ENGLISH | TELUGU  
Home  » TV News

Karthika Deepam2 : కార్తీక్ తో పెళ్ళికి ఒప్పుకున్న ఇంటి పెద్ద.. అది జరిగేనా!

on Oct 17, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -177 లో.. శౌర్యని‌ దీప వెతుక్కుంటూ ఉంటే.. కాశీ ఎదురు పడతాడు. దాంతో శౌర్య కన్పించడం లేదని దీప చెప్తుంది దాంతో నానమ్మ కి ఫోన్ చేసి అడుగుతాను. అక్కడికి వచ్చిందేమోనని పారిజాతానికి కాశీ ఫోన్ చేస్తాడు. శౌర్య వచ్చిందా అని అడుగుతాడు. లేదు అవుట్ హౌస్ లో ఎవరు లేరు.. ఎందుకు అడుగుతున్నావని పారిజాతం అనగానే.. తర్వాత చేస్తానంటూ కాశీ ఫోన్ కట్ చేస్తాడు.

మరొకవైపు శౌర్యని కార్తీక్ హాస్పిటల్ కి తీసుకొని వస్తాడు శౌర్యని చెక్ చేసిన డాక్టర్ తనకి పెద్ద డిసీస్ ఉందని చెప్తాడు. ఆ డిసీస్ కి ట్రీట్మెంట్ ఉంది రెండు కోట్లు ఖర్చు అవుతుందని చెప్పగానే కార్తీక్ టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత సుమిత్రకి కార్తీక్ ఫోన్ చేసి దీప ఇంట్లో నుండి వెళ్ళింది.‌ తనని ఎవరు ఏమన్నారో తెలియదని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర కోపంగా జ్యోత్స్నని పిలుస్తుంది. ఎందుకు దీపని పంపించావని అడుగుతుంది. అవును పంపించానని జ్యోత్స్న అంటుంది. అది అత్తయ్య వాళ్ళని పూజకి పిలిచి కుటుంబాల మధ్య దూరం పెంచిందని జ్యోత్స్న అంటుంది. నాకు బావకి పెళ్లి చెయ్యండని జ్యోత్స్న అంటుంది. అది జరగదని శివన్నారాయణ అనగానే.. అయితే నేను బ్రతకను అంటు గదిలో కి వెళ్లి డోర్ వేసుకుంటుంది జ్యోత్స్న. దాంతో అందరు టెన్షన్ పడతారు. నా కూతురిని వదులుకోను.. అలాగని మీ మాట కాదనలేను.. నా కూతురికి ప్రాణభిక్ష పెట్టండి అని దశరథ్ అనగానే.. సరే అని శివనారాయణ పెళ్లికి ఒప్పుకుంటున్నానని చెప్తాడు. ఆ విషయం డాడ్ కి చేతిలో చెయ్ వేసి చెప్పండని జ్యోత్స్న అనగానే శివన్నారాయణ అలాగే మాటిస్తాడు. దాంతో జ్యోత్స్న వచ్చి డోర్ తీసి.. నేనంటే ఎంత ఇష్టం తాత అని హగ్ చేసుకుంటుంది.

మరొకవైపు శౌర్యని తీసుకుని ‌కార్తీక్  ఇంటికి వస్తాడు. అక్కడ ఏదో జరిగింది. అందుకే దీప వెళ్ళిపోవాలనుకుందని కార్తీక్ కాంచనతో అంటాడు. కార్తీక్ నాకు ఒకటి కావాలి ఇస్తావా అని కాంచన అడుగుతుంది. ఏంటని కార్తీక్ అనగానే.. నాకు నాన్న కావాలి అంటుంది. మీ నాన్న గురించి తెలుసు కదా అని కార్తీక్ అంటాడు. నాన్నగా నువ్వు కావాలని శౌర్య అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. అప్పుడే కార్తీక్ కి కాశీ ఫోన్ చేస్తాడు. శౌర్యా కన్పించడం లేదని చెప్తాడు. శౌర్య ఇక్కడే ఉందని కార్తీక్ అనగానే దీప ఫోన్ తీసుకొని.. శౌర్య ఉందని చెప్పాలి కదా అని దీప అంటుంది. నేను ఇక్కడున్నా అని అమ్మతో చెప్పకని శౌర్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.