Karthika Deepam 2 : ఆ సెల్ఫీ చూసి షాకైన జ్యోత్స్న.. దీపకి ఇక దేత్తడే!
on Oct 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -168 లో...కాశీ, స్వప్న ఇద్దరు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. దాంతో కోపంగా కావేరిని శ్రీధర్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్తాడు. స్వప్న అక్షింతలు తీసుకొని కావేరి దగ్గరికి.. వచ్చి నన్ను ఆశీర్వదించు అని అనగానే నేను ఒక్క దాన్ని కాదు. ఇద్దరమని కావేరి అనగానే.. అవసరం లేదని స్వప్న అంటుంది. అప్పుడే దీప వస్తుంది. మీ కూతురు ఏదైనా తప్పు చేస్తే మీరే క్షమించాలని దీప అంటుంది. శ్రీధర్ పిలవడంతో కావేరి వెళ్లిపోతుంది. స్వప్న ని తీసుకొని దీప లోపలికి వస్తుంది. ఇక వెళ్తామని కార్తీక్ అంటాడు. ఆగండి బావ.. అందరం ఒక సెల్ఫీ దిగుదామంటూ కాశీ ఫోటో తీస్తాడు. ఆ తర్వాత కార్తీక్ వాళ్ళు వెళ్ళిపోతారు.
నానమ్మ రమ్మంటే రాలేదు. ఇప్పుడు ఈ సెల్ఫీ పంపిస్తానని పారిజాతానికి కాశీ పంపిస్తాడు. ఈ కాశీ గాడు ఏదో పంపాడు.. తిట్టానని ఏడుస్తూ ఫోటో పంపినట్టున్నాడని ఓపెన్ చేస్తుంది. కాశీ పంపిన ఫోటో చూసి పారిజాతం షాక్ అవుతుంది. కాంచన, కార్తీక్ లు వెళ్లడమేంటని అనుకుంటుంది. అప్పుడే జ్యోష్న వచ్చి.. చూపించమని అంటుంది. పారిజాతం భయపడుతూనే ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటో చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. వీళ్లేంటి అక్కడికి వెళ్లారని జ్యోత్స్న ఆవేశపడుతుంది. ముందు ఆ దీపని అనాలి.. రానియ్ ఆ దీప అని జ్యోత్స్న అనుకుంటుంది.
మరొకవైపు స్వప్న చేసిన అవమానం.. గుర్తుచేసుకొని శ్రీధర్ డ్రింక్ చేస్తాడు. అక్కడ జరిగింది గుర్తుచేసుకుంటాడు. కోపంగా గ్లాస్ పగులగొడతాడు. కావేరి వచ్చి ఇంకా అదే ఆలోచిస్తున్నారా అంటూ ఇంకా శ్రీధర్ కి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. కూతురు అల్లుడిని ఇంటికి తీసుకొని రావాలని చెప్తుంది. దాంతో శ్రీధర్ కి ఇంకా కోపం వస్తుంది. మరోవైపు వంట చేశాను అమ్మ.. ఇక వెళ్తాను థాంక్స్ అమ్మ.. స్వప్న దగ్గరికి వచ్చినందుకని దీప చెప్తుంది. కార్తీక్ నువ్వు వెళ్లి దీపని దింపిరా అని అనగానే.. ఇద్దరు బయలుదేర్తారు. మీ అమ్మ గారు ఇప్పుడు ఇప్పుడే బాధని మర్చిపోతున్నారు.. ఆవిడ పుట్టింటికి దగ్గర అయ్యే ప్రయత్నం చెయ్యండి. అది మీ పెళ్లితోనే జరుగుతుందని దీప అంటుంది. రోజు వెళ్లి అడగలేను.. పెళ్లి అనేది కలిసాక జరుగుతుంది. పెళ్లి ద్వారా కలవకూడదని కార్తీక్ అంటాడు. మరొకవైపు శౌర్య ఆడుకుంటుంటే నర్సింహా ఇంటి బయట ఉంటాడు. శౌర్యని ఎత్తుకొని వెళ్లి దీపని రప్పించాలనుకొని రిమోట్ కార్ ని శౌర్య ముందుకు పంపిస్తాడు. అది చూస్తూ శౌర్యా బయటకు వస్తుంది. అప్పుడే కార్తీక్, దీప లు వస్తారు. కార్తీక్ తో శౌర్య మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read