కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు: ఎందుకంటే.?

Publish Date:Oct 17, 2026

Advertisement

స్థానిక సంస్థల ఎన్నికల  వేళ, వైసీపీ సీనియర్ నాయకుడు, కడప ఎంపీ వైఎస్  అవినాశ్ రెడ్డికి పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. పట్టణంలో ప్రస్తుతం శాంతిభద్రతల పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ముందస్తు నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.  స్థానిక ఎన్నికల వేళ నిబంధనలకు కట్టుబడుతూ, పులివెందులలో శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని పార్టీల రాజకీయ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు.  నేతలు, కార్యకర్తలు నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరారు.

కాగా పులివెందుల పట్టణంలో స్థానిక ఎన్నికల వేడి ఊపందుకుంటున్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే వైఎస్ అవినాష్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు.  పులివెందుల పట్టణంలో ఎన్నికల కోడ్,  శాంతిభద్రతల దృష్ట్యా ప్రస్తుతం సెక్షన్ 144 తో  పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉన్నట్లు పోలీసులు ఆ నోటీసులో  పేర్కొన్నారు. ఈ నిబంధనల ప్రకారం పులివెందుల ప్రాంతంలో  అనుమతు  తెలిపారు. ఎన్నికల ప్రచారాలు లేదా ఇతర సమావేశాల సమయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. 

గతంలో ఎన్నికల సమయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు,  పరిస్థితులను బేరీజు వేసుకుంటూ పోలీసులు ఈ ముందస్తు చర్యలు చేపట్టారు. స్థానిక ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికార యంత్రాగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయ పార్టీల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చేలా అధికారులు వివిధ మార్గాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. 


[Pulivendula Police Notices YS Avinash Reddy, Section 144, Local Body Elections, Law And Order, Pulivendula Municipal Elections, Telugu One]

By
en-us Political News

  
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.