చిన్నపిల్లలకు ఏ వయసులో ఏ ఆహారం పెట్టాలో తెలుసా!

ఆహారం అందరికీ అవసరమే. మొక్కలు కూడా వాటి ఆహారాన్ని నేలలో ఉన్న ఖనిజాల రూపంలో తీసుకుంటాయి. ఇక జంతువులు, మనుషుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది? అయితే  పెద్దలు తీసుకునే ఆహారానికి పిల్లలు తీసుకునే ఆహారానికి చాలా తేడా ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు తల్లిపాలు లేదా వైద్యులు సూచించిన పాలే ఆహారం. దాదాపు 6నెలల వరకు పిల్లలకు పాలే ఇవ్వాలి. ఆ తరువాత నుండి పిల్లలకు క్రమంగా ఇతర ఆహారాలు అలవాటు చేస్తుంటారు. అయితే కొంతమంది తల్లులకు తమ పిల్లలకు ఏ వయసులో ఏ ఆహారం ఇవ్వాలో సరిగ్గా తెలియదు. అలాంటి వారికి అవగాహన కల్పించడం కోసం పిల్లల వయసును బట్టి ఇవ్వాల్సిన ఆహారం గురించి చిన్న పిల్లల వైద్యులు, పోషకాహార నిపుణులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే..

పిల్లలు పెరిగే కొద్దీ ఆహార క్రమం మారుతుంది. ద్రవాల నుండి మెల్లిగా వారు నమిలి తినే ఘనాహారాల వైపుగా వారి ఆహారపు అలవాట్లు మారుతాయి. ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల ఆహారంలో పిండి పదార్థాలు, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్స్, పాలు, పాల ఉత్పత్తులు మొదలైనవి తప్పనిసరిగా ఉండాలి. అలాగే పిల్లలలో జ్ఞాపకశక్తిని ప్రోత్సహించడానికి బ్రెయిన్ ఫుడ్, పిల్లలకు కావసిన ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేసే ఆహారం, కాల్షియం లోపం ఉండకుండా, విటమిన్లు, ఖనిజాలు అందేలా ఆహారం ఇవ్వాలి.

గుడ్లు ఇవ్వాలి..

ఏడాది దాటిన తరువాత పిల్లలకు గుడ్లు ఇవ్వాలి. గుడ్లలో విటమిన్-డి, విటమిన్-బి12, కాల్షియం, ఐరన్, ఒమెగా-3 యాసిడ్లు ఉంటాయి. ఇవి పిల్లలకు శారీరక  బలాన్ని ఇవ్వడంతో పాటు మెదడు ఎదుగుదలకు కూడా సహాయపడుతాయి.

చిలగడ దుంపలు..

ఆరు నెలలు దాటిన తరువాత చిన్నపిల్లల ఆహారంలో చిలగడ దుంపలు చేర్చవచ్చు. చిలగడ దుంపలో విటమిన్-ఎ, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. బీటా కెరోటిన్ తయారీకి పొటాషియం చాలా అవసరం.  చిలగడ దుంపను మెత్తగా ఉడికించి పెట్టడం మంచిది.

పాలు..

తల్లిపాల తరువాత పిల్లలకు సాధారణ పాలు కూడా ఇస్తుంటారు. అయితే ఏడాది వయసు లోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వడం నిషేదం. ఆవు పాలు తొందరగా జీర్ణం కావు. ఈ కారణంగా ఆవు పాలు ఇవ్వకూడదు. ఇక ఫార్ములా పాలు లేదా గేదె పాలు ఇవ్వవచ్చు. 2 సంవత్సరాల లోపు పిల్లలకు రోజుకు 200 మి.లీ కంటే ఎక్కువ పాలు ఇవ్వకూడదు. పాలుకూడా విటమిన్-సి, విటమిన్-డి, కాల్షియం వంటివి అందిస్తాయి. కాబట్టి పిల్లలకు పాలు మంచి ఆహారం.

                                                   
                                                    *నిశ్శబ్ద.