బీహార్ లో కాంగ్రెస్ జీరో కానుందా?
Publish Date:Jan 16, 2026
బీహార్ లో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి జేడీయూ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై వారీ పార్టీ మారబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను కాంగ్రెస్ ఖండించింది.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 'దహీ-చూరా' విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు. దీనికి తోడు సంక్రాంతి తరువాత కాంగ్రెస్ లో పెద్ద కుదుపు ఉంటుందంటూ ఎన్డీయే నేతల ప్రచారం కూడా కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు జనతాదళ్ గూటికి చేరనున్నారన్న ప్రచారానికి ఊతం ఇచ్చింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు ఆ ఆరుగురూ కూడా కాంగ్రెస్ ను వీడనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం శూన్యం అవుతుందన్న చర్చ మొదలైంది. అంతే కాకుండా కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జనతాదళ్ యూ గూటికి చేరితే ఆ పార్టీ బలం బీజేపీని మించుతుంది. 243 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్డీయేకు 202 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో బీజేపీకి 89, జేడీయూకు 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇలా ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గంపగుత్తగా జనతాదళ్ యూ గూటికి చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు షకీల్ అహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ పార్టీతోనే ఉన్నారన్న ఆయన పార్టీ కార్యకర్తల మనో స్థైర్యాన్ని దెబ్బతీయడానికే ప్రత్యర్థులు ఇటువంటి ప్రచారానికి తెరతీశారని విమర్శించారు.
పొత్తులకు మాయావతి గుడ్ బై.. యూపీలో అధికారం కోసం ఒంటరి పోరు
Publish Date:Jan 16, 2026
వేమిరెడ్డికి....కేంద్ర బెర్త్ కన్ఫర్మ్ అయినట్టేనా!?
Publish Date:Jan 16, 2026
వాస్తవ వేదిక.. వారికే కాంట్రాక్టులు.. అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా
Publish Date:Jan 16, 2026
ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి జగన్ పాలనా వైఫల్యాలే కారణం.. కుండ బద్దలుకొట్టిన పేర్ని
Publish Date:Jan 16, 2026
తమిళనాట కొత్త పొత్తు పొడుపు?
Publish Date:Jan 14, 2026
జననాయకన్ సినిమా విడుదల, కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. ఇలా తమిళనటుడు, టీవీకే అధినేత విజయ్ ను కష్టాలు ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా వెంటాడుతున్నాయి. సొంత పార్టీ ఏర్పాటు చేసి, ఈ ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమౌతున్న వేళ విజయ్ ను నాన్ స్టాప్ గా కష్టాలు వెంటాడుతున్నాయి. విజయ్ తన చివరి చిత్రంగా ప్రకటించిన జననాయకన్ సినిమా ఈ పండుగ సందర్భంగా విడుదల అయ్యే అవకాశం లేకుండా పోయింది. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో విషయం కోర్టు మెట్లెక్కింది. దానికి తోడు కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది.
అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు. తమిళనాట ఇసుమంతైనా స్టేక్ లేని బీజేపీ విజయ్ తో పొత్తు ద్వారా రాష్ట్రంలో పాగా వేయాలనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా విజయ్ ను చక్రvgధంలో ఇరికిస్తోందన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. ఇక విజయ్ కు కమలంలో దోస్తీకి సై అనక తప్పదన్న విశ్లేషణలూ వెలువెడ్డాయి. అయితే అనూహ్యంగా విజయ్ కు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ మద్ద తుగా నిలిచారు. విజయ్ పై వేధింపులకు పాల్పడ్డం అది తమిళ సంప్రదాయాలను భంగప రచడమే అవుతుందని రాహుల్ విమర్శించారు.
దీంతో విజయ్ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తుపొడుపునకు అవకాశాలున్నాయా అన్న చర్చకు తెరలేచింది. ఇప్పటికే విజయ్ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు లేకుండా స్వతంత్రంగానే రంగంలోకి దిగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. తమకు డీఎంకేతో స్థానిక రాజకీయ విబేధాలుంటే, కేంద్రంలోని బీజేపీతో సైద్ధాంతిక విబేధాలున్నాయని చెప్పారు. ఇప్పటి వరకూ డీఎంకేతో కలిసి ఉన్న కాంగ్రెస్ సడెన్ గా విజయ్ కి మద్దతుగా గళం విప్పడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాట కొత్త పొత్తు పొడుపునకు ఇది సంకేతమా అన్న చర్చా జోరుగా సాగుతోంది.
తొలి నాళ్లలో తమిళనాట కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నా.. ఆ తర్వాత డీఎంకే, ఏఐడీఎంకే రూపంలో ఈ రెండు పార్టీలే ఇక్కడ అధికారం పాల్పంచుకుంటూ వస్తున్నాయి. కేసీఆర్ లాంటి వారికి ఈ డీఎంకే అన్నాడీఎంకే పాలసీ ఎంతో ఇష్టం. తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ కూడా ఇలాగే రెండుగా చీలి.. ఇక్కడ అధికారం ఎవరో ఒకరు పాల్పంచుకోవాలని ఆశిస్తారాయన.
అంతగా తమిళనాట స్థానిక రాజకీయాలు గత కొన్నేళ్లుగా పాతుకుపోయాయి. ఇప్పుడు డీఎంకే తర్వాతి తరానికి కూడా బలంగా కనిపిస్తున్నా అన్నాడీఏంకేకి జయలలిత తర్వాత ఒక దిక్కంటూ లేక పోయింది. శశికళ రూపంలో బలమైన నాయకురాలు ఉన్నా.. మోడీ కారణంగా ఆమె అన్నాడీఎంకేకీ ఏమీ కాకుండా పోయారు. ఈ స్థానంలో ఇక్కడ బీజేపీ పాతుకుపోవాలని తెగ ప్రయత్నిస్తుంటే మధ్యలో తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న హీరో విజయ్. టీవీకే పార్టీ ఏర్పాటు చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ అంటే బీజేపీకి ఆగ్రహం. దానికి తోడు విజయ్ కూడా మెర్సల్ వంటి సినిమాల ద్వారా బీజేపీ వ్యతిరేక వాణి వినిపించిన పరిస్థితి గతంలో ఉంది.
వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే పోటీ చేయనుండటం.. బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని విజయ్ ప్రకటించడంతో.. ఆయనను వీలైనంతగా తమ దారిలోకి తెచ్చుకోడానికి బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. దీనిని విజయ్ ఎలా ప్రతిఘటిస్తారు? రాహుల్ విజయ్ కు మద్దతుగా గళం విప్పడం వెనుక కారణమేంటి? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండనుంది? తేలాల్సి ఉంది.
జేపీ, లక్ష్మీనారాయణ బాటలో ఏబీవీ!
Publish Date:Jan 13, 2026
తెలంగాణ మునిసిపోల్స్.. జనసేన, బీజేపీ ఎవరిదారి వారిదే!
Publish Date:Jan 11, 2026
అమరావతి విషయంలో...జగనాసురుడి అసలు స్కెచ్ అదేనా?
Publish Date:Jan 11, 2026
చమురు మంటలతో పచ్చదనం పలచబడిపోతున్న కోససీమ
Publish Date:Jan 10, 2026
మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Publish Date:Aug 28, 2025
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు.
కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.
నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?
Publish Date:Aug 28, 2025
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్ఫ్యూజన్
Publish Date:Jul 25, 2025
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
అమ్మాయిల కెరీర్ వారి వివాహ జీవీతం పై ప్రబావం చూపిస్తోందా?
Publish Date:Jan 16, 2026
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా అమ్మాయి అయినా కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. అబ్బాయిలు ఆలస్యంగా వివాహం చేసుకోవడం పెద్దగా సమస్య కాదు, కానీ పెద్ద వయసులో అమ్మాయిలకు మంచి సంబందాలు రావడం లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం.
అమ్మాయిలకు వివాహానికి సరైన వయస్సు ఏమిటి అనే విషయంపై సరైన స్పష్టత ఎక్కడా లేదు. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా మొదట తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని, ఆ తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ 30ఏళ్ల తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు పెద్ద సవాల్ ఎదురవుతోంది. దీనిగురించి రెలేషన్షపి నిపుణులు చెబుతున్న విషయాలు ఏంటో తెలుసుకుంటే..
కెరీర్ అడ్డంకి..
గతంలో ఆడపిల్లల చదువు, కెరీర్ కు ఇంత ప్రాముఖ్యత లేదు. టెంత్, ఇంటర్, డిగ్ర లాంటివి పూర్తవ్వగానే ఆడపిల్లలకు పెళ్ళి చేసేవారు. పెళ్లి తర్వాత మహిళలు కూడా ఇంటిని, భర్త, పిల్లలు, అత్తమామలను చూసుకుంటూ ఉండే వారు. కానీ నేటికాలంలో అలా లేదు.. తల్లిదండ్రులు ఆడపిల్లలను కూడా కొడుకులతో సమానంగా చదివిస్తున్నారు. ఆడపిల్లలు తమ కెరీర్ ను అద్బుతంగా మలుచుకోవడంలో సపోర్ట్ చేస్తున్నారు. దీని వల్ల ఆడపిల్లలు కూడా తమ కెరీర్ ను బిల్డ్ చేసుకుని సెటిల్ కావడానికి సమయం పడుతోంది. అది కాస్తా 30 ఏళ్ల వరకు వివాహానికి దూరం ఉండేలా చేస్తోంది. ఇదే తల్లిదండ్రులకు పెద్ద సవాల్ గా మారుతోంది. ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించిన కూతురికి పెళ్లి చేయడం చాలా కష్టతరంగా మారింది.
అబ్బాయిలకు కాస్త బెటర్..
అమ్మాయిల మాదిరిగానే పెద్ద వయసు అబ్బాయిలకు కూడా వివాహం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే అబ్బాయి బాగా సంపాదిస్తే చిన్న వయసు అమ్మాయిల నుండి సంబంధాలు వస్తుంటాయి. తల్లిదండ్రులు తమ కూతురికి ఆర్థిక భద్రత కల్పించే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. అయితే అమ్మాయిల విషయంలో అలా కాదు. ఒక అమ్మాయి ఎంత సంపాదించినా, ఆమె పెద్దది అయితే మంచి జత దొరకడం కష్టంగా ఉంటుంది.
అబ్బాయిలు ఆశించడమే పెద్ద సమస్య..
కాలం ఎంత మారినా అది మగవారి ఆలోచనలు మార్చలేకపోతోంది. మగవాళ్లకు తమ భార్యల పట్ల ఉన్న అవగాహన పెద్దగా మారలేదు. చాలా మంది మగవాళ్లు ఎక్కువగా ఆశిస్తున్నారనే మాట చాలా నిజం. భార్య అటు ఉద్యోగం చేసి సంపాదించాలి, అలాగే ఇటు ఇంటికి రాగానే ఇంటి పనులు అన్నీ ఆమె చేసి భర్తకు సేవలు చేస్తూ పిల్లలను కూడా చూసుకోవాలని కోరుకుంటారు. చాలా సార్లు తమ తల్లితో భార్యను పోలుస్తారు, వస్త్రధారణ నుండి అమ్మాయి పరిచయాల వరకు, స్నేహితులు, వ్యక్తిగత స్పేస్ వంటి విషయాలలో కూడా ఆబ్బాయిలు అమ్మాయిలను చికాకు పెడతారు. ఇలాంటివి అమ్మాయిలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఇవి కాస్తా వైవాహిక జీవితంలో అడ్డంకులకు కారణం అవుతున్నాయి.
అమ్మాయిల వయసు పెరిగితే ఇదే సమస్య..
30ఏళ్ళ తర్వాత అమ్మాయిలకు వివాహం విషయంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య అమ్మాయి సంతానోత్పత్తి ఆమె వయస్సుతో ముడి పడి ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ అమ్మాయి సంతానోత్పత్తి తగ్గుతుంది. అమ్మాయి పెద్దదైతే ఆ జంట పిల్లల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ఇది వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించకుండా చేస్తుంది.
నేటి కాలంలో అమ్మాయిలు ఆర్థిక విషయం నుండి చాలా వరకు స్వతంత్రత కలిగి ఉన్నారు. తన సొంత ఆలోచన ఉంటుంది. ఆమె తన భర్త లేదా కుటుంబం చెప్పే ప్రతిదానితో ఏకీభవించలేదు. ఆమె తన సొంత ఆలోచనకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే భార్యభర్తల మధ్య సమస్యలు సృష్టిస్తోంది.
సరైన వయసు..
మేజర్ అయితే చాలు అమ్మాయిలు, అబ్బాయిలు వివాహానికి అర్హత పొందుతారు. కానీ వివాహానికి సరైన వయసు అనేది వ్యక్తిగతంగా ఉంటుంది. అమ్మాయిలు కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం వివాహానికి ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ చాలా మంది మహిళలు తమ కెరీర్ ను తొందరగా సెటిల్ చేసుకుని సరైన జోడి వెతుక్కుని హాయిగా సెటిల్ అవుతున్నారు. అంటే.. వివాహం విషయంలో అబ్బాయిల ఆలోచన కూడా ముఖ్యం. వారు కూడా మారితేనే భార్యాభర్తల వైవాహిక జీవితం బాగుంటుంది.
*రూపశ్రీ.
మూలాల ముంగిలికి లాక్కెళ్లే పండుగ.. సంక్రాంతి..!
Publish Date:Jan 14, 2026
కొత్త ఏడాదిలో అతిగొప్ప సంకల్పం.. మీరు బాగుండాలంటే ఇది చేయండి..!
Publish Date:Jan 13, 2026
మనిషికి, డబ్బుకు మధ్య సంబంధం!
Publish Date:Jan 12, 2026
దుఃఖాలు.. సమస్యలకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి..!
Publish Date:Jan 10, 2026
డయాబెటిస్, అసిడిటీ మందులు వాడుతున్నారా? ఈ నిజాలు తెలుసా?
Publish Date:Jan 16, 2026
ఏ జబ్బు వచ్చినా దాన్ని నయం చేయడానికి మందులు చాలా అవసరం. మందులను సరైన సమయంలో తీసుకోవాలి. అలాగే వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం అస్సలు మంచిది కాదు. అయితే కొన్ని మందులను డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి సంకోచం లేకుండా ఎక్కువ కాలం పాటు సమస్య అనిపించినప్పుడల్లా వాడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ఎక్కువకాలం పాటు మధుమేహం, గ్యాస్ సమస్యలకు మందులు వాడుతూనే ఉంటారు. ఈ మందుల వాడకం వల్ల విటమిన్ లోపాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందులోనూ విటమిన్-బి12 చాలా అరుదుగా లభించే విటమిన్. ఈ విటమిన్-12 విటమిన్ డయాబెటిస్, అసిడిటి మందుల వాడకం వల్ల తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
డాక్టర్ దగ్గరకు వెళ్లి వైద్యుల వద్ద రెగ్యులర్ గా చెకప్ చేయించుకునే అలవాటు భారతదేశంలో చాలా తక్కువ. మరీ ముఖ్యంగా గ్యాస్ సంబంధిత సమస్యలు, డయాబెటిస్ వంటి సమస్యలకు ఎక్కువ సార్లు వైద్యులను కలవాల్సిన అవసరం లేదని అనుకుంటారు. ఈ సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి వైద్యులను కలిస్తే వారు రాసిచ్చిన మందులను అలా జీవితాంతం అయినా మింగుతూ సమస్యను నిద్రపుచ్చే ఆలోచనలో ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ మందులను డాక్టర్ ను కలిసిన ప్రతి సారి డోస్ తగ్గించడం, ఎక్కించడం జరుగుతుంది. ఇది తెలియకుండా ఒకే డోస్ ను దీర్ఘకాలం వాడటం విటమిన్ స్థాయిల మీద ప్రమాదం చూపిస్తుంది.
గ్యాస్, డయాబెటిస్ కు సంబంధించిన మందులను సంవత్సరాల తరబడి డాక్టర్ సలహా లేకుండా రెగ్యులర్ గా వాడుతూ ఉంటే అది శరీరంలో విటమిన్-బి12 లోపానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
లక్షణాలు ఇవే..
అలసట, తలతిరుగుడు, తిమ్మిరి, చేతులు కాళ్లలో జలదరింపు వంటి సమస్యలు విటమిన్-బి12 లోపిస్తే వస్తాయి. మెట్లు ఎక్కడం కష్టంగా అనిపించడం, మతిమరుపు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
విటమిన్-బి12 ఎంత ఉండాలి..
నేషనవ్ ఇన్స్టిట్యూట్ ఆప్ హెల్త్ ప్రకారం సీరం, ప్లాస్మా లో విటమిన్-బి12 స్థాయిలు 200 లేదా 250pg/ml కంటే తక్కువగా ఉంటే ల్యాబ్ రిపోర్ట్ లలో అది చాలా తక్కువగా ఉన్నట్టు. ఇది విటమిన్-బి12 లోపాన్ని సూచిస్తుంది.
గ్యాస్, డయాబెటిస్ మందులను ఎక్కవ కాలం వాడటం వల్ల పేగులలో విటమిన్-12 శోషణ దెబ్బతింటుంది. అలాగే కడుపు ఆమ్లాన్ని కూడా తగ్గిస్తుంది. దీని వల్ల ఆహారం నుండి ప్రోటీన్ విడుదల జరగదు. అందుకే గ్యాస్, డయాబెటిస్ మందులను ఎక్కువ కాలం డాక్టర్ సలహా లేకుండా వాడటం మంచిది కాదని అంటున్నారు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 అలవాట్లు..!
Publish Date:Jan 14, 2026
చదువుకీ గుండెపోటుకీ సంబంధం ఉంది!
Publish Date:Jan 13, 2026
చలికాలంలో నువ్వులు, అవిసె గింజలు తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!
Publish Date:Jan 12, 2026
సమయానికి తినకపోతే ఈ సమస్య రావడం పక్కా..!
Publish Date:Jan 10, 2026