Home

»

Tv News

Illu Illalu Pillalu: బయటపడిన శ్రీవల్లి కుట్ర.. కూతురు చెప్పింది విని షాక్ లో వేదవతి!

Mar 22, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -425 లో... శ్రీవల్లి కంగారుగా ఇంటికి వస్తుంది. తను అలా రావడం వేదవతి చూస్తుంది. అప్పుడే నర్మద వస్తుంది. నర్మదని చూసి శ్రీవల్లి లోపలికి పరుగెడుతుంది. కిచెన్ లోకి వెళ్లి ఏదో పని చేసినట్లు యాక్టింగ్ చేస్తుంది. ఎందుకు కంగారు పడుతున్నావని నర్మద అనగానే నాకేం కంగారు లేదని వల్లి చెప్తుంది. 

ఆ తర్వాత బ్రోకర్ ఫోటో చూపించి ఇతను తెలుసా అని అడుగుతుంది. ఆ రోజు సాగర్ మరిది పార్టీలో చూసానని వల్లి చెప్తుంది. అయితే మా అయన జాబ్ విషయం బయటపడడంలో నీ ప్రమేయం లేదా అని నర్మద అడుగుతుంది. లేదు నర్మద అనవసరంగా నన్ను అపార్ధం చేసుకుంటున్నావని వల్లి అంటుంది. సరే నాకు కాఫీ ఇవ్వమని నర్మద చెప్తుంది. ప్రేమకి ఫోన్ చేసి తన ఫోన్ అక్కడ కిచెన్ లో పెట్టి బయటకు వెళుతుంది నర్మద. 

ఆ తర్వాత శ్రీవల్లి వాళ్ళ అమ్మకి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. అదంతా ప్రేమ, నర్మద తన ఫోన్ లో వింటారు. ఆ నర్మద అన్ని గుచ్చిగుచ్చి అడిగిందని చెప్తుంది. నాకు భయంగా ఉందే అమూల్య, విశ్వ ప్రేమకి కారణం నేనే అని. పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న తనని విశ్వకి అప్పగించానని తెలిసిపోతుందేమోనని భయంగా ఉందని శ్రీవల్లి ఫోన్ లో మాట్లాడుతుంటే అవన్నీ వేదవతి విని షాక్ అవుతుంది. మరొకవైపు ప్రేమ ఫోన్ లో నర్మద ప్రేమ వింటారు. చూసావా అక్క ఎలాంటిదో అని ప్రేమ అనగానే.. దాని సంగతి చెప్తామని ప్రేమని నర్మద ఆపుతుంది. ఎప్పుడు ఇలాగే ఆపుతున్నావని ప్రేమ అంటుంది. ఒక బోర్డుపై ఆపరేషన్ అని రాసి శ్రీవల్లి తనంతట తనే నిజం ఎలా ఒప్పుకునేలా చెయ్యాలో ప్రేమకి నర్మద ప్లాన్ చెప్తుంది.

మరొకవైపు అమూల్య దగ్గరికి వేదవతి వచ్చి.. నేనొకటి అడుగుతానని, అమూల్య చేతిని వేదవతి పైన పెట్టుకొని విశ్వని ప్రేమించమని ఎవరు చెప్పారని అడుగుతుంది. దాంతో అమూల్య షాక్ అవుతుంది. నిజం చెప్పు ఆ వల్లినే కదా అని వేదవతి అనగానే అవును అమ్మ అని జరిగింది మొత్తం చెప్తుంది అమూల్య. ఎక్కడ తన పేరు చెప్తే చందు అన్నకి తనకి గొడవ అవుతుందేమోనని చెప్పలేదు అమ్మ అని అమూల్య అంటుంది. ఈ విషయం ఇంట్లో అందరికి తెలుసా అని అమూల్య అనగానే లేదు నాకు ఒక్కదానికే తెలుసని వేదవతి అంటుంది. ఆ తర్వాత వేదవతి జరిగింది గుర్తుచేసుకొని వల్లి దగ్గరికి వెళ్ళబోతుంటే తన అంతరాత్మ ఆగమని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com