
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -986 లో.... లాయర్ ని అపర్ణ కలిసి ఆస్తులన్నీ ఇందు పేరున ఉండాలని చెప్పడం రేఖకి తెలిసి, సుభాష్ కి ఏదో ఇంజక్షన్ ఇప్పిస్తుంది. దాంతో సుభాష్ ఊపిరి అందడం లేదని ఇబ్బంది పడుతాడు. ఆంటీ ప్లీజ్ ఆంటీ ఏం ఇంజక్షన్ ఇప్పించారని ఇందు రిక్వెస్ట్ చేస్తుంది. ఆ ఇంజక్షన్ నా రూమ్ లో ఉందని రేఖ అనగానే ఇందు వెళ్లి చూస్తుంది. అక్కడ ఉండదు.. ఆ తర్వాత వదిన రూమ్ లో అంటుంది. ఐశ్వర్య రూమ్ లో అంటుంది. అలా అన్ని రూమ్ లు ఇందు వెతుకుతుంది.
రేఖ అబద్ధం చెప్తుందని అపర్ణకి అర్థం అవుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావని అపర్ణ అనగానే.. ఇన్ని అర్థం చేసుకున్న నువ్వు లాయర్ ని కలిస్తే నాకు తెలియదా అని రేఖ అనగానే అపర్ణ షాక్ అవుతుంది. నాకు అంత తెలుసు ఆస్తులన్నీ నీ మనవరాలి పేరున ఉండాలనుకుంటున్నావు కదా అని రేఖ అనగానే నానమ్మ ఏంటని ఇందు షాక్ అవుతుంది. యాక్టింగ్ చెయ్యకు అన్ని నీకు తెలిసే జరుగుతున్నాయి.. ఇంకా కాసేపు అలాగే ఉంటే మీ తాతయ్య ఉండడు అని రేఖ అనగానే మా నానమ్మ చేసింది తప్పే అని ఇందు అంటుంది.
ఆ తర్వాత రేఖ కాళ్ళు పట్టుకొని అపర్ణ క్షమించమని అడుగుతుంది. దాంతో రేఖ ఇంజక్షన్ ఇస్తుంది. అది తీసుకొని వెళ్లి సుభాష్ కి వేస్తుంది ఇందు. దాంతో అతను మామూలు స్టేజ్ లోకి వస్తాడు. ఆ తర్వాత మిమ్మల్ని వదిలి వెళ్లడం నా తప్పే అని అపర్ణ బాధపడుతుంటే.. ఇప్పుడు ఆ లాయర్ ని ఎందుకు కలిసావని ఇందు కోప్పడుతుంది. నాకు ఆస్తులు ముఖ్యం కాదు.. నాకు మీరు ముఖ్యం.. ఎన్ని ఆస్తులున్నా మీరు లేనిది నాకు ఒంటరితనమే ఉంటుందని అపర్ణతో ఇందు చెప్తుంది.
తరువాయి భాగంలో ఇందుకి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. దాంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అని స్వాతితో ఇందు చెప్తుంది. ఆ తర్వాత రాజు తన చిన్నతనంలో బస్ బ్లాస్ట్ అవడం గుర్తుచేసుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






