బిగ్ బాస్ లోకి రాయల్ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ!
on Oct 7, 2024
బిగ్ బాస్ 2.0 లో ఎనిమిది మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అందులో చివరగా ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ.. సీజన్-4లో వాతావరణానికి అడ్జెస్ట్ అవ్వలేక అయిదో వారమే హౌస్ నుండి బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ హౌస్ లోకి ఛాన్స్ వచ్చిందంటే మాములు విషయం కాదు. వైల్డ్ కార్డ్స్ లో చివరి కంటెస్టెంట్ అంటూ గంగవ్వ ఇంట్రడక్షన్ ని చూపించాడు నాగార్జున.
ఆ తర్వాత గంగవ్వ సూటు, క్యాప్, కళ్లజోడు, మెడలో చైన్ తో గ్రాంఢ్ లుక్ లో ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తనకి అర్ధం అయ్యే బాషలో, తెలంగాణ యాసలలో నాగార్జున మాట్లాడాడు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బులు, మీరు నాకు ఏడు లక్షలు సాయం చేసారు.. దాంతో ఇల్లు కట్టుకున్నాను.. నేను ఎప్పటికి అది గుర్తుపెట్టుకుంటాను.. అందరికి అదే చెప్తున్నానని గంగవ్వ తన సంతోషాన్ని పంచుకుంది. హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారని నాగార్జున అనగా.. వరంగల్ పిల్లగాడు నబీల్ అని చెప్పింది గంగవ్వ. అప్పుడు నేను హౌస్ లో ఉండలేదు.. బయటకు వచ్చాక అందరు ఎందుకు వచ్చావ్.. నువ్వు విన్ అయ్యేదానివి.. మేమ్ అందరం సపోర్ట్ గా ఉన్నామని అన్నారు.. అయిదవ వారంలో బయటకు వచ్చిన అయిదవవారం లో మళ్ళీ లోపలికి వెళ్తున్నానని గంగవ్వ అంది. హౌస్ లోకి తమ పొలంలో పండించిన కూరగాయలని తీసుకొచ్చింది గంగవ్వ. హౌస్ లో కూరగాయల గురించి గొడవపడుతున్నారు అందుకే మందులు కొట్టని, కూరగాయలు హౌస్ లోకి తీసుకొని వెళ్ళాలని తెచ్చినా అని గంగవ్వ స్టేజ్ మీద చెప్పింది.
ఆ తర్వాత గంగవ్వ కోసం అఖిల్ సార్థక్ పంపిన వీడియోని ప్లే చేసి చూపించాడు నాగార్జున. గంగవ్వ నువు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తావ్.. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది అప్పుడు.. మళ్ళీ ఇప్పుడు నువ్వు హౌస్ లోకి వెళ్తున్నావ్ బాగా ఆడు అని అఖిల్ సార్థక్ చెప్పాడు. ఆ తర్వాత గంగవ్వ ని డోర్ వరకు నాగార్జున స్వయంగా తీసుకొని వెళ్ళాడు. హౌస్ లోకి వెళ్ళాక పాత కంటెస్టెంట్స్ కి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ కి టాస్క్ ఉంటుంది. ఒకవైపు విష్ణు ప్రియ, సీతలు రాగా.. మరోవైపు అవినాష్, గంగవ్వలు వచ్చి ఆడతారు. గంగవ్వ, అవినాష్ లు విన్ అయి ఇమ్మ్యూనిటి స్టార్ సాధిస్తారు. గంగవ్వ హౌస్ లోకి వెళ్ళిన మొదటి రోజే యూత్ తో సమానంగా అడి గెలవడంతో వాళ్ళు బిత్తరపోయి చూస్తున్నారు. గంగవ్వ టాస్క్ లో ఫాస్ట్ గా ఆడి.. పాత కంటెస్టెంట్స్ షాక్ ఇచ్చింది. హౌస్ లో ఇక ముందు టాస్క్ లలో ఎలా పర్ఫామెన్స్ ఇస్తుందో చూడాలి మరి.
Also Read