినప్పటికీ, ఆ తర్వాత తొలి దశలో 25 ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ కాంప్లెక్స్‌లుగా (ఐలాక్) దీనిని విస్తరించారు. సాధారణంగా లేబర్ అడ్డా అనేది మేస్త్రీలు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, హెల్పర్లు వంటి కార్మికులు ఉదయాన్నే చేరి కాంట్రాక్టర్లు లేదా ఇంటి అవసరాల కోసం వచ్చే వారి కోసం ఎదురుచూసే అనధికారిక ప్రాంతం. ఇటువంటి ప్రాంతాలలో సరైన మౌలిక వసతులు, ఉపాధి భరోసా లేక కొందరు పని దొరక్క ఖాళీ చేతులతో వెనుదిరిగే పరిస్థితి ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియను ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే ఐలాక్ కేంద్రాల ప్రధాన ఉద్దేశం. ఈ కేంద్రాల్లో కార్మికులు తమ నైపుణ్యాలను నమోదు చేసుకునే వీలు కల్పించడంతో పాటు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మేస్త్రీలు వంటి వారి కోసం యజమానులు, కుటుంబాలు నేరుగా సంప్రదించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వెయిటింగ్ హాళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, వై ఫై, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, అలాగే గృహ అవసరాలకు కార్మికులను సులభంగా గుర్తించేందుకు మొబైల్ అప్లికేషన్ వంటి అంశాలు ఈ ప్రణాళికలో ఉన్నాయి. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాలతో సహా కొన్ని కేంద్రాలు ఏర్పాటుఅయ్యాయి. 25 కాంప్లెక్స్‌ల నిర్వహణ ప్రక్రియ మొదలైంది. లబ్ధిదారుల సంఖ్యను పరిశీలిస్తే, జూన్ 2026 నాటికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించిన వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఈ శ్రమ్ పోర్టల్‌లో ఏపీ నుంచి 88.67 లక్షల మంది అసంఘటిత కార్మికులు నమోదు చేసుకున్నారు. వీరిలో 18.26 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదైన వారు ఉన్నారు. నిధుల అంశానికి వస్తే, 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో సంక్షేమ సెస్ రూపంలో రూ.1,408.58 కోట్లు వసూలైనట్లు జూన్ 2026లో కార్మిక మంత్రి తెలపగా, 2024–25 ఏపీ ఖాతాల ప్రకారం కార్మిక సంక్షేమంపై రూ.701 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులతో లేబర్ అడ్డాలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపినప్పటికీ, ఆ మొత్తం రెండు ఆర్థిక సంవత్సరాల సెస్ వసూళ్లే తప్ప లేబర్ అడ్డాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బడ్జెట్ కాదు. కేవలం నీడ, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించడం వల్ల కూడళ్లలో నిరీక్షించే కష్టం కొంత తగ్గినా, భవనం ఉన్నంత మాత్రాన వాటంతట అవే ఉపాధి అవకాశాలు పెరగవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కూడా చదవండి: కార్మికుల కోసం ఇక లేబర్ అడ్డాలు : సీఎం చంద్రబాబు కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలు, ప్రజలు ఈ కేంద్రాలను క్రమం తప్పకుండా వినియోగించుకోవడం, కార్మికులకు సక్రమంగా పని దొరకడం, న్యాయమైన కూలి, సకాలంలో చెల్లింపులు జరగడం కీలకమనీ.. భవిష్యత్తులో ఈ వ్యవస్థ నిర్మాణ కార్మికులకే కాకుండా లేక వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, వంటి ఇతర అసంఘటిత రంగాలకూ విస్తరించాల్సిన అవసరముందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రోజుకు రూ.500 సంపాదన కోసం ఎదురుచూసే కూలీకి ఉపాధి అవకాశంలో చిన్న మెరుగుదల కనిపించినా అది పెద్ద ఊరటనిస్తుందంటున్నారు. రానున్న రోజుల్లో ఎన్ని కేంద్రాలు పూర్తిస్థాయి సేవలు అందిస్తాయి, వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్ అడ్డాలను నిలబెట్టడమే తమ లక్ష్య మని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. మీకు నచ్చవచ్చు: సీఐఐ సదస్సు సక్సెస్: అధికారులు, సిబ్బందికి చంద్రబాబు అభినందన.. మీవల్లే అంటూ పొగడ్తలు.! ఏపీకి బిగ్ రిలీఫ్: బలహీనపడిన ఆక్వాన్.. సాధారణ వాయుగుండంగా తీరం దాటే చాన్స్.! [AndhraPradesh, Labour Addas, Chandrababu Naidu,ILoc, e-Shram, Cmmplexes, TeluguOne]
http://www.teluguone.com/news/content/andhrapradesh-43-237471.html





