పిల్లలలో ఎముకలు బలంగా ఉండాలంటే రోజూ ఇదొక్కటి పెట్టండి చాలు!
పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి ఏం తినాలి? ఏం తాగాలి అన్న విషయాలపై అవగాహన కలిగి ఉంటారు. దానికి తగ్గట్టే ఆహార పానీయాలు తీసుకుంటారు. కానీ చిన్నపిల్లలకు తమ దీమ తమకు ఆరోగ్య అవగాహన ఉండదు. తల్లిదండ్రులు పిల్లలకు ఆహారం ఇవ్వడమంటే పెద్ద టాస్క్ లానే ఉంటుంది. పిల్లలు ఏదీ సరిగ్గా తినరు, తాగరు. ఏమైనా బలవంతంగా పెట్టాలని చూసినా సగం సగం తిని పారిపోతారు. ఇలాంటి పిల్లలకు పోషకాహారం అందకపోతే వారి ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది. మరీ ముఖ్యంగా పిల్లలకు సరిపడినంత కాల్షియం, ఐరన్ లభించకపోతే చాలా ఇబ్బందులు, పోషకాహార లోపం ఏర్పడతాయి. వీటిని అధిగమించడానికి పిల్లలకు తెలివిగా ఆహారం ఇవ్వాలి. ఒకే ఒక్క ఆహారం ఇవ్వడం ద్వారా పిల్లలలో చాలా పోషకాలు భర్తీ అయ్యేలా ప్లాన్ చెయ్యాలి. దీనికి నువ్వుల లడ్డు బెస్ట్ ఛాయిస్. పిల్లలకు రోజులో ఏదో ఒక సమయంలో నువ్వుల లడ్డు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజాలు ఏంటో తెలుసుకుంటే..
నువ్వులు చిన్నపిల్లలకు, మహిళలకు చాలా ముఖ్యమైన ఆహారం. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగి ఉంటుంది. నువ్వులలో మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి పిల్లలలో ఎముకలు, కండరాల పెరుగుదలకు చాలా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల నువ్వులు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.
నువ్వుల లడ్డును ప్రతిరోజూ పిల్లలకు ఇవ్వడం ద్వారా పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. వారిలో జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. నువ్వులలో ఉండే మంచి కొవ్వులు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం నాడీ వ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది.
పిల్లలు ఒక్క చోట కుదురుగా ఉండరు. వారికి ఆడుకోవడం అంటే ఇష్టం. కానీ కొంతమంది పిల్లలు కొద్దిసేపు ఆడుకోగానే అలసిపోయి నీరసంగా ఫీలవుతారు. ఇలాంటి పిల్లలకు రోజూ నువ్వుల లడ్డు తినిపిస్తే వారిలో శక్తి పెరుగుతుంది. నువ్వులలో ఉండే పోషకాలు పిల్లలకు గొప్ప సామర్థ్యాన్ని ఇస్తాయి. పిల్లలు రోజు మొత్తం చురుగ్గా ఉండేలా చేస్తాయి.
పిల్లలో ఎక్కువగా కనిపించేది కాల్షియం లోపం. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
నువ్వులలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణాశయ ఆరోగ్యాన్ని ప్రేగుల కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్దకం సమస్య అస్సలు దరిచేరదు.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల నువ్వులు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో సీజనల్ సమస్యల నుండి పిల్లలను దూరం ఉంచాలంటే నువ్వుల లడ్డు పర్పెక్ట్.
*నిశ్శబ్ద.