మొన్న అర్నాబ్, నిన్న మురసు, ఇప్పుడు అక్వాన్: ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు.!

Publish Date:Nov 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ పై మరో పెను తుపాను అక్వాన్ పంజా విసరనుంది. ఈ తీవ్ర తుపాను వేగంగా ఏపీవైపు దూసుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీసీఅధికారులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో పరిస్థితిని సమీక్షించారు.  తుపాను కదలికలు,  తీవ్రత,  రాష్ట్రంపై ఆ తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.  

తీసుకోవలసిన చర్యలపై వారికి దిశా నిర్దేశం చేశారు.  ప్రస్తుతం గంటకు  3 కిలోమీటర్ల   వేగంతో  కదులుతున్న ఈ పునాను  మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  దీని తీవ్రత మరింత పెరిగి, పెను తుపానుగా మారే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో సాధ్యమైనంత వరకూ తుపాను నష్టాన్ని కనిష్టంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం సంభవించకుండా, తుపాను ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.   తుఫాన్ ప్రభావంతో గురు, శుక్రవారాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో గంటకు 125 కిలోమీటర్ల వేగంతో   ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

స్వల్ప వ్యవధిలో రాష్ట్రంలో తీరాన్ని తాకుతున్న మూడో విప్తత్తు ఇది కావడం గమనార్హం.  తుఫాన్ ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా అధికారులు ముందుస్తుగానే పకడ్బందీ చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు.  ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇచ్చే హెచ్చరికలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలకు నేరుగా సమాచారం అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి:  ఏపీకి మరో తుపాను గండం: దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్షాలు.!

సముద్రం  అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలన్నారు.  ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్న నమ్మకాన్ని ప్రజలలో కల్పించాలన్నారు.   తుఫాన్ ధాటికి చెట్లు నేలకూలినా లేదా విద్యుత్ స్తంభాలు విరిగిపడినా వెంటనే వాటిని తొలగించి, రవాణా మరియు విద్యుత్ సరఫరా వ్యవస్థలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించడానికి సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

రియల్ టైమ్‌లో వాతావరణ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేస్తూ అవసరమైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని, ముంపు బాధితుల కోసం   పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తుఫాన్ వర్షాల కారణంగా చెరువులు, సాగునీటి కాల్వలకు  గండ్లు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని   ఆదేశాలు జారీ చేశారు.  

మీకు నచ్చవచ్చు: ఏపీకి మురసు ముప్పు: ఒంగోలు సమీపంలో తీరం దాటనున్న తీవ్ర తుపాను.!

ఏపీకి మరో తుపాను ముప్పు: రాష్ట్రంపై ప్రకృతి పగపట్టిందా.?

[CycloneAkwan, APhialert,   CM Chandrababu Naidu, Teleconference,   TeluguOne]

By
en-us Political News

  
హత్యాయత్నం  కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న బీటెక్ రవి,  పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీలో ఉన్నప్పటికీ తానే స్వయంగా డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఇందిరా రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు పలికారు.  
వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్ అడ్డాలను నిలబెట్టడమే తమ లక్ష్య మని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.
మూడో విడత ఎన్నికలకు సంబంధించి  నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1 ద్వారా నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు  అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.   నామినేషన్ల పరిశీలనను నవంబర్ 24న చేపట్టనున్నారు.
తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆమె ఆ ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నారు. 
1999 డిసెంబర్ 28న పనులు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి టీటీడీ అధికారులు చెప్పిన రెండు నెలల గడువుకు కేవలం 49 రోజులే మిగిలింది. అంటే తిరుమలకు నీటిని తరలించే విషయంపై జరిపిన మేధో మథనం 11 రోజుల్లో ముగిసింది. సరిగ్గా 1999 డిసెంబర్ 28 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.  
ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20)  నాటికి  సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నవంబర్ లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందన్న వార్త వింటే ఆంధ్రప్రజలకు దివిసీమ, కోనసీమ ఉప్పెనలే గుర్తుకు వవస్తాయి. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన, 1996 నవంబర్ 6న కోనసీమ ఉప్పెన లు రాష్ట్ర తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వందలాది ప్రాణాలను హరించాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. 
గత ఆరు గంటల వ్యవధిలో గంటకు  3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను,   చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం,  విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  
 తుపాను తీరం దాటే సమయంలో సముద్రం  అల్లకల్లోలంగా మారుతుందనీ, అలలు సాధారణం కంటే కనీసం   రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో 160 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ పేర్కొంది.  
ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. భారీగా గ్యాస్ లీకౌతుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు వ్యక్త మౌతున్నాయి. 
ఈ మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు,ప్రతినిధులు,  సంబంధిత వర్గాలు తమ  సూచనలు, సలహాలు, అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేయడానికి వచ్చే నెల  31 వరకు గడువు విధించింది.
జీవితాంతం అనేక ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ రామోజీరావు ఎక్కడా తలవంచలేదని.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి శ్వాస వరకు పోరాడారని , తెలుగు జాతి కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి అని చెప్పిన చంద్రబాబు.. రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన స్థాపించిన  సంస్థలు తరతరాలకు శాశ్వత ఆస్తులుగా నిలుస్తాయని తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.