మను తండ్రి ఎవరు.. ఇంకోసారి నా జోలికి వస్తే మామూలుగా ఉండదు!
on Jul 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1120 లో..... సిచువేషన్ అర్ధం చేసుకోని మాట్లాడమని సరోజతో రంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటి అమ్మమ్మ.. బావ నన్ను పెళ్లి చేసుకోనని అంటుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావ్ ఎందుకని పెద్దావిడని సరోజ అడుగుతుంది. వాడికి ఇష్టం లేకుండా ఏది జరగదు. నువ్వు వాడికి ఇష్టం వచ్చినట్టు ఉండు అంతేగానీ వాడికి కోపం తెచ్చే పనులు చెయ్యకని పెద్దావిడ చెప్తుంది. వాడు నిన్నే పెళ్లి చేసుకుంటాడు కానీ నువ్వేం టెన్షన్ పడకని పెద్దావిడ అనగానే.. ఏదో అమ్మమ్మ అలా చెప్తుంది కానీ బావకే సపోర్ట్ గా ఉంటుంది. కానీ నా బావ విషయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వసుధారని కనిపెడుతూ ఉండాలని సరోజ అనుకుంటుంది.
మరొకవైపు ఏంజిల్, మను ఇద్దరు కోపంగా ఇంటికి వస్తారు. ఏమైంది అలా ఉన్నారంటూ అనుపమ, మహేంద్ర లు అడుగుతారు. ఏం లేదని మను అన్నా కానీ ఏంజిల్ మాత్రం కాలేజీలో జరిగింది మొత్తం చెప్తుంది. ఆ దేవాయని వచ్చి నేను బావతో మాట్లాడుతుంటే.. ఇదేమైన గెస్ట్ హౌసా అంటూ చాలా నీచంగా మాట్లాడిందని ఏంజిల్ చెప్తుంది. తనకి ఒకసారి కాకున్నా ఒకసారి అయిన బుద్దిరాదు.. ఇప్పుడే వెళ్లి నిలదియ్యాలని మహేంద్ర అనగానే.. వద్దు సర్ వదిలెయ్యండి అని మను అంటాడు. ఇప్పుడు అంది.. ఏం అనకుంటే మళ్ళీ అంటుంది. అలా వదిలెయ్యకూడదు. అన్నయ్య ముందే వార్నింగ్ ఇవ్వాలంటూ మహేంద్ర అనుపమలు ఫణీంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తారు.
ఏం జరిగింది మహేంద్ర అని ఫణీంద్ర అడుగుతాడు. వదిన కాలేజీలో మనుతో తప్పుగా మాట్లాడిందంట.. నీ తండ్రి ఎవరంటు మనుని బాధపెట్టిందట అని మహేంద్ర అనగానే.. వీళ్ళకి అసలు బుద్ధి రాదని ఫణీంద్ర అంటాడు. నువ్వు వదినతో ఏం మాట్లాడతావో మాట్లాడు అనుపమ ఏం భయం లేదని మహేంద్ర చెప్పగానే.. నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు కానీ నా కొడుకుని ఇబ్బంది పెట్టకంటు దేవయానితో అనుపమ అంటుంది. సరే నిన్నే అడుగుతున్నాను.. మను తండ్రి ఎవరు అని దేవయాని అడుగుతుంది. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పనని అనుపమ అంటుంది. ఇంకొకసారి నా జోలికి, నా కొడుకు జోలికి రాకని అనుపమ వార్నింగ్ ఇస్తుంది. అనుపమ, మహేంద్ర వెళ్తుంటే.. ఇలాంటి దేవయానిలు బయట చాలా మంది ఉంటారు. తన నోటిని ఆపవచ్చు కానీ బయట వాళ్ళని ఆపలేమని ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్ర లు మాట్లాడుకుంటుంటే.. ధరణి వచ్చి శైలేంద్రకి చిరాకు తెప్పిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read