రఫ్ఫాడించిన ముక్కు అవినాష్.. పెళ్లి అయ్యిందంటూ గుర్తుచేసిన శ్రీముఖి!
on Oct 7, 2024
ముక్కు అవినాష్ ప్రస్తుతం ఫుల్ ట్రేండింగ్ లో ఉన్న కమెడియన్. టీవీ షో లో తనకి అంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నాడు. ఎక్కువగా యాంకర్ శ్రీముఖితో కలిసి టీవీ షోస్ చెయ్యడం.. ఇద్దరి కామెడి టైమింగ్ కి మంచి ఆదరణ లభించింది. జబర్దస్త్ ద్వారా ముక్కు అవినాష్ గా పేరు తెచ్చుకున్నాడు.
అయితే బిగ్ బాస్ సీజన్-4 లో అప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారానే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అవినాష్. ఇప్పుడు కూడా వైల్డ్ కార్డు ద్వారానే ఎంట్రీ ఇచ్చాడు. సీజన్-4 అప్పుడు నాకు పెళ్లి కాలేదు.. మీరు చాలాసార్లు అవినాష్ కి ఎవరైనా పిల్లని ఇవ్వండి అంటు చాలాసార్లు చెప్పారు.. అందుకే నేను బిగ్ బాస్ నుండి బయటకు వెళ్ళగానే నాకు పెళ్లి అయ్యిందని నాగార్జునతో చెప్పాడు. నాగార్జున సర్ ప్రైజ్ వీడియో అంటూ.. శ్రీముఖి మాట్లాడిన వీడియోని చూపిస్తాడు. అరెయ్ నీకు అప్పుడు పెళ్ళి కాలేదు.. ఇప్పుడు పెళ్లి అయింది.. జాగ్రత్తగా ఆడు. నీ ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నానని శ్రీముఖి చెప్తుంది. ఎంటి బాగా క్లోజ్ ఆ అని నాగార్జున అడగగానే.. అవును సర్ ఫ్యామిలీ లాగా అని శ్రీముఖి గురించి అవినాష్ అంటాడు. ఇక హౌస్ లో ఎవరు కత్తిలా బాగుంటారని నాగార్జున అడగగా.. యశ్మీ పాప కత్తిలా ఉంటుందని అవినాష్ అంటాడు. ఇప్పుడే కదా సుత్తి అన్నావని నాగార్జున అనగానే.. అంటే గేమ్ పరంగా సుత్తి కానీ బాగుంటుందని అలా అన్నానని అవినాష్ అంటాడు.