Home

»

Tv News

రాజు అదిరిపోయే స్కెచ్.. ఆస్తుల పత్రాలపై సంతకం వేళ ఊహించని మలుపు!

Apr 12, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1004 లో..... ఇందు కేక్ కట్ చేస్తుంది ఆ తర్వాత ఆస్తుల పేపర్ పై వేలిముద్ర పెట్టమని రేఖ అంటుందిన వేలిముద్ర ఏంటి సంతకం చేయదా అని లాయర్ అడుగుతాడు. అంటే మా ఇందుకి చదువు అబ్బలేదని రేఖ అంటుంది. దాంతో వేలిముద్ర పెట్టడానికి ఇంకు ప్యాడ్ తెప్పిస్తుంది రేఖ. ఇందు వేలిముద్ర పెట్టబోతుంటే అప్పుడే మత్తుతో కూడిన పొగని రాజు వదులుతాడు. దాంతో అందరు పడిపోతారు. ఇందు మాత్రం స్వాతి మనుషులే కిడ్నాప్ చేస్తున్నారని పొగ పీల్చుకోకుండా వాళ్ళతో పాటు వెళ్తుంది.

బయటకు వెళ్ళాక పక్కన దాచిపెట్టుకున్న బ్యాగ్ తీసుకొని వస్తుంది. దాంతో రాజు, లక్కీ షాక్ అవుతారు. వాళ్ళు మాస్క్ లో ఉన్నారు కాబట్టి ఇందు వాళ్లని గుర్తుపట్టదు. పదండీ త్వరగా అని ఇందు అంటుంది. దాంతో ఇందుకి మత్తు మందు ఇచ్చి అక్కడ నుండి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత శేషు స్పృహలోకి వచ్చి అందరిపైన వాటర్ చల్లుతూ లేపుతాడు. అప్పుడే ఐశ్వర్య వచ్చి.. రేఖ అంటి ఆ ఇందుని ఎవరో కిడ్నాప్ చేశారని అనగానే రేఖ షాక్ అవుతుంది. వెంటనే పోలీసులకి ఇన్ఫర్మ్ చెయ్ అని భూషణ్ కి చెప్తుంది. ఆ తర్వాత ఇందుని తాళ్లతో బంధీస్తారు రాజు, లక్కీ. ఆ తర్వాత  ఐశ్వర్య, రాజ్ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటారు. అప్పుడే మా ఆంటీకి ఫోన్ చేసి డబ్బు అడుగమని చెప్తుంది. ఇప్పుడే అడగొద్దని రాజు అంటాడు.

ఒక కోటి అడుగుతానని రాజు అనగానే అంత డబ్బు ఆ.. అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఐశ్వర్య అంటుంది. రాజు మొదట ఒప్పుకోడు ఆ తర్వాత ఒప్పుకుంటాడు.. మరొకవైపు రేఖ దగ్గరికి పోలీసులు వస్తారు. ఎవరిపైన అయినా అనుమానం ఉందా అని రేఖని అడుగుతారు. లేదండి అని రేఖ చెప్తుంది. ఇది ఎవరో మీకు తెలిసిన వాళ్లే చేశారని ఇన్‌స్పెక్టర్‌ అనగానే ఐశ్వర్య షాక్ అవుతుంది. తరువాయి భాగంలో ఇందు తనని కిడ్నాప్ చేసింది రాజు, లక్కీ అని ఇందుకి తెలుస్తుంది. మేం డబ్బు కోసం ఏదైనా చేస్తామని రాజు అనగానే అంటే డబ్బు కోసం నన్ను ఎవరు కిడ్నాప్ చేయించారని ఇందు అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com