ఈ రీల్ తో మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ?
on Nov 4, 2025

బుల్లితెర మీద కొంతమంది సీరియల్ యాక్టర్స్ మరీ అతి చేయడం జనాలకు వెగటు పుట్టిస్తోంది. ప్రియాంక జైన్, శివ్ కుమార్ ఒక సీరియల్ లో నటించి తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని ఇద్దరూ కలిసి ఉంటున్నారు. అలాగే కొన్ని షోస్ లో ఇద్దరూ కలిసే వస్తున్నారు. వీళ్లిద్దరి మీద సోషల్ మీడియాలో రకరకాల నెగటివ్ కామెంట్స్ రావడం చూస్తూనే ఉన్నాం. ఇద్దరికీ పెళ్లి కాకుండానే కలిసి పూజలు చేయడం, అలాగే ప్రియాంక జైన్ వాళ్ళ అమ్మను ప్రెగ్నెంట్ లేడీగా కాస్ట్యూమ్స్ వేయించి వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూసాం.
అలాగే ప్రియాంక ఒక డాన్స్ షోకి మెంటార్ గా చిట్టి పొట్టి డ్రెస్ వేసుకురావడం చూస్తూనే ఉన్నాం..ఈ విషయాలన్నిట్లో కూడా ఈమెను సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది. ఐతే ప్రియాంక జైన్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతోంది. రీసెంట్ గా ఒక వీడియోని రిలీజ్ చేసింది తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అది చూస్తే శివ్ కుమార్ అర్ధనగ్నంగా ఉన్నాడు. అతని భుజాల మీద ప్రియాంక జైన్ ఎక్కి కూర్చుని తన లాంగ్ ఫ్రాక్ ని శివ్ కుమార్ ముఖం మీద వేసేసి ఒక ట్రెండింగ్ సాంగ్ కి డాన్స్ చేయడం చూస్తుంటే బాబోయ్ ఏంటిది అన్నట్టుగా ఉంది. "నేను నాతో కలిసి డాన్స్ చేయమని అతన్ని అడిగినప్పుడు" అని చిన్న లైన్ పెట్టి "కామెంట్స్ లో మీ డాన్స్ పార్టనర్స్ ని టాగ్ చేయండి" అని కూడా చెప్పింది. ఇక నెటిజన్స్ ఐతే మాములుగా కామెంట్స్ చేయలేదు. "అన్నా మీరు లెగ్గిన్ వేసుకుని ఉంటే బాగుండేది బ్రో, ఏందిరా అయ్యా ఈ చండాలం, ఫస్ట్ లో మీ జోడికి ఒక పేరు ఉండేది..ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చిరాకొస్తోంది..ఎందుకు ఇలాంటి చెత్త వీడియోస్...మీకే ఎందుకు ఇలాంటి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఈ రోజున ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఈ రీల్ తో మీరు సమాజానికి ఎం మెసేజ్ ఇస్తున్నారు. ఎం నేర్పిస్తున్నారు మీ పేరెంట్స్. క్రింజ్ కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మరీ ఇంతలానా ..మీరిద్దరూ ఒకరికి ఒకరు ఏమవుతారు..ఫ్రెండ్స్ ? రేలషన్ షిప్ ? జనరల్ గా అడుగుతున్నా ? " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



