నవంబర్ తుపాను: గడగడలాడుతున్న ఏపీ.!

Publish Date:Nov 18, 2026

Advertisement

నవంబర్ నెలలో తుపాను అంటే చాలు ఆంధ్రప్రదేశ్ వణికి పోతుంది. రాష్ట్ర చరిత్రలో  నవంబర్ లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందన్న వార్త వింటే ఆంధ్రప్రజలకు దివిసీమ, కోనసీమ ఉప్పెనలే గుర్తుకు వవస్తాయి. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన, 1996 నవంబర్ 6న కోనసీమ ఉప్పెన లు రాష్ట్ర తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వందలాది ప్రాణాలను హరించాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. 

1977 నవంబర్ 19న పెను తుపాను దివిసీమను శవాల దిబ్బగా మార్చేసింది. తుపానుతీరం దాటే సమయంలో200 కిలీమీటర్ల వేగాన్ని మించి వీచిన పెనుగాలలకు సముదరం చెలియల కట్ట తెంచుకుని విరుచుకుపడింది. ఏడు మీటర్ల ఎత్తున ఎగసి జనావాసాలపై పడిన రాకాసి సముదరపు అలలు కనీసం పది వేల మంది ప్రాణాలను కబలించాయి. 

ఇది అధికారిక సంఖ్య మాత్రమే.. వాస్తవంగా మృతుల సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని అప్పట్లోనే పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇక ఆస్తినష్టం అయితే చెప్పడానికి వల్లకానంత భారీగా ఉంది. కోడూరు, నాగాయలంక మండలాల్లోని పలు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  

ఇక ఇదే 1996లో ఇదే నవంబర్ నెలలో 6వ తేదీన పెనుతుపాను కొనసీమను చిగురుటాకులా వణికించింది. కాకినాడ, యానాం మధ్య తీరం దాటిన ఈ తుపాను ప్రభావం కోనసీమపై అత్యంత తీవ్రంగా ఉంది. తుపాను తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్లకు పెబడిన వేగంతో వీచిన పెనుగాలులకు సముద్రపుటలలు ఉవ్వెత్తున ఎగసి పడి ఉప్పెనగా మారి గ్రామాలకు గ్రామాలను తుడిచిపెట్టేశాయి. ఈ ఉప్పెన కారణంగా దాదాపు 2000 వేల మంది మరణించిన ఉంటారు. తీర ప్రాంత గ్రామలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఇళ్లు, వరి పొలాలు, కొబ్బది తోటలు నేలకొరిగాయి. 

ఇది కూడా చదవండి: న‌వంబ‌ర్ 19.. చ‌రిత్రలో చేదు జ్ఞాప‌కం.. దివిసీమ ఉప్పెన మాన‌ని గాయం.. 

ఇప్పుడు తాజాగా నవంబర్ నెలలోనే పెను తీవ్ర తుపాను అక్వాన్ ఏపీ తీరాన్ని తాకనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఏపీ తీర ప్రాంత గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పైగా ఈ తుపాను ప్రభావంతో ఉప్పెన సంభవించే అవకాశం ఉందన్న హెచ్చరికలతో వారు ప్రాణాలు అరచేతుల్లోపెట్టుకుని గడుపుతున్నారు. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన తీర ప్రాంత గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నప్పటికీ.. నాటి ఉప్పెనల జ్ణాపకాలు ప్రజల వెన్నులో చలిపుట్టిస్తున్నాయి. 

1996 కోనసీమ ఉప్పెన కారణంగా   అమలాపురం,ఉప్పలగుప్తం,కాట్రేనికోన,అయినవిల్లి ,ముమ్మడివరం,కొత్తపేట, పి.గన్నవరం వంటి ప్రాంతాలలో అతి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది.  

మీకు నచ్చవచ్చు: ఆంధ్రప్రదేశ్.. 55 ఏళ్లలో 61 తీవ్ర తుపానులు!

కోనసీమకు ఉప్పెన ముప్పు: మహోగ్రంగా దూసుకొస్తున్న ఆక్వాన్.!

[APTycoons, Uppena, Divieema, Konaseema, Heavytides, Heavyloss, Deaths, TeluguOne]

By
en-us Political News

  
హత్యాయత్నం  కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న బీటెక్ రవి,  పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీలో ఉన్నప్పటికీ తానే స్వయంగా డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఇందిరా రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు పలికారు.  
వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్ అడ్డాలను నిలబెట్టడమే తమ లక్ష్య మని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.
మూడో విడత ఎన్నికలకు సంబంధించి  నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1 ద్వారా నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు  అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.   నామినేషన్ల పరిశీలనను నవంబర్ 24న చేపట్టనున్నారు.
తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆమె ఆ ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నారు. 
1999 డిసెంబర్ 28న పనులు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి టీటీడీ అధికారులు చెప్పిన రెండు నెలల గడువుకు కేవలం 49 రోజులే మిగిలింది. అంటే తిరుమలకు నీటిని తరలించే విషయంపై జరిపిన మేధో మథనం 11 రోజుల్లో ముగిసింది. సరిగ్గా 1999 డిసెంబర్ 28 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.  
ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20)  నాటికి  సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
గత ఆరు గంటల వ్యవధిలో గంటకు  3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను,   చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం,  విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  
 తుపాను తీరం దాటే సమయంలో సముద్రం  అల్లకల్లోలంగా మారుతుందనీ, అలలు సాధారణం కంటే కనీసం   రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో 160 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ పేర్కొంది.  
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీసీఅధికారులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో పరిస్థితిని సమీక్షించారు.  తుపాను కదలికలు,  తీవ్రత,  రాష్ట్రంపై ఆ తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.  
ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. భారీగా గ్యాస్ లీకౌతుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు వ్యక్త మౌతున్నాయి. 
ఈ మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు,ప్రతినిధులు,  సంబంధిత వర్గాలు తమ  సూచనలు, సలహాలు, అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేయడానికి వచ్చే నెల  31 వరకు గడువు విధించింది.
జీవితాంతం అనేక ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ రామోజీరావు ఎక్కడా తలవంచలేదని.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి శ్వాస వరకు పోరాడారని , తెలుగు జాతి కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి అని చెప్పిన చంద్రబాబు.. రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన స్థాపించిన  సంస్థలు తరతరాలకు శాశ్వత ఆస్తులుగా నిలుస్తాయని తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.