చలికాలంలో చిన్నపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి!

చిన్నపిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.  పిల్లలలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాతావరణ మార్పులకు వారి ఆరోగ్యం చాలా తొందరగా ప్రభావితం అవుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు చలికాలం కొనసాగుతున్న కారణంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు మరింత ఎక్కువగా ఉండాలి. చిన్న పిల్లలున్న ప్రతి  ఇంట్లో కొన్ని జాగ్రత్తలుతప్పనిసరిగా తీసుకోవాలని చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..

చల్లని వాతావరణం కొనసాగుతున్న కారణంగా చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి. దీనివల్ల  పిల్లలలో  సీజనల్ సమస్యలు ఎప్పటికప్పుడు చెక్ చేసినట్టు అవుతుంది. పిల్లలు ఎక్కువగా నిద్రపోతుంటారు కాబట్టి అప్పుడప్పుడు  వారిని తాకి ఉష్ణోగ్రత చెక్ చేసుకోవాలి.


చలికాలంలో పిల్లల శరీర ఉష్ణోగ్రతలు చాలా తొందరగా పెరగడం, అంతే తొందరగా పడిపోవడం జరుగుతుంది. చలిని భరించే క్రమంలో పిల్లలలో వేడి ఎక్కువగా, వేగంగా ఉత్పత్తి కావడం వల్ల పిల్లలో అల్పోష్ణస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

ఉష్ణోగ్రత స్థితినుండి పిల్లలను కాపాడుకోవాలి అంటే పిల్లలకు వెచ్చని దుస్తులు వేయాలి. అలగే పిల్లల పాదాలు, చేతులు, తలను కూడా వెచ్చగా ఉండేలా కవర్ చేయాలి. ఒట్టి ఒళ్లుతో పిల్లలను అస్సలు ఉంచకూడదు.

పిల్లలకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేయించడం . వారిని శుభ్రంగా ఉంచడం, అందంగా తయారుచేయడం తల్లుల అలవాటు. అయితే చలి దృష్ట్యా పిల్లలకు స్నానం చేయించడం తగ్గించాలి. వీలైనంత వరకు పిల్లలను వెచ్చని నీళ్లలో ముంచిన మెత్తని టవల్ లేదా నూలు బట్టతో ఒళ్లంతా తుడవాలి. చలికాలంలో ఇలా చేస్తే సరిపోతుంది.

పిల్లలకు స్నానం చేయిస్తే వారిని చల్లని వాతావరణం లేదా చలి గాలులకు శరీరం తగిలేలా ఉంచకూడదు. ఇంటి కిటికీలు. తలుపులు మూసి ఉన్న గదిలో పిల్లలను ఉంచాలి. లేకపోతే చాలా సులువుగా జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి.

చలికాలంలో లేత సూర్యకాంతిలో పిల్లలకు ఆవనూనెతో శరీరమంతా బాగా మసాజ్ చేయడం వల్ల పిల్లలలో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది పిల్లలు చురుగ్గా ఉండేలానూ, రోగనిరోధక శక్తిని పెంచేలానూ చేస్తుంది. పేగా పిల్లలలో కండరాలు బలపడతాయి. బాగా నిద్రపోతారు.

పిల్లల శరీరం పొరపాటున కూడా పొడిగా ఉండనివ్వకూడదు. స్నానం చేయించడం లేదా తడిబట్టతో ఒళ్లు తుడిచిన తరువాత  తప్పనిసరిగా పిల్లలకు లోషన్ రాయాలి. ఇది చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. చలికి చర్మం ఎఫెక్ట్ కాకుండా చేస్తుంది.

చిన్న పిల్లలు సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి  వారికి లభించే గొప్ప ఆహారం తల్లిపాలు. ఇది పిల్లలకు గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తని పెంచుతుంది. అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది.

                                        *నిశ్శబ్ద.