కాస్ట్‌లీ కార్ కొన్న విరూపాక్ష నటి...
on Mar 25, 2025
విరూపాక్ష మూవీ అంటే చాలు ముందు హీరో హీరోయిన్ కంటే సోనియా సింగ్ గుర్తొస్తుంది. అమాయకంగా ఉండే పల్లెటూరి అమ్మాయి రోల్ లో సోనియా అద్భుతంగా నటించింది. ఇక సోనియా మిత్రుడు సిద్దు కూడా అర్దమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ తో అందరినీ అలరించాడు. యూట్యూబర్స్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వీళ్ళు తర్వాత షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. సిద్దుతో కలిసి "హే పిల్ల, రౌడీ బాబీ" వంటి యూట్యూబ్ ఛానెల్స్ స్టార్ట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. అలా సోషల్ మీడియాలో పాపులర్ కావడం స్క్రీన్ మీద చిన్నపిల్లలా ఆడియన్స్ ని అలరించడంతో 2023 లో రిలీజయిన "విరూపాక్ష" మూవీలో మంచి రోల్ కి అవకాశాన్ని కొట్టేసింది. అలాంటి సిద్దు, సోనియా కలిసి ఇప్పుడు ఢీ షోకి మెంటార్స్ గా వస్తున్నారు. వీళ్ళు త్వరలో పెళ్లి కూడా చేసుకుంటాం అంటూ కూడా ఆ షోలో చెప్పుకొచ్చారు.
అలంటి సోనియా సింగ్ రీసెంట్ ఒక కార్ కొనేసింది. మెర్సిడేస్ బెంజ్ సి క్లాస్ కారును కొనేసింది. ఇక ఈ కార్ కాస్ట్ 60 నుంచి 66 లక్షల మధ్య ఉంది. సోనియా తన ఫామిలీ మెంబర్స్ తో అలాగే సిద్దుతో తన క్యూట్ పప్పితో కలిసి షో-రూమ్ కి వచ్చి కేక్ కట్ చేసి అందరికీ తినిపించింది. ఫొటోస్ వీడియోస్ ని తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అది తన డ్రీం కార్ అంటూ చెప్పింది సోనియా. ఇక నెటిజన్స్ ఐతే ఆమెకు కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు. షో రూమ్ నుంచి సిద్దు సోనియాని పక్కన కూర్చోబెట్టుకుని కార్ డ్రైవ్ చేసుకుని వెళ్లిపోయారు. సోనియా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో ఒక కామెడీ రోల్ లో కూడా నటించింది. సిద్ధుతో కలిసి "శశి మధనం" అనే ఓటిటి మూవీతో అలరించింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
