మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండు ఒక్కసారన్నా
on Nov 4, 2025

జయమ్ము నిశ్చయమ్మురా సెలబ్రిటీ టాక్ షో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఇక నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక న్యూ ఎపిసోడ్ కి ఇంటర్నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వచ్చింది. జగపతి బాబు ఆమె ఎన్నో ప్రశ్నలు అడిగారు. అలాగే ఈ షోలో మరో ఇంటరెస్టింగ్ సెలబ్రిటీ కూడా యాడ్ అయ్యారు. ఆయనే రాహుల్ రవీంద్రన్. "మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండు అని ఫీలైనట్టున్నావ్" అని జగపతి బాబు అడిగేసరికి "ఎస్..మగాళ్లకు ఒక్కసారి వచ్చి అది ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలంటే అబ్బాయిలకు రావాలి" అని చెప్పింది. దానికి ఆడియన్స్ అలాగే హోస్ట్ జగపతి బాబు కూడా చప్పట్లు కొట్టారు. "స్కూల్ లో పేరెంట్, టీచర్ మీటింగ్ లో ఒక కంప్లైంట్ వచ్చిందట ఏంటది" అని జగ్గు భాయ్ అడిగారు.
రష్మీక విషయం చెప్పకుండా ఆశ్చర్యంగా రివర్స్ లో జగ్గు భాయ్ ని చూసేసరికి "సరే ఆ విషయాన్నీ కంఫర్మ్ కింద తీసేసుకుందాం"? అని చెప్పారు దాంతో రష్మిక రెస్పాండ్ అయ్యి నో అనేసింది. ఇక గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి అడిగేసరికి "గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ఎందుకు చేస్తున్నా అంటే ఆ ఫీలింగ్స్ ఉంటాయి కదండీ అవన్నీ" అని చెప్పబోయింది. ఇంతలో రాహుల్ రవీంద్రన్ వచ్చి ఆమెను సర్ప్రైజ్ చేసాడు. "ఏంటి నా స్టైల్ కాపీ కొడుతున్నావ్ నువ్వు" అని జగ్గు భాయ్ రాహుల్ ని అడిగాడు. "మీలాంటోళ్ళు ఇలా బయటకు వచ్చాక నాకు కూడా ధైర్యం వచ్చింది అరె ఎంత బాగున్నారు సర్ " అనిపించింది అంటూ కామెంట్ చేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



