రెస్టారెంట్ డెవలెప్మెంట్ లో దీప ఐడియా.. పొగిడిన శివన్నారాయణ!
on Nov 16, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -516 లో.....కాంచనకి ప్రొద్దున్నే శ్రీధర్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేస్తాడు. అది చూసి ఎందుకు మెసేజ్ చేసారని కాంచన కాల్ చేస్తుంది. శ్రీధర్ తో కాంచన మాట్లాడుతుంటే అప్పుడే కార్తీక్ వస్తాడు. దాంతో కాంచన ఫోన్ పక్కన పెడుతుంది. దీపకి కార్తీక్ పూలు పెడతాడు. అప్పుడే ఒకతను సైకిల్ పై ఇడ్లీ అమ్ముతాడు. అది చూసి బావ జ్యోత్స్న రెస్టారెంట్ గురించి ఒక ఐడియా నా దగ్గర ఉంది చెప్తానని అంటుంది. ఏంటో చెప్పమని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ కోర్ట్ అని జనాలున్న దగ్గర పెడితే ఫేమస్ అవుతుంది కదా అని దీప అనగానే మంచి ఐడియా అని కార్తీక్ అంటాడు.
వాళ్ళ మాటలు అన్ని శ్రీధర్ లైన్ లో ఉండి వింటాడు. ఐడియా బాగుంది వాళ్లకు చెప్పాలి ఏమంటారోనని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు కాశీ ఫ్రెండ్ తనకి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ స్వప్న లిఫ్ట్ చేస్తుంది. అతన్ని మాటల్లో కాశీకి జాబ్ లేదని స్వప్నకి అర్థమవుతుంది. కాశీ రాగానే ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. కాశీ ఏదో ఒకటి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. స్వప్న కి డౌట్ వస్తుంది. ఆ తర్వాత శివన్నారాయణ ఇంటికి కార్తీక్, దీప వెళ్తారు. శ్రీధర్ కూడా వస్తాడు. రెస్టారెంట్ డెవలోప్ గురించి ఒక ఐడియా ఉంది అని ఫుడ్ కోర్ట్ గురించి శ్రీధర్ చెప్పగానే దీప, కార్తీక్ షాక్ అవుతారు. మా ఐడియా ఎలా తెలిసిందని ఇద్దరు అనుకుంటారు. శివన్నారాయణ వాళ్ళు ఐడియా బాగుందని శ్రీధర్ తో చెప్తారు. ఈ ఐడియా నాది కాదు దీపది.. వాళ్ళు ప్రొద్దున మాట్లాడుకుంటుంటే విన్నానని శ్రీధర్ చెప్తాడు. అందరు దీపని పొగుడుతారు. ఫుడ్ కోర్ట్ గురించి దాని వాళ్ళ రెస్టారెంట్ కి బెనిఫిట్స్ ఏంటో అన్ని కార్తీక్ వివరిస్తాడు. ముందు దీపని జ్యోత్స్న తక్కువ అంచనా వేస్తుంది. చూసావా మేడమ్.. ఈ ఐడియా ఇచ్చింది నా భార్య అని కార్తీక్ గొప్పగా చెప్తాడు.
దాంతో జ్యోత్స్న కోపంగా వెళ్తుంది. తన వెనకాలే సుమిత్ర, దశరథ్ వెళ్తారు. ఆ తర్వాత మీ నాన్న సీఈఓ అయ్యాడు కదా.. మీ అమ్మ ఏమంటుందని కార్తీక్ ని శివన్నారాయణ అడుగుతాడు. అమ్మ అన్న మాటలు చెప్తే తాత బాధపడుతాడని కార్తీక్ ఏం చెప్పడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



