Home

»

Tv News

Brahmamudi : భ్రమరాంబ నోరు మూయించిన శేషు.. రాజు ముందు ఇందు ధర్నా!

Jul 19, 2026 11:22AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1088 లో.....రాజు కాలికి ఇందు మసాజ్ చేస్తూ మనం ఇంటికి వెళదాం బావ అని అంటుంది. నేను రానని రాజు అంటాడు. మరొకవైపు రేఖ వస్తే తనకి జరిగింది అంతా చెప్పాలని భ్రమరాంబ వెయిట్ చేస్తుంది. అప్పుడే రేఖ వస్తుంది. పేవికాల్ వేసిన ఉప్మా తినడం వల్ల ఏం మాట్లాడేలేక భ్రమరాంబ సైగ చేస్తుంది. దాంతో శేషు వచ్చి ఎప్పుడు నువ్వు నన్ను నోరు ముయ్ అనే దానివి నువ్వు మూసుకున్నావని భ్రమరాంబతో శేషు అంటాడు.

భ్రమరాంబ మాట్లాడలేకపోవడం వల్ల శేషు తన మాటలతో ఒక ఆట ఆడుకుంటాడు. మరొకవైపు రాజు దగ్గరికి లక్కీ వస్తాడు. అలా ఎలా అయింది మావ అని అడుగుతాడు. అదంతా తర్వాత చెప్తానని రాజు అంటాడు. మీ అమ్మ గురించి తెలిసేది జస్ట్ లో మిస్ అయింది.. నేను కనుక్కుంటానని రాజు చెప్పగానే నేను నిన్నే నమ్ముకున్నారా అని లక్కీ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత రాజు పడిపోతుంటే ఇందు పట్టుకుంటుంది. దాంతో రాజు వదులు అని కోపంగా వెళ్తాడు. తనని కూల్ చెయ్యడానికి ఇందు ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత రాజు గదిలోకి ఇందు పాల గ్లాస్ తో వెళ్తుంది. బావ అని ప్రేమగా దగ్గరికి వస్తుంటే రాజు కూడా టెంప్ట్ అవుతాడు. ఒక్కసారిగా ఇవన్నీ నా దగ్గర కుదరవని తనని బయటకు పంపిస్తాడు రాజు.

ఆ తర్వాత కాసేపటికి ఇందు సౌండ్ వినిపించడం లేదు కొంపదీసి వెళ్ళిపోయిందా అని అనుకుంటాడు. అప్పుడు బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఇందు ధర్నా చేస్తుంది. మొగుడు మొండితనం నశించాలంటూ తనతో పాటు లక్ష్మీ, చలపతి కూడా చేస్తారు. తరువాయి భాగంలో రాజుని తీసుకొని ఇందు తన ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత అసలు రాజు ఎవరు అని ఇందుని నందు అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com