రాహుల్ లో మార్పు వచ్చిందని మురిసిపోతున్న స్వప్న.. మరి ఆ డబ్బు!
on Nov 16, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -879 లో.... కావ్యని తీసుకొని రాజ్ క్యాండీలైట్ డిన్నర్ కి వస్తాడు. అక్కడ బేరర్ గా రాహుల్ ఉంటాడు. అతన్ని చూసి కావ్య షాక్ అవుతుంది. నువ్వేంటి ఇక్కడ అని కావ్య అడుగుతుంది. కష్టపడి పని చెయ్యాలని అనుకుంటున్నానని రాహుల్ చెప్తాడు. అలా చెయ్యడానికి ఈ పనే దొరికిందా అని రాజ్ అంటాడు. రాహుల్ ని చూస్తే బాధగా ఉందని కావ్య అంటుంది. ఆ విషయం వదిలేయ్ అని రాజ్ అంటాడు. కావ్య బయటకు వెళ్తుంటే కొందరు రౌడీలు కావ్య ని ఏడిపిస్తారు. ఒరేయ్ మీరు మా ఆయన పంపిస్తే వచ్చిన రౌడీలు అని నాకు తెలుసని కావ్య అంటుంది. వాళ్ళు కావ్యతో తప్పుగా ప్రవర్తిస్తుంటే రాజ్ వస్తాడు. ఒరేయ్ నేను పిలిస్తే వచ్చినోళ్లు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని రాజ్ అంటాడు.
మీరు పిలవడడమేంటని రౌడీలు అంటారు. వెంటనే తను చెప్పిన రౌడీలకి రాజ్ ఫోన్ చేస్తాడు. సర్ మేమ్ ఇంకా బయల్దేరలేదని వాళ్ళు చెప్తారు. అప్పుడు వీళ్ళు నిజమైన రౌడీలు అని తెలుసుకొని రాజ్ వాళ్ళని కొడుతాడు. ఆ తర్వాత కావ్యని తీసుకొని రాజ్ అక్కడ నుండి బయల్దేరతాడు. మరొకవైపు స్వప్నకి రాహుల్ నాసిరకం చీర తీసుకొని వస్తాడు. స్వప్న నీకు ఇది నచ్చదు నాకు తెలుసు కానీ నేను కష్టపడి డబ్బు సంపాదించి నీకు ఈ చీర కొన్నాను. బేరర్ గా జాయిన్ అయ్యానని రాహుల్ చెప్తాడు.
రాహుల్ లో వచ్చిన మార్పు చూసి స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ చీర తీసుకొని మురిసిపోతుంది. నాకు కావాల్సింది కూడా ఇదేగా అని రాహుల్ అనుకుంటాడు. మరుసటిరోజు స్వప్న ఆ చీర కట్టుకొని వస్తుంది. అదేంటీ అంత నాసిరకం చీర కట్టుకున్నావ్.. అలాంటివి నీకు నచ్చవ్ కాదా అని ధాన్యలక్ష్మి అంటుంది. తరువాయి భాగంలో రాహుల్ ఈ డబ్బు విత్ డ్రా చేసి ఆఫీస్ కి తీసుకొని వెళ్ళు అని రాజ్ చెప్తాడు. రాహుల్ దగ్గర ఒకతను డబ్బు తీసుకొని పారిపోతాడు. ఇంకా రాహుల్ ఆఫీస్ కి రాలేదని రాజ్ తో ప్రకాష్ చెప్తాడు. అందుకే వాడిని నమ్మొద్దని ఇంట్లో వాళ్ళు అందరు రాహుల్ పై కోపంగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



