మూడో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్: డిసెంబర్ 2న పోలింగ్.!
Publish Date:Nov 19, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్లో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల పరిధిలోని ఎంపిక చేసిన మండలాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఈ విడతలో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. తాజా షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 2వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెలువరిస్తారు. మూడో విడత ఎన్నికలకు సంబంధించి నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1 ద్వారా నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలనను నవంబర్ 24న చేపట్టనున్నారు. ఏవైనా కారణాలతో నామినేషన్లు తిరస్కరణకు గురైతే, వాటిపై నవంబర్ 25న సాయంత్రం 5:00 గంటలలోపు ఆర్డీఓ వద్ద అప్పీల్ చేసుకునే వీలు కల్పించారు. అందిన అప్పీళ్లను అధికారులు నవంబర్ 26న పరిష్కరిస్తారు. నవంబర్ 27 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు, అదే రోజున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 2న ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓటింగ్ ముగిసిన అనంతరం అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. ఇది కూడా చదవండి: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి షెడ్యూల్ ఇదే.! ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు. ఒకవేళ అనివార్య కారణాలతో ఆ రోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరపలేకపోతే, సెలవు దినమైనప్పటికీ మరుసటి రోజు ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే డిసెంబర్ 3న నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ చేపడతారు. ఇప్పటికే రాష్ట్రంలో తొలి విడతకు ఈ నెల 13న, రెండో విడతకు 16న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి విదితమే. మూడో విడత నోటిఫికేషన్ వెలువడటంతో ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార సన్నాహాలు వేగవంతం కానున్నాయి. మీకు నచ్చవచ్చు: ఏపీ పంచాయతీ ఎన్నికలు: కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి.! ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.! [Andhra Pradesh, PanchayatElections Phase3,Notification, December2Polling,TeluguOne]
http://www.teluguone.com/news/content/andhra-pradesh-43-237462.html





