మెహబూబ్ ఎంట్రీ .. కూల్ గా ఆడమని సోహెల్ సలహా!
on Oct 7, 2024
మెహబూబ్ దిల్ సే.. బిగ్ బాస్ సీజన్-4 లో ఎంట్రీ ఇచ్చాడు. దాంతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సీజన్-8 లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో శ్రీసత్యతో కలసి జమ్ము కాశ్మీర్ లో తీసిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ మంచి వీక్షకాధరణ పొందింది. ఇలా వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్ ద్వారా మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న మెహబుబ్ రెండోసారి హౌస్ లో ఎంట్రీతో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడు.
మెహబూబ్ మంచి డాన్సర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అయితే సూపర్ డ్యాన్స్ పర్ఫామెన్స్ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన మెహబూబ్ తన అచీవ్ మెంట్స్ గురించి చెప్పుకున్నాడు. ఇక నాగార్జున తనకోసం సర్ ప్రైజ్ వీడియోని చూపించాడు. ఈ వీడియోలో సోహెల్ వచ్చాడు. " అరెయ్ హౌస్ లో నాలాగా కూల్ గా ఉండు అంటూ తనకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు సొహెల్. అతను కూల్ ఆ.. అతను కోప్పడుతుంటే.. మెడ దగ్గర నరాలు కనపడేవి అని నాగార్జున అన్నాడు. నాకు మంచి ఫ్రెండ్ సర్ వాడు.. ఇక లైఫ్ లో అలాంటి ఫ్రెండ్ దొరకడు. జీవితంలో అలాంటి వాడు ఒక్కసారి మాత్రమే దొరుకుతాడు. నేను సక్సెస్ అయ్యాను అంటే సపోర్ట్ వాడు అంటూ సోహెల్ గురించి మెహబుబ్ గొప్పగా చెప్తాడు. ఇప్పుడు హౌస్ లో మళ్ళీ ఎవరైనా అవొచ్చా అని నాగార్జున అనగానే.. అయితే ఫ్రెండ్ అవుతారు అంతే కానీ అలా మాత్రం అవ్వలేరని చెప్పాడు. ఆ తర్వాత హౌస్ లో ఎవరు నీకు కాంపిటీషన్ అని అనుకుంటున్నావని నాగార్జున అడుగుతాడు. నాకు ఇంకా ఎవరు అన్పించడం లేదని మెహబూబ్ అంటాడు.ఆ తర్వాత మెహబూబ్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో అవినాష్, గంగవ్వ, మెహబూబ్ లు సీజన్-4 కంటెస్టెంట్స్.
మెహబుబ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరితో మాట్లాడతాడు అందరిని పరిచయం చేసుకుంటాడు. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్లలో మెహబూబ్ ఒక్కడే ఫిజికల్ గా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. పాత హౌస్ మేట్స్ లో నిఖిల్, నబీల్, పృథ్వి లు ఫిజికల్ గా స్ట్రాంగ్ అయితే రాబోయే టాస్క్ లో రెండు టీమ్ లకి మధ్య పోటీలు గట్టిగానే ఉంటాయి. అందులో ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడిపోతారో చూడాలి మరి.
Also Read