TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Jayam Serial: ఖాళీపేపర్లు చూసి షాక్ అయిన వీరు.. రుద్ర, గంగ ప్లాన్ సక్సెస్!

Nov 25, 2026 8:36AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -435 లో ఆస్తి పేపర్స్ అన్ని తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్తాడు వీరు. ఇక ఆస్తులన్నీ నా పేరున ట్రాన్స్‌ఫర్ చెయ్యమని వీరు అడుగుతాడు. లాయర్ పేపర్ చూసేసరికి మొత్తం ఖాళీ పేపర్సే ఉంటాయి. వీటితో ఎలా ట్రాన్స్‌ఫర్ చెయ్యాలని వీరుకి చూపించి అతను అడుగుతాడు. దాంతో వీరు ఆ పేపర్స్ చూసి షాక్ అవుతాడు. నేను రాత్రి డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చాను కదా అలా ఎలా తెల్లకాగితాలు అయ్యాయని వీరు అనుకుంటాడు. అదే ఆలోచిస్తూ ఇంటికి వస్తాడు. అప్పుడే రుద్ర, రంగా ఎదురుగా వచ్చి అనుకున్నది ఒక్కటీ అయింది ఒక్కటి అని పాట పాడుతూ ఉంటారు.

ఏంటి వీరు డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే అలా ఎలా మారాయనుకుంటున్నావా అని రుద్ర అనగానే వీరు షాక్ అవుతాడు. అవి గంగ తీసింది నీ గదిలో నుంచి అని రుద్ర అంటాడు. అప్పుడే గంగ వస్తూ అవును అన్నయ్య అని అంటుంది. ఇప్పుడు తప్పించవచ్చు ఇక ముందు తప్పించలేరని వీరు అనగానే రుద్ర గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఇంట్లో వాళ్లు అందరు వస్తారు. ఏమైందని అడుగుతారు. నిన్న రాత్రి దొంగ వచ్చాడు కదా అతను ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ ని దొంగతనం చేశాడు.. అవి బయట వదిలేసి వెళ్లాడని రుద్ర చెప్తాడు. డాక్యుమెంట్స్ దొంగతనం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ఇంట్లో వాళ్లు అనుకుంటారు.

పెద్దనాన్న డాక్యుమెంట్స్ జాగ్రత్తగా పెట్టండి అని రుద్ర అంటాడు. నీ దగ్గరే పెట్టమని పెద్దసారు అంటాడు. నేను జాగ్రత్తగా పెడతానని ఇషిక అంటుంది కానీ తన మాట పట్టించుకోరు. రుద్ర, గంగ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి. దాంతో ఇషిక, సూర్య వంశీ, వీరుకి కోపం వస్తుంది. అందరు కలిసి ఎలాగైనా ఆస్తులు పంచాలని శకుంతలని అడుగుతారు. నేను ఇప్పుడు ఏం చేయలేనని శకుంతల చెప్తుంది. మరోవైపు పెద్దసారుకి సుధ ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img