విష్ణుప్రియ లవర్‌తో రీతూ చౌదరి ఎఫైర్... బుక్ చేసిన శ్రీముఖి
on Jul 6, 2024
యాంకర్ విష్ణు ప్రియ మాజీ ప్రియుడే రీతూ చౌదరి ప్రెజెంట్ లవర్. వీళ్లి భాషల్లో చెప్పాలంటే ఆమెను వదిలేశాక ఈమెను తగులుకున్నాడన్నమాట. రీతూ చౌదరి ఎవరితోనో లవ్ ఎఫైర్లో ఉందని ఆ వ్యక్తి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే కావడంతో.. చాలా సీక్రెట్‌గా ఎఫైర్ సాగిస్తుందని గాసిప్‌లు నడుస్తున్నాయి.
రీతూ చౌదరి ' దావత్ ' అనే ఓ షోని హోస్ట్ చేస్తు బిజీగా ఉంటోంది. తను అడిగే బోల్డ్ క్వశ్చన్స్ నిత్యం ఇన్ స్టాగ్రామ్ లో వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ గురించి చర్చ సాగుతోంది. విష్ణుప్రియ నోరుజారిందా లేక అది అబద్దమా అని తెలియాల్సి ఉంది. ఒకప్పుడు ఎఫైర్ల గురించి మాట్లాడుకోవాలంటే.. ఆ బాలీవుడ్, హాలీవుడ్ వాళ్ల గురించి వెతకాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు మన బుల్లితెర భామలు వాళ్లని మంచిపోయారు ఎఫైర్ల విషయంలో. కేవలం ఎఫైర్ల విషయంలోనే కాదు.. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియాలలో ఫాలోవర్స్‌ని బట్టి పైసల్ అని పెట్టారో.. అప్పటి నుంచి ఆరబోతను షురూ చేశారు.
అందాలు ఆరబోస్తూ అటు రీతూ చౌదరి, ఇటు విష్ణుప్తియ ఎంత ఆరబోస్తే అంతా పైసా అన్నట్టుగా ఒకర్ని మించి ఒకరు పోటీ పడుతున్నారు. అయితే తాజాగా మొదలైన ఓ షోలో.. కాలేజ్ థీమ్‌లో భాగంగా.. లవర్స్ లెటర్స్ రాయాల్సి ఉండగా.. రీతూ చౌదరి లవ్ లెటర్ రాసి దాన్ని చదివింది. ‘నువ్వు నా లైఫ్‌లోకి వచ్చిన తరువాత నేను షాపింగ్ చేయడం ఆపేస్తా.. ఎందుకంటే.. నీ బట్టల్ని వేసుకోవాలని ఉంది కాబట్టి. నీకోసం చేసే కాఫీతోనే నా ఉదయం మొదలుపెట్టాలని అనుకుంటున్నా’ అని తాను రాసిన లవ్ లెటర్ని చదువుతుంది రీతూ చౌదరి. ‘మరి మీ వాడికి కాఫీ అలవాటు లేకపోతే’ అని పంచ్ వేసింది శ్రీముఖి.అప్పుడు అక్కడే ఉన్న విష్ణు ప్రియ.. రీతూ.. మీ వాడికి కాఫీ అలవాటు లేదు కదా అని అనేసింది. నీకు ఎలా తెలుసు.. మా వాడికి కాఫీ అలవాటు లేదని అని రీతూ కాస్త సీరియస్‌గా అడగ్గా.. ఎందుకంటే ఆ అబ్బాయిని ఇంతకు ముందు నేను ప్రేమించాను కాబట్టి అని విష్ణుప్రియ అంటుంది. దీంతో యాంకర్ శ్రీముఖితో పాటు అందరు షాక్ అవుతారు. మరి దీనిలో ఎంత నిజం ఉందో వారికే తెలియాలి.
Also Read