నిఖిల్ కి గట్టిపోటీ ఇచ్చిన మణికంఠ.. ఫిజికల్ టాస్క్ లో నిన్ను కొట్టేవారు లేరు!
on Oct 11, 2024
బిగ్ బాస్ సీజన్-8 మొదలైనప్పటి నుండి అన్ లిమిటెడ్ టాస్క్ లతో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకెళ్తోంది. అయితే ఐదో వారం నైనిక ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగాయి. వీరు లోపలికి వచ్చాక హౌస్ లో గేమ్ ఆన్ అన్నట్టుగా సాగుతోంది.
ఇక గత నాలుగు రోజుల నుండి హౌస్ లో బిబి హోటల్ టాస్క్ జరుగుతుంది. నిన్న హౌస్ లో ఫిజికల్ టాస్కుల్లో ఓజీ క్లాన్లో నిఖిల్-మణికంఠ ఇద్దరూ అదరగొట్టారు. ఫిజికల్ టాస్క్ అంటేనే రెచ్చిపోయే నిఖిల్ ఎప్పటిలానే ఇచ్చిపడేశాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా మణికంఠ ఈసారి నిఖిల్‌కి గట్టి పోటీ ఇచ్చాడు. అయితే చివరి రౌండ్లో ఓడిపోవడంతో నిఖిల్ విజయం సాధించి ఓ స్టార్ సంపాదించుకున్నాడు. అయితే ఓడిపోయిన మణికంఠకి కూడా రాయల్ క్లాన్ స్టార్ ఇవ్వడం నిఖిల్‌తో సహా ఓజీ క్లాన్లో చాలా మందికి నచ్చలేదు. ఇది జరిగి కాసేపటికి కిచెన్‌లో ఉన్న సీత దగ్గరికెళ్లి కామెడీ చేశాడు మణికంఠ. హే వాట్సాప్ సీత.. ఏం చేస్తున్నావ్ అంటూ మణికంఠ అడిగితే సీత ఏదో చెప్పింది. దీనికి జోక్‌గా నీ పక్కన మాడిపోయిన ఆ పెసరట్టు ముఖం (నిఖిల్ గురించి) ఎవడు అంటూ మణికంఠ అన్నాడు. దీంతో ఆయన మా హెడ్ చెఫ్ అంటూ సీత అంది. అవునా.. హెడ్ లెని చెఫ్ వాడు హెడ్ చీఫ్ ఏంటి అంటూ మణికంఠ జోక్ వేశాడు. దీనికి సీత నవ్వగా పక్కనే ఉన్న నిఖిల్ కాస్త సీరియస్ అయ్యాడు. రేయ్.. "అంటే మరి ఫీలవకు.. మిం** బయటికి" అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో మణికంఠ సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇది నిఖిల్ జోక్‌గా అని ఉంటే ఏదో అనుకోవచ్చు కానీ కాస్త హర్ట్ అయి సీరియస్‌గా అన్నట్లుగానే అనిపించింది. మరి దీనిపై వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఏం అయిన అంటాడో లేదో చూడాలి.
ఇక ఈ టాస్క్ లో నిఖిల్ ఆటని పొగుడుతూ సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఫిజికల్ టాస్క్ లల్లో నిన్ను కొట్టేవాడెవడూ లేడని నిఖిల్ ని ప్రశంసిస్తున్నారు. అయితే నిఖిల్ బిహేవియర్ కాస్త ఛేంజ్ అయింది. దీనిని నాగార్జున వీకెండ్ లో అడిగితే బాగుంటుంది.
Also Read