Home

»

Tv News

Karthika Deepam2 : వంటల పోటీలో జ్యోత్స్న కుట్రలు.. దీపకు ఎదురైన కొత్త సవాల్!

Jul 19, 2026 11:12AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -726 లో..... ఏమైంది శివన్నారాయణ మీకు ఇంకా రెండు నిమిషాలు మాత్రమే ఉంది.. పోటీకి వస్తున్నారా అని దక్షిణామూర్తి అడుగుతాడు. ఇంకా రెండు నిమిషాలు ఉంది కదా ఆగండి అని దీప అంటుంది. కార్తీక్ ని దీప పక్కకి తీసుకొని వెళ్లి బావ నేను పోటీలో ఉంటానని అడుగుతుంది. నువ్వు సీఈఓ కాబట్టి పోటీలో ఉండకూడదని కార్తీక్ చెప్తాడు. అప్పుడే సూరజ్ , జ్యోత్స్న వస్తారు. పోటీలో మేం ఉంటున్నామని జ్యోత్స్న అనగానే అందరు షాక్ అవుతారు.

పోటీలో నేను ఉంటున్నాను నాకు సపోర్ట్ గా దీప ఉంటుందని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్నతో సూరజ్ అన్నమాటలు గుర్తు చేసుకుంటుంది. నువ్వు ఇప్పుడు పోటీలో ఉండేలా దీప గారిని ఒప్పించండి. అక్కడ ఓడిపోతే దీపని అంటారన్న విషయాలు జ్యోత్స్న గుర్తుచేసుకుంటుంది. దీప  సీఈఓ కదా అలా ఉండకూడదు పైగా తను ప్రెగ్నెంట్ అని మాలిని అంటుంది. తను కూడా ఒక్కప్పుడు జ్యోత్స్న రెస్టారెంట్ లో మంచి చెఫ్ అని జ్యోత్స్న అంటుంది. తను పోటీలో ఉంటే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంటుంది. అలా ఉండకుండా ఆపాలని మాలిని అనుకొని నేను ఒప్పుకోనని అంటుంది. థాంక్స్ అండి నేను ప్రెగ్నెంట్ అని ఆలోచించినందుకు నా కూతురు కడుపులో ఉన్నప్పుడు కూడా ఎనిమిది నెలలు వరకు ఇడ్లీ బండి నడిపానని దీప వాళ్ళని కన్విన్స్ చేస్తుంది.

ఆ తర్వాత రెండు రెస్టారెంట్ ల వాళ్ళు పోటీకి దిగుతారు. చెఫ్ కిరణ్ వచ్చి మీరు నాతో పోటీ పడడం ఏంటని వెటకారంగా మాట్లాడుతాడు. నమ్మకద్రోహం చేసేవాళ్ళకి కాలమే సమాధానం చెప్తుందని దీప అంటుంది. ఎలాగైనా పోటీలో ఓడిపోవాలని జ్యోత్స్న అన్ని పనులు మెల్లగా చేస్తుంది. దీప ఒక ఫ్రై చేస్తుంది. అందులో జ్యోత్స్న వాటర్ పోస్తుంది. ఏంటి జ్యోత్స్న నువ్వు అని దీప అంటుంది. అల్లం పేస్ట్ చెయ్యమని దీప అనగానే నా చేతులు మంట వస్తుందని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న ఇది మన కుటుంబానికి సంబంధించిన పోటీ.. ఇప్పుడు నాకంటే ఈ పోటీ నీకే అవసరం శివన్నారాయణ మనవరాలు గెలిపించింది అంటారు. ఇప్పుడు నాకు సపోర్ట్ గా ఉంటానని చెయ్ కలుపమని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com