దీపే అసలైన వారసురాలనే విషయం చెప్తానన్న దాస్.. అతని కాళ్ళు పట్టుకున్న జ్యోత్స్న!
on Dec 31, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -242 లో..... ఏదో చేస్తానని వచ్చావ్.. ఏమైందని జ్యోత్స్నతో పారిజాతం అనగానే బావని చూసావా ఎంత హ్యాపీగా ఉన్నాడో.. అది చూసి ఏం చెయ్యగలనని జ్యోత్స్న అంటుంది. సరే పదా అని ఇద్దరు వెళ్తుంటే.. కాశీ పిలిచి టిఫిన్ తిన్నారు కదా డబ్బులు ఇవ్వండి అంటాడు. దాంతో జ్యోత్స్న కొంత ఎక్కువ డబ్బులు ఇస్తూ ఇది నా స్థాయి అంటుంది. దాంతో దీప వెనక్కి పిలిచి రోజుకి ఇద్దరికి నేను టిఫిన్ ఫ్రీగా పెట్టాలనుకుంటున్నా అందుకే మీ డబ్బు మీకు ఇస్తున్నానంటూ తిరిగి ఇచ్చేస్తుంది. దాంతో పాటు ఇచ్చింది ఇచ్చినట్టు ఇవ్వకూడదు కదా అందుకే ఈ పదకొండు రూపాయలని దీప ఇవ్వగానే.. జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది.
ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం ఇంటికి రాగానే.. ఎక్కడికి వెళ్లారని సుమిత్ర అడుగుతుంది. మీ అల్లుడు పరువు తీసున్నాడని అంటుంది. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. అతనికి కార్తీక్, దీప ఇద్దరు టిఫిన్ సెంటర్ పెట్టిన ఫోటో చూపిస్తాడు. ఆ తర్వాత దశరత్ ని శివన్నారాయణ పిలిచి ఫోటో చూపిస్తూ.. నీ అల్లుడు లేకుంటే మనం ఏమైపోతామో అన్నావు కదా.. నీ అల్లుడు ఆలోచన విధానం ఇది అంటూ కార్తీక్ ని తక్కువ చేసి మాట్లాడతాడు శివన్నారాయణ. మరొక వైపు దీప డబ్బు లెక్కపెడుతుంటే డబ్బులు చాలానే వచ్చాయని కార్తీక్ అంటాడు. రేపటి నుండి మీరు టిఫిన్ సెంటర్ కి రాకండి అని దీప అనగానే కార్తీక్ వస్తానని అంటాడు. మీ స్థాయి ఇది కాదని దీప అంటుంటే.. నీది నాది ఒకే స్థాయి అంటూ కార్తీక్ అంటాడు. దాంతో కార్తీక్ ని దీప హగ్ చేసుకొని ఎమోషనల్ అయినట్లు ఉహించుకుంటుంది. అప్పుడే శౌర్య వచ్చి.. నాన్న ఫోన్ లేదు కదా ఫోన్ కొనుక్కో అంటుంది అమ్మ ఫోన్ ఉంది కదా అది సరిపోతుందని కార్తీక్ అంటాడు. ఇద్దరికి ఒకే ఫోన్ ఆ అని శౌర్య అనగానే.. ఇద్దరం ఒకటే.. ఒకటి సరిపోతుందని కార్తీక్ అంటాడు. ముగ్గురం ఒకటే అని శౌర్య అంటుంది.
మరొకవైప దీప మాటలు గుర్తుచేసుకుంటుంది జ్యోత్స్న. అప్పుడే దాస్ ఇంటికి రావడం చూసి.. ఎవరు చూడకుండా తన దగ్గరికి వెళ్తుంది. ఎందుకు వచ్చావని జ్యోత్స్న అడుగుతుంది. సుమిత్ర వదినకు దీపే అసలైన వారసురాలని చెప్తానని దాస్ అంటాడు. వద్దని దాస్ కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది జ్యోత్స్న. అది పారిజాతం చూసి నేను చూస్తుంది నిజమేనా.. వాళ్లేం మాట్లాడుకుంటున్నారని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read