TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Bigg Boss 10 Telugu: హౌస్ లోకి ఇమ్మాన్యుయేల్, సంజనా..కంటెండర్ గా నిలిచిన రామకృష్ణ!

Nov 25, 2026 8:43AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో నిన్నటి ఎపిసోడ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగింది. బడ్డీ అప్ థీమ్‌లో భాగంగా సీజన్-9 కంటెస్టెంట్లు హౌస్‌లోకి బడ్డీలుగా వచ్చారు. వారిచేత హౌస్ లోని కంటెస్టెంట్స్ కలిపి టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్.

ముందుగా ఇమ్మాన్యుయేల్, సంజనా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళిద్దరు వచ్చీ రాగానే పాటలతో డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ అందరిపై కౌంటర్లు వేసి హౌస్‌ను నవ్వులతో నింపేశాడు. త్రిగుణ్, వంశీ ట్రాక్ తమలానే ఉందని, వర్షిణి, ముఖేష్ లెక్కల గేమ్ చూశానని, సుధీర్ రిలాక్స్‌గా పడుకొని త్రిగుణ్ దూత అంటాడని మిమిక్రీ చేసి అదరగొట్టాడు. ముఖేష్ కాళ్లకు వర్షిణి నమస్కారం చేసిన సీన్‌ను రీ-క్రియేట్ చేసి మరీ నవ్వించాడు. సంజనా కూడా అందరికీ సలహాలు ఇస్తూ సందడి చేసింది.

ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్ల కోసం గేమ్ ఆఫ్ ఎయిమ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో ఇమ్ము ఆర్కేకి, సంజనా త్రిగుణ్‌కి బడ్డీగా ఆడారు. చిక్కులున్న డబ్బాలను విప్పి ఒకదానిపై ఒకటి పేర్చి పాములా షేప్ తీసుకురావాలి. త్రిగుణ్ ఒకేసారి 3-4 డబ్బాలు పెట్టడంపై ఇమ్ము అభ్యంతరం చెప్పాడు. సంచాలక్‌గా ఉన్న అమన్‌తో ముకేష్ గొడవ పడ్డాడు. చివరకు ఇమ్ము - ఆర్కే జోడీ ఈ టాస్క్‌లో గెలిచి కెప్టెన్సీ రేసులో ముందుకు దూసుకెళ్లింది. రామకృష్ణ రూల్స్ వదిలేశాడని త్రిగుణ్ ఆరోపించినా అమన్ నిర్ణయమే ఫైనల్ అయ్యింది.

google-ad-img