ఇంట్లో నుండి వెళ్ళిపోయిన దీప.. ఎంత పనిచేశావ్!
on Jul 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -90 లో.. శౌర్య హాస్పిటల్ లో ఉండగానే నర్సుని చూడమని చెప్పి దీప ఇంటికి వచ్చి తన నాన్న ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతుంది. ఇంట్లో ఉన్న బట్టలు సర్దుకొని కార్తీక్ కి ఇవ్వాల్సిన డబ్బులు డబ్బాలో వేసి మీకు ఇవ్వాలిసిన డబ్బు గడువు లోపు అందుతుందంటూ చీటీపై రాస్తుంది. ఇంట్లో ఏంటి లైట్స్ ఆన్ చేసి ఉన్నాయని జ్యోత్స్న చూస్తుంది. దీప కన్పించగానే నీ సంగతి చెప్తానంటూ కిందకి వస్తుంది. దీప బ్యాగ్ తో సహా వెళ్తుంటే వెళ్లనివ్వు దరిద్రం వదిలింది. నేను చేద్దాం అనుకున్న పని తనే చేస్తుంది. ఇక బావ అన్న మాటలు ఎవరికి చెప్పనవసరం లేదు ఈ దీప మా జీవితాల్లో నుండి వెళ్లిపోయింది అని జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు హాస్పిటల్ లో ఉన్న శౌర్య.. కార్తీక్, కార్తీక్ అంటూ కలవరిస్తుంది. అప్పుడే దీప వస్తుంది. వాళ్ళ నాన్న ని కలవరిస్తుంది మీరు వెళ్ళేటప్పుడు అయిన వాళ్ళ నాన్నని దగ్గర ఉంచాల్సిందని సిస్టర్ అంటుంది. మరోవైపు దీప నిన్నటి నుండి కన్పించడం లేదని సుమిత్ర అనుకుంటూ.. దీపని పిలుస్తూ తన ఇంట్లోకి వెళ్తుంది. లోపలికి వెళ్లేసరికి ఇంట్లో బట్టలేం ఉండవు. ఏమైంది అని దశరథ్ అడుగగా.. దీప ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందని చెప్తుంది. ఆ తర్వాత అందరు జ్యోత్స్న లేదు.. దీప లేదు.. ఎక్కడికి వెళ్లారని టెన్షన్ పడుతుంటారు. ఆ తర్వాత శౌర్యని దీప హాస్పిటల్ నుండి తీసుకెళ్లే సమయంలో.. ఆల్రెడీ కార్తీక్ సర్ బిల్ పే చేశారని నర్సు చెప్పడంతో.. అవసరం లేదంటూ గాజులు ఇంకా ఫోన్ నర్సుకి ఇస్తుంది దీప. కార్తీక్ ఎక్కడ అని శౌర్య అడుగుతుంది. ముందు మనం ఇక్కడ నుండి వెళ్ళాలని శౌర్యని తీసుకొని దీప వెళ్తుంది. మరొకవైపు జ్యోత్స్న జాగింగ్ నుండి వస్తుంది. దీప రాత్రి వెళ్ళిపోయిందని జ్యోత్స్న చెప్పగానే.. ఎందుకు మాకు చెప్పలేదు. నువ్వు ఎందుకు ఆపలేదని జ్యోత్స్న ని సుమిత్ర అడుగుతుంది. తను ఏమవుతుందని ఆపాలంటూ, దీప గురించి జ్యోత్స్న తప్పుగా మాట్లాడుతుంది.
ఆ తర్వాత కార్తీక్ కి దశరథ్ ఫోన్ చేసి దీప వెళ్లిపోయిందని చెప్తాడు. దాంతో ఎంత పని చేసావ్ దీప అంటూ కార్తీక్ హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ శౌర్య డిశ్చార్జ్ అయి వెళ్ళిందని చెప్పి.. దీప మీరు బిల్ కట్టారన్నా కూడా ఇవి ఇచ్చిందని నర్సు దీప ఇచ్చిన గాజులు, ఫోన్ చూపించగా అవి కార్తీక్ తీసుకుంటాడు. మరొకవైపు కడియం దగ్గరకి దీప వెళ్లి నేను వెళిపోతున్నాను.. మేమ్ ఎవరో తెలియని ప్లేస్ కి వెళ్తున్నానని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read