ఆదికి బలుపు ఎక్కువ...అంకుల్ ని ఎవరు పెళ్లి చేసుకుంటారని అంటున్నారు...
on Mar 25, 2025
ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి "అనగనగ" మూవీ టీమ్ నుంచి సుమంత్, కాజల్ వచ్చారు. ఐతే సుమంత్ రావడమే సినిమాలోని ఒక డైలాగ్ ని అడిగాడు.. "నోటితో విసిరేసి చేత్తో ఏరుకునేది ఏమిటి" అని అడిగాడు. కానీ కొంతమంది సరిగా చెప్పలేదు. కొంతమంది మాత్రం అక్షరాలు అని చెప్పారు. ఇక రష్మీ ఆన్సర్ చెప్పమని అడిగేసరికి తనకు కూడా తెలీదని సినిమా చూసి తెలుసుకోవాలని చెప్పాడు. ఐతే వస్తూనే షోకి మీమ్స్ రాసిన టీ షర్ట్స్ తెచ్చాడు. వాటిని తీసుకుని ఎవరికి సెట్ అవుతాయో వాళ్లకు ఆ టీ షర్ట్స్ ఇచ్చింది మూవీ టీమ్. "ఇవే తగ్గించుకుంటే మంచిది" అనే మీమ్ టీ షర్ట్ ని ఆదికి ఇచ్చింది. అది చూసిన ఆది మీరు ఎన్ని టీ షర్ట్స్ ఇచ్చినా ఈ పొట్ట మాత్రం తగ్గించను అని చెప్పాడు. అది పొట్ట కాదండి బలుపు తగ్గదు అంటూ ఇంద్రజ కౌంటర్ ఇచ్చింది. దానికి ఆది రికౌంటర్ ఇచ్చాడు.
ఈ బలుపు మీకు, రష్మీకి, నాకు మన ముగ్గురికి సెట్ అవుతుంది అన్నాడు. తర్వాత వర్షాకి "ఓరి దీని యేషాలో" అనీ మీమ్, భావనకు "నా చావు నే చస్తా" , నరేష్ కి "ఆ కుర్చీని మడతపెట్టి", మళ్ళీ ఆదికే ఇంకో టీ షర్ట్ ఇచ్చారు ఆ మీమ్ ఏంటంటే "త్వరగా నాకు పెళ్లి చేసేయండి నాన్న" అనేది..ఇక్కడ ఆదికి పెళ్లి కావట్లేదు కాబట్టి వెంటనే పెళ్లి చేయండి అంటూ మీ నాన్నను అడగండి అని చెప్పారు. దానికి వర్ష కౌంటర్ ఇచ్చింది "ఆది రెడీనే కానీ అటు పక్కన అమ్మాయి దొరకట్లేదు. అంకుల్ ని ఎవరు చేసుకుంటారని" అనేసరికి ఆది ముఖం మాడిపోయింది. రష్మీకి "నువ్వూరుకోమ్మా తుతుతుతు అంటావ్" అనే మీమ్ వచ్చింది. ఇక ప్రసాద్ బెహరాకు "కోయారే... కోయ్..కోయ్.." , సత్య శ్రీకి "వచ్చిందండి వయ్యారి" అనే మీమ్స్ వచ్చాయి. ఆదికి మాత్రం సెట్ అయ్యే రెండు మీమ్స్ టీ షర్ట్స్ వచ్చాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
