పిల్లలంటే అమ్మకి ఎంతో ప్రేమ. వారికి ఏ బాధా కలగకుండా చూసుకోవాలనుకుంటుంది. వారి ప్రతి కోరికా తీర్చాలనుకుంటుంది. పిల్లలు అడిగిందే తడవుగా వారు కోరినవన్నీ కొనివ్వాలనుకుంటుంది. అయితే ఇలా కోరినవన్నీ పొందటానికి అలవాటు పడ్డ పిల్లలు, కోరినది దొరకనపుడు సర్దుకుపోవటం ఎలాగో నేర్చుకోలేరు. మన చేతుల్లో వున్నంతవరకు వాళ్ళకి అన్నీ అందుబాటులో వుంచుతాం. కానీ జీవితంలో కోరినవన్నీ దొరకాలని లేదు కదా! మరప్పుడు దొరికిన దానితో సర్దుకుపోవటం ఎలాగో పిల్లలకు తెలీక ఇబ్బంది పడతారు. అందుకే గెలుపు, ఓటములు, సర్దుకుపోవటం వంటివన్ని మనమే పిల్లలకి రుచి చూపించాలి. ఇందుకు సంబంధించిన ఓ కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఓ చిన్న కుటుంబం నివసిస్తోంది. తండ్రి ఓ చిన్న ఉద్యోగం చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలని పోషిస్తూ వుండేవాడు.  సంపాదన తక్కువైనా పిల్లలు ఏది అడిగినా దానిని తీర్చాలని తాపత్రయం పడేవాళ్ళు ఆ దంపతులు.  ఒకసారి సెవెంత్ క్లాసు చదువుతున్నపుడు వాళ్ళ పెద్దకొడుకు రాకెట్ కావాలని అడుగుతాడు. తన ఫ్రెండ్స్‌కి వాళ్ళ మావయ్య అమెరికా నుంచి బొమ్మ రాకెట్ తెచ్చాడని, అలాంటిది తనకీ కావాలని పేచీ పెడతాడు. పిల్లల  కోరికలన్నీ తీర్చాలని వున్నా, ఈ కోరిక తీర్చటం వాళ్ళ స్థోమతకు మించినది. ఎలా మరి? అని మథన పడతారు అ దంపతులు. రాకెట్ కోసం పిల్లాడి పేచీ రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. చివరికి పిల్లాడి తల్లి ఓ నిర్ణయానికొస్తుంది. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి బోలెడన్ని రంగు కాగితాలు, జిగురు వంటివి తెచ్చిపెడుతుంది.   పిల్లలురాగానే వాళ్ళముందు రంగు కాగితాలు, కత్తెర, జిగురు పెడుతుంది. ఈ రోజు మనమే మంచి ఆట ఆడబోతున్నాం. ఈ రంగురంగు కాగితాలతో మీకు నచ్చినట్టు స్టార్స్‌ని, మూన్‌ని, సన్‌ని ఇలా అంతరిక్షాన్నంతటినీ మన గోడమీదకి తీసుకురావాలి. మీ గదిలోని గోడ పైన మీ ఇద్దరి క్రియేటివిటీతో అంతరిక్షాన్ని రెడీ చేస్తే ఆ అంతరిక్షం పైకి వాళ్ళే రాకెట్‌ని నేను మీకు ఇస్తాను అంటుంది. ఇక పిల్లలిద్దరూ హుషారుగా పని మొదలుపెడతారు గంటలు గడుస్తాయి. అమ్మా అయిపోయింది అని పిలుస్తారు. గోడ నిండా చుక్కలు, గ్రహాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. రాకెట్ ఏది అని అడుగుతారు పిల్లలు. ఆ తల్లి చిన్నగా నవ్వి మీ గదిలోని ఈ అంతరిక్షoలోకి వెళ్ళటానికి ఇదిగో ఈ కాగితం రాకెట్ సరిపోతుంది చూడండి అంటూ వివిధ సైజుల్లో చేసిన పేపరు రాకెట్లని చూపిస్తుంది. ఇదిగో ఎవరి రాకెట్ ఎక్కడికి వెళుతుందో విసరండి అంటుంది. పిల్లలిద్దరూ    పేపర్ రాకెట్లు విసురుతారు. ఆ ఆట వాళ్ళకి ఎంతో నచ్చుతుంది. మా ఫ్రెండ్ దగ్గరైతే బ్యాటరీలతో కొంతదూరం ఎగిరే రాకెట్ వుంది కానీ మన దగ్గర అంతరిక్షమే వుంది అంటారు. వాళ్ళ ఆనందాన్ని చూసిన తల్లికి అనిపిస్తుంది. పిల్లలు అడిగినవి మన చేతుల్లో లేనపుడు ‘‘లేదు’’ అని చెప్పటం కాదు వాళ్ళని ఎలా మళ్లించాలో తెలిసివుండాలి. ఆ తర్వాత ఆ పిల్లలు ఎప్పుడూ ఏ బొమ్మా కావాలని పేచీ పెట్టలేదు. నచ్చిన బొమ్మ కనిపిస్తే దానిని స్వయంగా ఎలా చేసుకోవచ్చో ఆలోచించేవారు.  అమ్మ సాయంతో రకరకాల బొమ్మలు తయారు చేసుకున్నారు. వారి ఆలోచనలకి పదును పెట్టారు, కొన్న బొమ్మలతో కూడా దొరకనంత తృప్తిని పొందారు. అన్నీ తెలుసుకోలేని వయను పిల్లలది. వారికి నిజమైన ఆనందాన్ని రుచి చూపిస్తే తప్పకుండా వారు ఆ దారిలో నడుస్తారు.  ఈసారి పిల్లలు అడిగినవన్నీ సమకూర్చాలని అనిపిస్తే ఒక్కసారి ఈ కథ గుర్తుచేసుకుంటారు కదూ!

గిల్లికజ్జాలతో కాస్తంత జాగ్రత్త   చిన్నతనంలో ఇంట్లో  పిల్లలు ఒకరిని ఇంకొకరు ఏడిపించుకోవటం మాములే. కాని అలంటి గిల్లికజ్జాలను మనం చూసిచూడనట్టు  ఊరుకోవటం కూడా అంట మంచిది కాదంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఇలాంటివి పిల్లల మనసు మీద మాత్రమే కాదు, వారి చదువు, నిద్ర, ఆహారం మీద కూడా ఎంతో ప్రభావాన్ని చుపిస్తాయట. ఇంట్లో ఉండే తోడపుట్టినవారు ఒకరు ఇంకొకరిని అదే పనిగా ఆటపట్టిస్తూ,ప్రతి నిమిషం ఏడిపిస్తూ ఉండటం కనిపిస్తే దానిని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకుని వారిని గమనించాలట. ఎందుకంటే ఏడిపించే పిల్లల బిహేవియర్ లో ఎలాంటి మార్పు లేకపోయినా వాళ్ళు ఎవరినైతే ఏడిపిస్తున్నారో వారిలో మాత్రం ఎన్నో మార్పులు కనిపిస్తాయట. మన దేశంలో నూటికి 35 శాతం మంది పిల్లలు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారట. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులు అయిన ఇళ్ళల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతుందిట.   దీనిని గుర్తించటం ఎలా? ఇదో పెద్ద సమస్యా  అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ సమస్యతో బాధపడే పిల్లలు వచ్చి పేరెంట్స్ తో వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు చూడు అని చెపితే అది అందరి ఇళ్ళల్లో ఉండే గోలగానే మనం చూస్తాం.కాని అదే వాళ్ళకి చెప్పుకోలేని ప్రొబ్లమ్. ఇటువంటి సమస్యని ఎదుర్కొనే పిల్లలు సరిగా భోజనం చెయ్యరు,చదువుపై సరిగా దృష్టి పెట్టలేకపోతారు,అందరిలో తొందరగా కలవరు. ఏవిషయానికి వెంటనే స్పందించరు. మొహంలో  ఎక్స్ప్రెషన్ చూపించరు. ఏదో కోల్పోయిన వాళ్ళలా దిగాలుగా కూర్చుంటారు.     అంతేకాదు ఇంట్లో ఉండే పిల్లలు ఒకరిని ఇంకొకరు కావాలని ఎవోయిడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండే వీరు వాళ్ళ అక్కగాని అన్నయ్యగాని ఊరు వెళ్లి పేరెంట్స్ దగ్గర ఒక్కరు ఉంటే ఏంటో హుషారుగా ఉంటారు. చెప్పలేని హాపినేస్స్ వారి ముఖంలో కనిపిస్తుంది.   దీనికి పరిష్కారం ఎలా? ఇలాంటి సమస్య ఎదురైనప్ప్పుడు ముందుగా దీనిని గుర్తించటం అవసరం. ఇంట్లో సాధారణంగా పేరెంట్స్ పెద్ద పిల్లలకు వాళ్ళ కన్నా చిన్నవాళ్ళని చూసుకునే భాద్యతని అప్పగిస్తూ ఉంటారు. దానితో పెద్దవారు దీనినే ఆసరాగా తీసుకుని తమ అజమాయిషీ చెలాయించే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఎక్కడ కూర్చోవాలో,ఎవరితో ఆడాలో, ఎవరితో మాట్లాడాలో అన్ని విషయాల్లో తమ పెద్దరికాన్ని చూపిస్తూ ఉంటారు. ఇలా మొదలైన సమస్యని చిన్నగా ఉన్నప్పుడే తల్లితండ్రులు గుర్తించి వాళ్ళ ఇద్దరి మధ్య సానుకూల వాతావరణాన్ని పెంపొందించేలా చేయాలి. తిరిగి వాళ్ళు మామూలు స్థితికి వచ్చే దాకా ఒంటరిగా ఇద్దరినీ వదలకూడదు. వీలయితే సమస్య సర్దుకునేదాకా ఇద్దరినీ కాస్త దూరంగా ఉంచాలి. అల దూరంగా ఉంచిన సమయంలో ఇద్దరి మద్య ఆప్యాయత నెలకోనేలాగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి.   ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలని సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక,శారీరిక ఆరోగ్యంపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. ...కళ్యాణి

పిల్లలు త్వరగా కోలుకోవాలంటే...     పిల్లలు సందడి చేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే పండువలా ఉంటుంది. కానీ వాళ్లు కాస్త ఆనారోగ్యం పాలయినా, నీరసించినా మనసు విలవిల్లాడిపోతుంది. వాళ్లు కోలుకుని మామూలుగా అయ్యే వరకూ ప్రాణం కొట్టుకుంటుంది. అదే పిల్లలు త్వరగా కోలుకునేలా చేయడమెలాగో తెలుకున్నారనుకోండి... హైరానా పడాల్సిన అవసరమూ ఉండదు. మన పిల్లలు ఎక్కువకాలం అనారోగ్యంగానూ ఉండరు. * పిల్లలు అనారోగ్యం పాలవ్వగానే కంగారు పడిపోకండి. ఏమీ కాలేదు, త్వరగానే తగ్గిపోతుంది అని చెప్పండి. మీరు హైరానా పడితే వాళ్లకేదో అయిపోయిందనుకుంటారు. ఇంకా నీరసించిపోతారు. * అనారోగ్యం ఎందుకు వచ్చిందో ముందు మీరు అంచనా వేసుకోండి. తద్వారా ఏం చేయాలో డాక్టర్ ని అడిగో, నెట్ లో చూసో తెలుసుకోండి. * మందులు వేసుకోవడానికి నానా యాగీ చేస్తారు పిల్లలు. అలా అని బలవంతం చేసి, ఏడిపించి వేయకండి. మందులు ఎందుకు వేసుకోవాలో వివరించండి. లేచి ఆడుకోవాలంటే అవి అవసరమని చెప్పండి. ఏ పద్ధతిలో వేస్తే వాళ్లకు ఇబ్బందిగా ఉండదో ఆలోచించి అలా చేయండి. * ఆహారం విషయంలో జాగ్రత్త. పిల్లలు ఫుడ్ దగ్గర టెంప్ట్ అయిపోతారు. తినకూడనివి తినేస్తారు. కాబట్టి ఓ కన్నేసి ఉంచండి. * నచ్చినట్టు ఉండనివ్వండి. టీవీ చూడటమో... పెయింటింగ్ వేయడమో... ఒళ్లు అలసిపోకుండా వాళ్లు ఏం చేస్తానన్నా చేయనివ్వండి. మైండ్ రిలాక్స్ అయితే త్వరగా కోలుకుంటారు. * అనవసరమైన విషయాలు మాట్లాడకండి. నువ్వు అలా చేశావు, అందుకే ఇలా అయ్యింది అనకండి. స్కూలు పోతోంది, త్వరగా కోలుకోవాలి అంటూ ఒత్తిడి చేయకండి. * ఎక్కువసేపు వాళ్లతో గడపండి. మనం చూపించే ప్రేమ అన్నిటికంటే పెద్ద మందు. కబుర్లు చెప్పండి. వాళ్లతో కలిసి ఆడి పాడి నవ్వించండి. * అనారోగ్యం పాలవ్వడం వల్ల మనకి ఎంత నష్టమో, కోలుకునేవరకూ ఎన్ని మిస్సయిపోతామో వాళ్లు చక్కగా ప్రేమగా వివరించండి. దానివల్ల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పోయి శ్రద్ధ పెరుగుతుంది. Sameera

మీ పిల్లలకి డబ్బు గురించి తెలుసా?     చాలామంది తల్లిదండ్రులు డబ్బు అనేది తమకు సంబంధించిన విషయం అనుకుంటారు. పిల్లలకు దాని గురించి తెలియాల్సిన అవసరం లేదనుకుంటారు. దానివల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వారికి తెలియదు. డబ్బు గురించి చెప్పకుండా, డబ్బు విలువ గురించి తెలియజెప్పకుండా పెంచడం వల్ల పిల్లలకు అయితే డబ్బు వ్యవహారాలు తెలియకుండా పోతాయి. లేదంటే వాళ్ల దృష్టిలో డబ్బు లోకువైపోతుంది. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం, డబ్బు కోసం తప్పుడు దారులు తొక్కడం కూడా జరుగుతుంది. ఇలాంటివి జరక్కూడదంటే పిల్లలకు డబ్బు గురించి తెలియాలి. మీది మధ్య తరగతి కుటుంబం అయితే కచ్చితంగా తెలిసి తీరాలి. - మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకునేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్ వాల్వ్ చేయండి. దేనికి ఎంత కేటాయిస్తున్నారో, ఎందుకు అంతే కేటాయిస్తున్నారో వాళ్లకు తెలియనివ్వండి. - ఇంట్లోకి కావలసిన వస్తువులు, సరుకులు కొనేటప్పుడు పిల్లల్ని వెంట తీసుకెళ్లండి. ఏం కొంటున్నారు, తక్కువలో వచ్చేలా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు వంటివి వాళ్లకి తెలిసేలా చేయండి. - అప్పుడప్పుడూ సరుకులు తెమ్మని పిల్లలకే చెప్పండి. ఇచ్చిన డబ్బులో వీలైనంత ఎక్కువ మిగిలిస్తే ప్రైజ్ ఇస్తానని చెప్పండి. - పిల్లలకు మొదట్నుంచీ పొదుపు చేయడం నేర్పండి. కిడ్డీ బ్యాంక్ లో ఎంతో కొంత జమ చేస్తూ ఉండమని చెప్పండి. అది నిండిన ప్రతిసారీ వాళ్లకు అవసరమైనదేదైనా కొనుక్కునేలా చేయండి. దానివల్ల అవసరాలు తీర్చుకోవాలంటే డబ్బు దాచుకోవాలన్న విషయం తెలుస్తుంది. - వేరే వాళ్ల దగ్గరున్న వస్తువుల్ని చూసి పిల్లలు మారాం చేస్తుంటారు. అవి మీరు కొనే పరిస్థితుల్లో లేకపోతే కోప్పడకండి. ఎందుకు మీరు కొనలేరన్నది చెప్పండి. మీ బడ్జెట్లో దాన్ని రీప్లేస్ చేసి చూపించండి. వాళ్లే శాటిస్ ఫై అవుతారు. అలా చేయకుండా కోప్పడితే వాళ్లలో బాధ, అసంతృప్తితో పాటు దాని మీద ఆశ కూడా మిగిలిపోతుంది. - పిల్లలతో అప్పుడప్పుడూ బిల్స్ కట్టించండి. దానివల్ల దేనికెంత అవుతుందో తెలుస్తుంది, వేటినెంత జాగ్రత్తగా వాడాలో తెలుస్తుంది. - ఇతరులకు ఇవ్వడం కూడా నేర్పించండి. వాళ్ల చేతులతో లేనివాళ్లకి ఇప్పించండి. నీ దగ్గరున్న దాన్ని ఇతరులకి కూడా పంచాలి అని చెప్పండి. - డబ్బు గురించి చెప్పాలి కానీ మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపించకండి. డబ్బు అవసరమే కానీ అదే జీవితం అన్న ఫీలింగ్ పిల్లలకు రానివ్వకూడదు. కాబట్టి డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలన్నది స్పష్టంగా చెప్పాలి. గొప్ప పనులు చేయడం కోసం ఆస్తి పాస్తుల్ని సైతం కాదనుకున్న వాళ్ల కథలను చెప్తూ ఉండండి. చిన్నపిల్లలకు ఇవన్నీ ఎందుకు అని చాలామంది అనుకుంటారు. కానీ ఏదైనా చిన్నతనంలోనే నేర్పాలి. బాల్యంలో నేర్చుకున్నవే వాళ్లను జీవితాంతం ముందుకు నడిపిస్తాయన్న విషయం గుర్తుంచుకోండి. - Sameera  

గోళ్లు కొరికే పిల్లలకు ఐక్యూ తక్కువా..!     గోదావరి సినిమా చూశారా? అందులో హీరోయిన్ కమలినీ ముఖర్జీ బరబరా గోళ్లు కొరికేస్తూ ఉంటుంది. నిజానికి ఈ అలవాటు చాలామందికి ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు గోళ్లు బాగా కొరుకుతుంటారు. కొందరైతే వేళ్లు గాయపడి రక్తం వచ్చేలా కొరికేసుకుంటూ ఉంటారు. ఏదో అలవాటులే అని పెద్దవాళ్లు చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ ఇది వదిలేయాల్సిన విషయం కాదు అంటున్నారు నిపుణులు. గోళ్లు కొరకడం అలవాటుగా మొదలయ్యి సమస్యగా మారుతుందట. * టెక్సాస్ మెడికల్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లారెన్స్ పిల్లలు గోళ్లు కొరకడం అన్న అంశంపై పెద్ద పరిశోధనే చేశారు. ఆయన చెప్పేదేమంటే... పిల్లల్లో ఈ అలవాటుని పోగొట్టడానికి ముందు వాళ్ల మనసును చదవాలట. ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు గోళ్లు ఆటోమేటిగ్గా నోట్లోకి వెళ్లిపోతాయట. కాబట్టి పిల్లలు గోళ్లు కొరుకుతుంటే వాళ్లకేదైనా సమస్యగానీ భయంగానీ ఉందేమో కనుక్కోవాలి. * ఒత్తిడి మరీ ఎక్కకువైపోతే అది మెంటల్, ఎమోషనల్ డిజార్డర్ గా మారుతుందట. అదే కనుక జరిగితే పరిస్థితి ఎంత తీవ్రమవుతుందంటే నిద్రలో తమకు తెలీకుండానే గోళ్లు కొరికేసుకుంటారట. అలా కనుక చేస్తుంటే వెంటనే చైల్డ్ సైకియాట్రిస్టుకి చూపించి సమస్య ఏ స్థాయిలో ఉందో చూపించాలి. వాళ్ల మనసులో ఉన్న భయాలేంటో తెలుసుకుని వాటిని పోగొట్టాలి. * అస్తమానం గోళ్లు కొరుకుతూ ఉంటే... గోళ్లపై పేరుకున్న బ్యాక్టీరియా లాలాజలంతో కలిసి బుజ్జాయిల బొజ్జలోకి వెళ్లిపోతుంది. కాబట్టి వాళ్లు ఆ అలవాటు మానేవరకూ పిల్లల గోళ్లను ఎప్పటికప్పుడు మీరే కత్తిరించేయడం, చేతుల్ని శుభ్రంగా ఉంచటం చేయాలి. * గోళ్లు కొరికే అలవాటున్న పిల్లల్లో ఐక్యూ తక్కువగా ఉంటుందని రష్యాలో జరిపిన ఓ పరిశోధనలో తేలింది. వాళ్లు చాలా డల్ గా ఉంటారట. దేనిలోనూ ప్రతిభ చూపించరట. మీ పిల్లలు కనుక చదువులో వెనుకబడుతుంటే... వాళ్లకి గోళ్లు కొరికే అలవాటుందేమో చూసుకోండి. ఉంటే వీలైనంత త్వరగా ఆ అలవాటుని దూరం చేయండి. * ఈ అలవాటు కనుక మరీ ముదిరిపోతే చికిత్స కూడా ఉంది. కౌన్సెలింగ్, హిప్నాటిజం ద్వారా ఈ అలవాటును పోగొడతారు. లేదంటే పళ్లకు ప్రివెన్టర్ అనే ఓ చిన్న క్లిప్పును అమరుస్తారు. ఇది గోళ్లు కొరికే ప్రయత్నానికి అడ్డు పడుతుంది. చూశారు కదా.. ప్రతి అలవాటు వెనుకా ఓ కారణం ఉంటుంది. అందుకే మీ పిల్లలు గోళ్లు కొరకడానికి లైట్ గా  తీసుకోకండి. వీలైనంత త్వరగా ఆ అలవాటును పోగొట్టండి. అలవాటును సమస్యగా మారనీకండి. - Sameera

పసిపిల్లలకి నీళ్లు పట్టించకండి- చాలా ప్రమాదం     పిల్లలకి ఆర్నెళ్లు వచ్చేదాకా నీళ్లు పట్టించవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆరునెలల వచ్చేదాకా తల్లిపాలు/ పోత పాలు తప్ప మరేదీ పిల్లలకి అందించవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో ఆరోనెలలో అన్నప్రాసన చేయడం వెనక కూడా ముఖ్య ఉద్దేశం ఇదే! ఇంతకీ ఆరునెలలలోపు పిల్లలకి నీళ్లు కూడా ఎందుకు పట్టకూడదు? అన్న ప్రశ్నకి చాలా స్పష్టమైన జవాబులు ఉన్నాయి. తల్లిపాలలో పోషకపదార్థాలతో పాటుగా 80 శాతం నీరు ఉంటుంది. ఈ నీరు పిల్లల అవసరాలకి తప్పకుండా సరిపోతుంది. ఇది కాకుండా పైనుంచి మంచినీరు అందిస్తే వారి శరీరం తట్టుకోలేదు. ఎందుకంటే పసిపిల్లల కిడ్నీలు ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ఉండవు. దాంతో నీటితో పాటుగా శరీరం నుంచి సోడియం అనే ముఖ్యమైన ఖనిజం కూడా మూత్రం ద్వారా వెళ్లిపోతుంది. ఈ పరిస్థితిని water intoxicatio అంటారు. water intoxicatio పిల్లల మెదడు మీద ప్రభావం చూపుతుంది. మత్తులోకి జారిపోవడం, మొహం ఉబ్బిపోవడం, ఫిట్స్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లవాడి శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. వాంతులు, విరేచనాలు కూడా మొదలవ్వవచ్చు. ఈ ప్రాథమిక లక్షణాలను కనుక అశ్రద్ధ చేస్తే, పిల్లవాడు ఏకంగా కోమాలోకి జారిపోయే ప్రమాదం ఉంది. పిల్లలకి నీళ్లు పట్టించడం వల్ల ఏర్పడే మరో ప్రమాదం – పోషకాహారలోపం! పిల్లలకి నీళ్లు పట్టించగానే వారి చిన్ని పొట్ట కాస్తా నిండిపోతుంది. దాంతో తల్లిపాలు తాగడం తగ్గించేస్తారు లేదా పూర్తిగా మానేస్తారు. ఆ వయసు పిల్లలకి తల్లిపాలే ఆధారం కాబట్టి, ఇది పోషకాహార లోపానికి దారితీస్తుంది. పిల్లలకి బయటి నీళ్లు పట్టడం వల్ల విరేచనాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. పసిపిల్లలలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, వాళ్లకి బయటి నుంచి పట్టే నీరు ఏమాత్రం తేడాగా ఉన్నా జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. పాల పౌడరులో నీళ్లు కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్యాకెట్‌ మీద సూచించిన మోతాదుకన్నా ఎక్కువ నీటిని పాలలో కలిపి ఇవ్వకూడదు. పైగా ఆ నీటిని తప్పకుండా కాచి చల్లార్చి ఉండాలి. లేకపోతే పైన చెప్పుకొన్న ప్రమాదాలన్నీ డబ్బాపాలు తాగే పిల్లలకి కూడా వర్తిస్తాయి. అంతేకాదు! ఆరోగ్యానికి మంచిదే కదా అని వైద్యుల సలహా లేకుండా ORS లాంటి పానీయాలు, విటమిన్‌ సిరప్పులు పట్టించినా కూడా ప్రమాదమే! పిల్లలకి నీరు పట్టించడం వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట! అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆర్నెళ్లులోపు పిల్లలకు వీలైనంతవరకూ తల్లిపాలే పట్టించమని సూచిస్తోంది. ఆఖరికి ఎండాకాలంలో కూడా తల్లిపాలతోనే పిల్లల దాహం తీరిపోతుందట. కాదూ కూడదు అంటే ఒకసారి వైద్యుని సంప్రదించాకే నీళ్లు పట్టించే ఆలోచన చేయమని అంటున్నారు. - నిర్జర.

పిల్లలతో మాట్లాడటం నేర్చుకోండి!     పిల్లలతో మాట్లాడటం ఒక కళే. అది తెలియకపోవడం వల్లే పేరెంట్స్ కీ, పిల్లలకీ మధ్య కమ్యునికేషన్ గ్యాప్ వస్తోంది అంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. పిల్లలు మానసిక రుగ్మతలకు గురవ్వడం, ఆత్మహత్యలకు పాల్పడటం వెనుక ప్రధాన కారణం అదేనని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి పిల్లలతో మాట్లాడటం నేర్చుకుని తీరాలి. ఇంతకీ ఎలా మాట్లాడాలి? - చాలామంది పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ మాట్లాడరు. అది చాలా తప్పు. అస్తమానం మాట్లాడక్కర్లేదు. కానీ ఏదో ఒక సమయంలో వాళ్లతో కాసేపు కబుర్లు చెప్పాలి. రకరకాల విషయాలు షేర్ చేసుకోవాలి. అప్పుడు వాళ్లకు కూడా మీతో విషయాలు షేర్ చేసుకోవడం అలవాటవుతుంది. - పిల్లలు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లమీదే దృష్టి పెట్టండి. వేరే పని చేసుకుంటూ వాళ్లతో సంభాషించకండి. దానివల్ల వాళ్లు చెప్పేది వినే ఆసక్తి మీకు లేదని వాళ్లు అనుకుంటారు. ఆపైన మీకు చెప్పాలన్న ఆసక్తి వాళ్లకీ - తప్పు చేస్తే అరవకండి. ఎందుకిలా చేశావ్ అని సౌమ్యంగా అడగండి. ఎప్పుడైతే అరిచారో భయం పెరుగుతుంది. నిజం చెప్పే ధైర్యం సన్నగిల్లిపోతుంది. - పిల్లలతో వాదనకు దిగకండి. లేదంటే వాదించే లక్షణం వాళ్లకి కూడా అలవడుతుంది. - కొందరు పిల్లలు చెప్పేది పూర్తిగా వినరు. ఏదైనా చెప్పబోతే ఇంకేం మాట్లాడకు, నోర్మూసుకో అంటూ అరిచేస్తుంటారు. మీకు ఆ అలవాటుంటే వెంటనే మానేయండి. లేదంటే వాళ్ల మాట మీరు వినరన్న భావం ఏర్పడి విషయాలు చెప్పడమే మానేస్తారు.     - అన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడకండి. పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ నీకేం తెలుసు, నేను చెప్పేది విను అనకండి. కొన్నిసార్లు మనకు తెలియని విషయాలు పిల్లలకు తెలుస్తాయి. అందుకే వాళ్లు చెప్పేది వినండి. చాలా బాగా చెప్పావు నాన్నా అని మెచ్చుకుని, అందులో ఉండే తప్పొప్పులు సాధ్యాసాధ్యాల్ని చర్చించండి. - అన్నిటినీ ఆదేశిస్తున్నట్టు చెప్పకండి. ఇది చెయ్యి అని సౌమ్యంగా చెప్పండి. అవసరమైనప్పుడు రిక్వెస్టింగ్ గా కూడా చెప్పండి. వాళ్లు చేయడానికి ఇష్టపడకపోతే ఎందుకు చేయమంటున్నారో, చేయడం వల్ల ఉపయోగం ఏంటో, చేస్తే మీరెంత ఆనందపడతారో తెలిసేలా చేయండి. చేయకుండా ఉండరు. - మాటతీరును విమర్శించకండి. గట్టిగా మాట్లాడతావెందుకు, మెల్లగా నసుగుతావెందుకు అని వంకలు పెట్టకండి. వాళ్లలో ఏదో లోపం ఉందనుకుంటారు. ఇలా మాట్లాడితే ఇంకా బావుంటుంది అంటూ నేర్పించండి. - Sameera

డైపర్ తో కాస్త డేంజరే!   పిల్లలన్నాక పక్క తడుపుతారు. కానీ అస్తమానం పక్క మార్చలేక, దుప్పట్లు ఉతకలేక డైపర్ తొడిగేస్తుంటారు చాలామంది. ఏ బైటికి వెళ్లినప్పుడో బట్టలు పాడవకుండా డైపర్ వేయడంలో తప్పు లేదు కానీ... రోజంతా డైపర్ వేసి ఉండటం వల్ల ఒక్కోసారి పిల్లలకు ర్యాషెస్ వచ్చేస్తుంటాయి. పాపం దురద, మంట పిల్లల్ని వేధిస్తుంటాయి. అందుకే డైపర్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.    * డైపర్ వేసేముందు ఓసారి వేడి నీటిలో ముంచిన బట్టతో శుభ్రంగా ఒళ్లు తుడిచి, తర్వాత పొడి బట్టతో తుడవండి. చక్కగా పౌడర్ రాసి అప్పుడు డైపర్  వేయండి.  * డైపరే కదా అని అలా వదిలేయకండి. తరచూ చెక్ చేయండి. పాస్ పోసినా, మల విసర్జన చేసినా వెంటనే తీసి శుభ్రం చేయండి. కాసేపు అలా వదిలేసి ఒళ్లు ఆరిన తర్వాతే డైపర్ వేయండి.  * డైపర్ మామూలుగా తొడిగేస్తుంటారు చాలామంది. కొన్నిసార్లు కొన్ని డైపర్ల వల్ల పిల్లలకు కంఫర్ట్ ఉండదు అన్న విషయాన్ని గమనించరు. మరీ టైట్ గా ఉన్నా, మెటీరియల్ పడకపోయినా పిల్లలు ఇబ్బంది పడటమే కాదు, చర్మ సమస్యలు కూడా వస్తాయి జాగ్రత్త.  * ఒకవేళ డైపర్ వల్ల ర్యాషెస్ కనుక వస్తే అవి తగ్గే వరకూ మళ్లీ డైపర్ వేయకండి.   * ర్యాషెస్ వచ్చిన చోట ఆలివ్ ఆయిల్ తో కాసేపు మసాజ్ చేసి, వేడి నీటితో కడిగేయండి. తరచూ అలా చేస్తూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. కొబ్బరి నూనె  అయినా ఫర్వాలేదు.   * అన్నిటికంటే ఉత్తమం ఏమిటంటే.. బైటికి వెళ్లినప్పుడు తప్ప ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ వేయకండి. కాస్త గాలి తగలనిస్తూ ఉండటం చాలా అవసరం. పిల్లలకు కూడా హాయిగా అనిపిస్తుంది.      ఈ జాగ్రత్తలు కనుక తీసుకోకుండా డైపర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సేఫ్టీ కోసం వాడే డైపరే డేంజరస్ గా మారి... పిల్లలకు చర్మసంబంధిత సమస్యలు, అలర్జీలు రావడం మాత్రం ఖాయం. -Sameera

Memory Boosters For Children   Memory Development Children, Memory Boosters Children, Kids Memory Booster: Parents who want their children to do well for their examinations can give them a boost by ensuring that their children get the proper foods to keep brain function.   Choline: Choline is used by the body to produce the neurotransmitter, acetylcholine, which is essential for the normal functioning of all cells. Choline is especially important for brain function as it affects the areas of the brain responsible for memory function and life-long learning ability. Choline is also required for the transportation of nutrients throughout the body including to the brain. A rich source of choline is egg and other sources include beef, cauliflower, wheat, peanuts and lettuce. Similar to taurine, choline is commonly fortified in milk powder.   Folic acid: High levels of homocysteine in the blood affect memory and folic acid lowers homocysteine levels. Foods which are rich in folic acid include whole-grain cereals, soybeans, spinach, green peas, broccoli and oranges. Nonetheless, there is insufficient data to support the use of folic acid as a memory booster.   Taurine: Taurine is an amino acid that supports neurological development and increases memory power of children. It is also thought to have antioxidant properties which aid in brain function. Taurine is found naturally in meat, fish and breast milk. Most milk powders are fortified with taurine as non-breast-fed infants’ ability to synthesise taurine (from their diet) is undeveloped and cow's milk (on its own) does not provide a sufficient amount.   Omega-3: The benefits of omega-3 include promoting brain development. Omega-3 contains eicosapentaenoic acid (EPA) and docosahexaenoic acid (DHA) which are the main ingredients for the benefits of omega-3. Low DHA levels are thought to be associated with problems such as intelligence, vision and behavior. Dietary sources of omega-3 fatty acids include fish oils and some plant or nut oils. Tuna and salmon are the common animal sources that provide DHA and EPA and peanuts, walnuts and almonds are the common plant sources. For children who do not enjoy eating fishes or nuts, they can take fish oils supplements. These are available as burstlets (capsules which burst and release the oils in them) and there are different flavors to appeal to a child. These supplements should preferably be given to a child who is 2 years old or older and a pharmacist can help to select the right fish oil supplement for your child.

మనకే కాదు... పిల్లలకీ ఇబ్బందులుంటాయ్!      * ఎంతసేపు తింటావ్, తిండి సరిగ్గా తినకపోతే బలమెలా వస్తుంది అంటూ తిట్టే తల్లులు కొందరు. మా పిల్లాడు అస్సలు తినడండీ అంటూ కంప్లయింట్ చేసే తల్లులు ఇంకొందరు. తింటావా తన్నమంటావా అంటూ బెత్తం పట్టుకునేవాళ్లు ఇంకొందరు. అయితే వీటన్నిటికంటే ముందు చేయాల్సింది ఇంకొకటుంది. మీ బిడ్డ తినకపోవడానికి వెనుక కారణాన్ని వెతకడం. అవును. పిల్లలు తిండి తినకపోవడానికి ఆటల్లో పడిపోవడం ఒక్కటే కాదు... ఏదైనా పెద్ద కారణం ఉండొచ్చు. వాళ్లకేదైనా సమస్య ఉండివుండొచ్చు. కాబట్టి ఆ కోణంలో కూడా ఓసారి ఆలోచించండి.      * పిల్లలు తిండి తినకపోవడానికి ఆరోగ్య సమస్యలు చాలాసార్లు కారణమవుతాయి. కాబట్టివాళ్లకి అన్నవాహికలో ఏదైనా సమస్య ఉందా, హార్మోన్ల లోపాలేమైనా ఉన్నాయి, ఆకలి సంబంధింత సమస్యలేమైనా ఉన్నాయా, మలబద్దకం ఉందా, అసిడిటీ ఏమైనా మొదలయ్యిందా, థైరాయిడ్ హార్మోన్లలో హెచ్చుతగ్గులేమైనా ఉన్నాయా, కాలేయ సమస్యలు కానీ కిడ్నీ సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లలకి ఈ సమస్యలా అనుకోకండి. మనకే కాదు... పిల్లలకీ చాలా ఇబ్బందులుంటాయి. అవి వాళ్లు చెప్పలేరు. మనకి అర్థం కాదు. అందుకే పిల్లలు తిండి తినకుండా మారాం చేస్తుంటే చిన్నతనం అని వదిలేయకుండా ఓసారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి.       * ఇక శారరీక సమస్యలతో పాటు మానసిక సమస్యలూ ఉంటాయ్. మన మనసు బాగోకపోతే మనం తిండి తింటామా? అలాగే పిల్లలకూ ఉంటుంది. మనసులో ఏదైనా బెంగ, దిగులు, భయం ఉంటే వాళ్లకి కూడా తిండి సహించదు. కాబట్టి పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. వాళ్లతో మాట్లాడాలి. ఏమైంది అంటూ లాలించి వాళ్ల మనసులో మాటను తెలుసుకోవాలి. ఆ బెంగను, భయాన్ని దూరం చేయాలి. అప్పుడు మీరు బలవంతంగా తినిపించాల్సిన అవసరం ఉండదు. వాళ్లంతట వాళ్లే తినేస్తారు.      * ఈ కోణంలో ఆలోచించేవాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. ఎందుకంటే చిన్నపిల్లలే కదా అని ఎక్కువ దూరం ఆలోచించకపోవడం వల్ల. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. ఆటల్లో పడినా పిల్లలకు ఆకలి వేస్తుంది. కాస్త లేటయినా వచ్చి తినేస్తారు. కానీ ఎంతకీ తినడం లేదంటే వాళ్లకి సమస్య ఉన్నట్టే. దాన్ని కనిపెట్టాల్సిన బాధ్యత మీదే. -Sameera 

పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే..   Jessy Naidu, Joy of Parenting Trainer. In The New Program "Joy of Pregnancy" You can learn about Bonding with Your Baby During Pregnancy. https://www.youtube.com/watch?v=BA40_q6TtTI

చిన్న పిల్లల్లో కలిగే ADHD వ్యాధి, దాని లక్షణాలు.. ADHD - Attention Deficit Hyperactivity Disorder is something that is found in about 11% kids. So what is ADHD? What are its symptoms? How can it be treated? What are the treatment options available? Answers to all these questions are answered by Dr. Sailaja Golla. https://www.youtube.com/watch?v=AJ92fHXwTI0

పాలిచ్చే తల్లికి పాఠాలు!     బిడ్డకి తల్లిపాలు అమృతంతో సమానం. కానీ కొన్నిసార్లు తనకు తెలియకుండా తల్లి ఆ అమృతాన్ని కలుషితం చేస్తుంటుంది. దానివల్ల బిడ్డకు బోలెడన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి పాలిచ్చే ప్రతి తల్లీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పనులు మానుకోవాలి. అవేంటంటే... * టీ, కాఫీలు ఎక్కువ తాగకూడదు. అవును నిజం. తల్లి తీసుకునే ఆహారంపై బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి టీ, కాఫీలు ఎక్కువ తాగి బిడ్డకు పాలివ్వకూడదు అంటున్నాయి కొన్ని పరిశోధనలు. కెఫీన్ మోతాదు ఎక్కువై పాల ద్వారా బిడ్డలోకి చేరితే బిడ్డకు కడుపు నొప్పి వస్తుంది అని కూడా అంటున్నారు. * పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్లకూడదు. ఏ ట్యాబ్లెట్ పడితే ఆ ట్యాబ్లెట్ వేసేసుకుంటే మీకు ఉపశమనం కలుగుతుందేమో కానీ మీ పాలు తాగే బిడ్డకు విషయమవుతుంది. కాబట్టి డాక్టర్ అనుమతి లేకుండా పొరపాటున కూడా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. * ధూమ, మద్యపానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. మారిన జీవనశైలి మహిళలకూ కొన్ని అలవాట్లు చేసింది. మామూలప్పుడు అవి తనకి మాత్రమే చేటు చేస్తాయి. కానీ పాలిచ్చే సమయంలో బిడ్డకు అంతకు రెట్టింపు చేటు చేస్తాయి. కొన్నిసార్లు వాళ్ల ప్రాణానికి ప్రమాదం కూడా ఏర్పడవచ్చు. * అలర్జీలు కలిగించే ఆహారం తీసుకోకూడదు. అంటే తల్లికి కాదు. మనకు అలర్జీ వస్తుందనుకుంటే మనం ఎలాగూ తినం. కానీ ఏదైనా తినేటప్పుడు బిడ్డకు దానివల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని ఆలోచించి తినాలి. తెలుసుకోడానికి ఇంటర్నెట్లు ఉన్నాయి. లేదంటే డాక్టర్ ని అడిగినా చెప్తారు.  * లోపలకు వెళ్లే ఆహారమే కాదు... బిడ్డ నోటికి తగిలే చర్మం కూడా శుభ్రంగా ఉండాలి. అందుకే శుభ్రంగా కడుక్కుని, తుడుచుకుని ఆ తర్వాతే పాలివ్వాలి.  * దుస్తులు, లో దుస్తులు, ముఖ్యంగా బ్రాసరీలు చాలా శుభ్రంగా ఉండాలి. డెటాల్ వేసి బాగా ఉతుక్కుని ధరించాలి. తల్లి కచ్చితంగా రెండు పూటలా స్నానం చేయాలి.  * బాడీ లోషన్లు, మాయిశ్చరయిజర్లు, బాడీ స్ప్రేల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శరీరమంతా పూసుకున్నా స్తనాలను మాత్రం వదిలేయాలి. లేదంటే వాటిలోని కెమికల్స్ పిల్లల నోటిలోకి వెళ్లిపోతాయి.            ఎన్నో కలలు కంటే ఒడిలోకి వచ్చిన బిడ్డ కోసం ఈ మాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా? ఒక్కసారి తల్లయ్యాక మీరు మీకు నచ్చినట్టు కాదు... మీ బిడ్డకు నచ్చినట్టు నడచుకోవాలి. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన పిల్లలకు పెద్ద పెద్ద కష్టాలను తెచ్చిపెడతాయి మరి!  -sameeranj

వడదెబ్బ తగలకుండ ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రతలు..   How to avoid heat stroke ? What kind of food we should take during summer ? What kind of precautions we should take in the season ? Dr P Janaki Srinath garu gives answers to all the answers. Watch the video here.. https://www.youtube.com/watch?v=fGXKe9ZYu3w  

Summer Baby Care Tips Summer can be a wonderful time for you and your baby. But it also means strong sun, heat, bugs and other thing that can be harmful for your infant. Here you'll find tips to make the summer a great time for you and you child. As the impact of high temperature, children will lose appetite or become anorexia. Therefore, the diet should be soft, easy to digest, insipid and rich in nutrition. To eat more fresh vegetables, melon and fruit, fish, shrimp, lean meat and bean products etc. And baby can also eat some porridge commonly which can clear heat and eliminating dampness, such as lotus seeds porridge and mung bean porridge etc. If baby sweats a lot, he should be supplied with water and salt in time. It is not suitable to drink much cold water. Pay attention to the food hygiene, prevent baby getting ill by the mouth and the occurrence of intestine infection. Baby's clothes should be loose-bodied and soft, so that it is convenient for activities, ventilated and cool; if high temperature weather, children can wear vests and shorts, the appropriate material choice of the clothes could be soft cotton, linen, silk and so on to facilitate sweat absorbing and heat eliminating; the colors of clothes should be light and cool oriented so as to reduce heat radiation. The sunlight is strong in summertime and contains a large number of ultraviolet. Strong sunlight will burn baby's tender skin and if the head of baby expose under the strong sunlight directly, it will also cause heatstroke. Therefore, baby should stay at home and have a rest during midday. It is not allowed to take baby out or even travel. If baby have to go out, they should wear a wide border straw-hat or take an umbrella to avoid the direct sunlight. And you must prepare sufficient drinking water such as salt water, sugar water and so on. You may also bring some medicine for clearing away summer heat, such as Rendan, rheo-camphoradin, essential balm, ageratum liquid medicine and so on to prevent heatstroke. Baby's living room should be ventilated and cool, quiet and clean. Room temperature should be maintained at 20-25 degrees and relative humidity should be 40%-60%. Ensuring adequate baby sleep, which should be no less than 9 to 10 hours a day. Do not use electric fans when sleeping to prevent cold. Don’t allow baby to stay in air-conditioned room all day to prevent diseases caused by air-conditioning. Take a warm water bath for baby in the evening and cover baby's belly with towel quilt to prevent cold and diarrhea. If baby sweat a lot, change and wash his wet clothes frequently to prevent heatstroke and heat rash.  

మీ పిల్లల్లో డిప్రేషన్ ఉంటే ఇలా చేయండి..   Many of us do not believe the fact that a child can be depressed. Many of us even do not believe even after finding a few changes in the child which says that he/she is #depressed. Dr. Purnima Nagaraja says that even child get depressed and shares some heart breaking stories of children getting depressed. Further she also discusses, how depression impacts lives and describes its symptoms, causes and treatment options. To know in detail, watch the video.  https://www.youtube.com/watch?v=KTnRktb-ajM  

కడుపుతో వున్నప్పుడు తలనోప్పి తీవ్రంగా రావచ్చు కొందరికి..  

కొడుకును పెంచాల్సింది ఇలాగే!   రోజులు మారిపోయాయి, ఆడా మగా తేడాలు పోయాయి అని నాగరికులు ఎంత చెబుతున్నా... ఎక్కడో ఒకచోట ఆ భేదభావం కనిపిస్తూనే ఉంటుంది. నువ్విలా చేయలేవు అనో, ఇలా చేయడం నీవల్ల కాదు అనో, నువ్విలా చేయకూడదు అనో ఏదో ఒక సమయంలో మగవాళ్లు ఆడవాళ్లను అంటూనే ఉంటున్నారు. దానికి కారణం మగవాళ్ల యాటిట్యూడ్ అనేది పెద్దల వాదన. మరి మీ అబ్బాయి యాటిట్యూడ్ ఎలా ఉందో ఎప్పుడైనా గమనించారా? మీకు కనుక కొడుకు ఉంటే... తనకి మీరు కొన్ని విషయాలు చిన్నతనం నుంచే చెప్పండి, నేర్పండి. రేపు పెద్దయ్యాక తను ఆదర్శవంతుడవ్వాలంటే ఇది తప్పనిసరి. - ఏడవొద్దు అని మీ అబ్బాయికి ఎప్పుడూ చెప్పకండి. చాలామంది అంటుంటారు.. మగపిల్లలు ఏడవకూడదు అని. అంటే ఆడపిల్లలే ఏడవాలి అని పరోక్షంగా చెబుతున్నట్టే కదా. ఆడవాళ్లు ఏడుస్తూనే ఉంటారులే అనే యాటిట్యూడ్ తనలో పెరిగిపోదూ! - ఆడపిల్లలను తప్ప మగపిల్లలను తల్లులు వంట పనిలో సాయమడగరు. అదీ తప్పే. వంట ఆడవాళ్లే చేయాలని లేదు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న చెఫ్స్ లో అత్యధికులు పురుషులే. అలా అని కెరీర్ కోసం వంట కాదు. ఇప్పుడు అలవాటు చేస్తే రేపు పెద్దయ్యాక భార్యకు సాయపడే అలవాటు వస్తుంది. ఇల్లు తుడవడం, గిన్నెలు కడగడం వంటివి మగపిల్లలు చేయకూడని పనులేవీ కాదని తప్పకుండా చెప్పండి. - ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఉంటే వాళ్లని ఎప్పుడూ సమానంగానే చూడండి. ఏ విషయంలోనూ అబ్బాయికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి అమ్మాయిని తక్కువ చేయకండి.     - మగపిల్లలు మరీ సౌమ్యంగానో, సుకుమారంగానో ఉంటే ఏంటి ఆడపిల్లలాగా అంటుంటారు. దాంతో మగాడు రఫ్ గా ఉండాలి అన్న భావన పేరుకుపోతుంది. తర్వాత ఏమవుతుందో మీకు వేరే చెప్పాలా? - ఆడపిల్లలతో గౌరవంగా మాట్లాడటం నేర్పించండి. చెల్లెలయినా సరే కొట్టడం, తిట్టడం చేయనీయకండి. - ఆడపిల్లల విలువేంటో తెలియజేయండి. చరిత్రలో గొప్ప గొప్ప మహిళల కథనాలు చెప్పండి. ఆడపిల్లలు కూడా చాలా సాధించగలరు అన్న నమ్మకం చిన్ననాటే ఏర్పడితే... ఆడవాళ్లను తక్కువగా చూసే అలవాటు రాదు. - పిల్లలు టీవీ చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్లను బలహీనంగా చూపించేవి, తప్పుగా చూపించే వాటిని చూడనివ్వకండి. కొన్నిసార్లు వాళ్ల చిన్ని బుర్రలకి అవి తప్పుగా అర్థమైతే తర్వాత వాళ్ల ఆలోచనాధోరణిపై, వ్యక్తిత్వంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. చిన్నతనంలోనే ఇంత అవసరమా అనుకోకండి. మొక్కై వంగనిది మానై వంగదు. చిన్నప్పుడు నేర్పలేనిది పెద్దయ్యాక నేర్పలేరు. పిల్లల మనసులు తెల్ల కాగితాలు. వాటిపై మొదటే మంచి అక్షరాలు రాయండి. వాటినే జీవితాంతం చదువుకుంటూ ఉంటారు. పాటిస్తూ ఉంటారు. ఆదర్శంగా నిలబడతారు. - Sameera