సుప్రిత ఫోటోలు...కేకరేపుతున్నావ్ కదా అంటు ఒకరు కామెంట్
on Jul 6, 2024
టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తల్లీకూతుర్ల మాదిరి కాకుండా స్నేహితుల్లా ఉంటారు. సురేఖ తన కూతురితో కలిసి పబ్స్ కి కూడా వెళ్తుంటుంది. ఈ విషయాన్ని డైరెక్టుగా ఒప్పేసుకుంటుందామె. అయితే రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే సుప్రిత.. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి రాకముందే సుప్రిత సోషల్ మీడియాలో బాగా ఫేమస్.
తల్లి సురేఖతో తరచూ రీల్స్, డ్యాన్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు తన గ్లామరస్ లుక్‌తోనూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ట్రోలర్స్ నుంచి ట్రోల్స్ కూడా ఎదుర్కునేది. అయినా తగ్గేదేలే అంటూ తన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ వేదిక షేర్ చేస్తూనే ఉంటుంది.
సుప్రితకి ఇన్ స్టాగ్రామ్ లో 859K ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సుప్రిత చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఎక్కడ దిగిందో.. ఎందుకు దిగిందో.. కావాలనే దిగిందో తెలియదు కానీ హాట్ అండ్ బోల్డ్ గా ఉన్నాయి ఆ ఫోటోలు. ఇక ఆ సెల్ఫీ ఫోజులని చూసిన నెటిజన్లు.. కాకరేపుతున్నావ్ కదా అంటు ఒకరు కామెంట్ చేయగా.. మాములుగా లేదుగా అంటూ మరొకరు.. ఇలా బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో సుప్రిత చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మరి మీరు ఓ లుక్కేయండి.
Also Read