Home

»

Tv News

 శ్రీవల్లికి చందు షాక్.. యాక్సిడెంట్ వెనుక కుట్రను ఛేదించే పనిలో ధీరజ్!

Apr 12, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-443 లో.. ప్రేమ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటే ధీరజ్ తనకి అన్నం తినిపిస్తుంటాడు. పక్కన నర్మద ఉంటుంది. ఇది బాగుందని ప్రేమ అంటుంది. హలో కష్టాల్లో వదిలేసారని మీ వాళ్ళు కాకుల్లా అంటారని నేను అలా బాగా చూసుకుంటానని చెప్పాను అంతేగానీ నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదని ప్రేమతో ధీరజ్ చెప్తాడు.  దాంతో ప్రేమ డిస్సప్పాయింట్ అవుతుంది. అయితే ప్రేమ హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఎందుకు ఏడ్చావని నర్మద అనగానే ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు ఏడిస్తే క్యూట్ గా ఉంటావ్.. రా నేను మిస్ అయ్యానని ప్రేమ అనగానే అంత లేదు.. అక్కడ అందరిలాగే నేను ఫీల్ అయ్యానని ధీరజ్ అంటాడు. అవునా అని ప్రేమ అనగా నీకు యాక్సిడెంట్ అయిందని ఏదైనా అవుతుందేమోనని ఏడ్చానని ధీరజ్ అనగానే మగాడి ప్రేమకి అతడి కన్నీళ్ళే సాక్ష్యం ధీరజ్ అని నర్మద అనగానే ప్రేమ మురిసిపోతుంది.

ఇక మరోవైపు శ్రీవల్లి క్యారేజ్ తీసుకొని వస్తుంది. అది యాక్సిడెంట్ లా అనిపించడం లేదురా.. ఎందుకంటే చందు బావ రోడ్డుకి ఎడమవైపే ఉన్నాడు.. ఒకవేళ బ్రేకులు ఫెయిల్ అయినా పక్కకి తిప్పొచ్చు కానీ కావాలనే చేశారని ప్రేమ అనగానే నర్మద, ధీరజ్ లకి డౌట్ వస్తుంది. ఇక అప్పుడే శ్రీవల్లి వచ్చి.. తెలిసిపోయిందా అని తీసుకొని వచ్చిన క్యారేజ్ కిందపడేస్తుంది.‌ ఇక అందరు వస్తారు. ఏమైందని శ్రీవల్లిని అడుగగా.. అదే బావకి యాక్సిడెంట్ అయ్యేదని తప్పిందని తెలిసి కంగారుపడ్డాను.. ప్రేమ కోసం చేపల కూర తీసుకొని వచ్చానని శ్రీవల్లి చెప్తుంది. దాంతో రామరాజు మీ అమ్మకి ఎలా ఉందని అంటాడు. దానికేం గుండ్రాయిలాగా ఉందని శ్రీవల్లి అంటుంది. అదేంటని అడుగగా అదే మామయ్య తన కాలుకి గాయమైంది కదా మిగతాదంతా బాగానే ఉందని శ్రీవల్లి అంటుంది. నేను ప్రేమ కోసం వచ్చాను.. అత్తయ్య గారు కూడా లేరు కదా నేను తోడుగా సాయంగా ఉందామని వచ్చానని శ్రీవల్లి అంటుంది. 

నువ్వు ఇక్కడ అవసరం ఏం లేదు.. ఇక్కడ నేను, నర్మద, ధీరజ్ అందరం ఉన్నాం.. కానీ మీ అమ్మకి నువ్వే ఉన్నావ్.. నువ్వు ఇక్కడ ఉండటం కంటే కూడా అక్కడే మీ అమ్మ దగ్గర ఉండాలని  చందు అంటాడు. దానికి నర్మద కూడా చందుకి సపోర్టివ్ గా శ్రీవల్లిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతుంది. దాంతో చేసేదేమీ లేక శ్రీవల్లి రావాల్సి వస్తుంది. మరోవైపు చేపల కూర కోసం ఆనందరావు ఎదురుచూస్తుంటే ముక్కలు లేవని, మాములు పులుసు పోస్తుంది భాగ్యం. ఏమైందని అడుగగా.. అక్కడ కూతురిని ఎంకరేజ్ చేసి పంపించా.. తనకి ఎలా ఉందో ఏమో అనేది లేకుండా చేపలు కావాలా అని ఆనందరావుకి భాగ్యం చీవాట్లు పెడుతుంది. దాంతో ఆనందరావు తింటుంటే అప్పుడే తన నోట్లోకి చేప ముక్క వస్తుంది. అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే భాగ్యం లేచి నిలబడి ఏమైందని శ్రీవల్లిని అడుగుతుంది. ఆ నర్మద, ప్రేమ నన్ను రానీయకుండా చేశారు. వారికి తోడుగా చందు బావ కూడా ఉన్నాడని శ్రీవల్లి అనగానే సరేలే మనం మరో కొత్త ప్లాన్ ఆలోచిద్దామని భాగ్యం అంటుంది. మరోవైపు ధీరజ్ కి డౌట్ వచ్చి తన ఫ్రెండ్ కి కాల్ చేసి.. ఆ లారీ ఎవరిది.. ఆ రోజు నడిపింది ఎవరు.. అన్నీ డీటేయిల్స్ కనుక్కోమని చెప్తాడు. అతడు సరే అంటాడు. మరోవైపు ధీరజ్ చేత ప్రేమ సేవ చేయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com