నర్మద ప్లాన్ సక్సెస్.. ఎదురింట్లో పెళ్ళి అనగానే అందరు షాక్!
on Dec 31, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -43 లో......ప్రేమ దగ్గరికి భద్రవతి వెళ్తుంది. ఏటి నా కోడలికి కోపం వచ్చిందా.. నీకు చెప్పకుండా ఇదంతా చేస్తన్నందుకు కోపం వచ్చిందా అని భద్రవతి అడుగుతుంది. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని భద్రవతి అడుగుతుంది. నిన్ను చిన్నప్పటి నుండి మేనకోడలులాగా ఎప్పుడు చూడాలేదు.. కూతురులా చూసుకున్నాను.. వేదవతిని ఇంతే ప్రేమగా చూసుకున్నాను కానీ చివరికి పెళ్లి టైమ్ కి లేచిపోయింది. దానికి పెళ్లి చెయ్యలేదన్న బాధ ఉంది కానీ నీ పెళ్లి నా చేతుల మీదుగా చేస్తున్నానంటూ ప్రేమతో భద్రవతి ఎమోషనల్ గా మాట్లాడుతుంది.
ఆ తర్వాత ఇప్పుడు కళ్యాణ్ తో లేచిపోతే అంటూ ప్రేమ భయపడుతుంది. మరొకవైపు నర్మద గదిలోకి వస్తుంది. సాగర్ వస్తుంటే నాకు తల నొప్పిగా ఉందని అనడంతో సాగర్ టాబ్లెట్ ఇస్తాడు కానీ నర్మద టాబ్లెట్ వేసుకోదు. రామరాజు వేదవతిల మాటలు గుర్తుచేసుకుంటుంది. మాటి మాటికి తలనొప్పి తగ్గిందా అంటూ సాగర్ అడుగుతాడు. లేదని నర్మద అంటుంది. సారీ సాగర్ బాధపెడుతున్నానని అంటుంది. మరుసటిరోజు ఉదయం సాగర్ లేచేసరికి నర్మద వేసుకోకుండా పడేసిన టాబ్లెట్ కనిపిస్తుంది. అప్పుడే నర్మద టీ తీసుకొని వస్తుంది. తలనొప్పి తగ్గిందా టాబ్లెట్ వేసుకున్నావా అని సాగర్ అడుగగా.. తగ్గిందని నర్మద అంటుంది.
ఆ తర్వాత తులసి పూజ చెయ్యడానికి నర్మద వెళ్తుంటే.. నేను చేస్తానంటూ వేదవతి అంటుంది. నేను చేసాక చేసుకోమని వేదవతి చెప్తుంది. మరొకవైపు ప్రేమ పెళ్లి పనులు మొదలవుతాయి. ఎదురింట్లో ఏం జరుగుతుందని అందరు ఆశ్చర్యం గా చూస్తారు. తిరుపతి వెళ్లి కనుక్కోమని వేదవతి అంటుంది. తిరుపతి వెళ్లి ఏం జరుగుతుంది అని అడుగగా.. నా మేనకోడలు పెళ్లి అని భద్రవతి చెప్తుంది. అది విని వేదవతి షాక్ అవుతుంది. తరువాయి భాగంలో ప్రేమ హల్దీ ఫంక్షన్ జరుగుతుంటే.. వేదవతి చూస్తుంటుంది. తను చూడకుండా భద్రవతి అడ్డుపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read