ENGLISH | TELUGU  
Home  » TV News

Eto Vellipoyindhi Manasu : కోడలి చేత సంతకం పెట్టించలేకపోయిన సవతి తల్లి.. బాధలో కొడుకు!

on Dec 29, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -291 లో.....రామలక్ష్మి పెట్టిన ట్విస్ట్ కి శ్రీలత వాళ్లకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎలాగైనా రామలక్ష్మితో ఆస్తులు అమ్ముకోవచ్చని సంతకం పెట్టించాలని రామలక్ష్మి దగ్గరికి ధనని పంపిస్తారు. ధన లోపలికి వెళ్లకుండా బయట నుండే రామలక్ష్మిని పిలుస్తుంటాడు. కాసేపటికి రామలక్ష్మి రాగా.. ధన పక్కకి తీసుకొని వెళ్లి దీనిపైన సంతకం పెట్టమని అంటాడు.. నేను పెట్టనని తన చెంప చెల్లుమనిపిస్తుంది రామలక్ష్మి. అది మాణిక్యం చూస్తాడు. ఆ తర్వాత ధన జరిగింది వెళ్లి బయటున్న సందీప్, శ్రీలతలకి చెప్తాడు.

నువ్వు వెళ్ళు.. అమ్మలేదంటే మన పరిస్థితి తెలుసు కదా అని సందీప్ అంటాడు. ఆ తర్వాత ముగ్గురు మళ్ళీ రామలక్ష్మి దగ్గరికి వెళ్తారు. శ్రీలత మాట వినగానే మా అమ్మ వచ్చిందంటూ తినే ప్లేట్ లో వాటర్ పోసి వెళ్తాడు సీతాకాంత్.

 ఇంత మోసం చేస్తారా ఆస్తులన్నీ రాసి అమ్ముకునే అవకాశం లేకుండా నీ భార్య వీలునామా రాసిందని శ్రీలత అనగానే.. నిజంగా నాకు తెలియదని సీతాకాంత్ అంటాడు. అసలేం జరుగుతుంది.. మీ అమ్మ నిజ స్వరూపం నీకు తెలియదు అల్లుడు అని మాణిక్యం అనగానే.. నా గురించి నేనే నీ అల్లుడుకి చెప్పానని అనగానే మాణిక్యం షాక్ అవుతాడు. ఆ తర్వాత ధన పైన సుజాత, మాణిక్యంలు తిడతారు. సంతకం పెట్టమని సీతాకాంత్ అనగా.. నేను పెట్టను మీరు వాళ్లు బాగుపడాలని నన్ను పెట్టమని అనకండి అని రామలక్ష్మి అంటుంది. దాంతో సీతాకాంత్ సైలెంట్ గా ఉంటాడు.

మరొకవైపు శ్రీలత కోపంగా ఇంటికి వెళ్తుంది. ఏమైందంటూ శ్రీవల్లి అడుగగా సంతకం పెట్టలేదని చెప్తారు. నాకు అర్థమైంది. 

తను ఛాలెంజ్ చేసి వెళ్ళినప్పుడే ఏదో ప్లాన్ చేసిందని అర్థమైందని శ్రీవల్లి అంటుంది. శ్రీలత కోపంగా సీతాకాంత్ ఫోటోని కింద పడేస్తుంది. మీ అక్క చేత సంతకం పెట్టించలేక పోయావని ధనతో శ్రీలత అనగానే‌.. మీరు నా కంటే పెద్ద వారు.. మీరే ఏం చెయ్యలేదని ధన అంటాడు. మరొకవైపు సీతాకాంత్ తన తల్లి చేసిన మోసాన్ని గుర్తుచేసుకుంటాడు‌ అప్పుడే రామలక్ష్మి వస్తుంది. అందరు నన్ను జాలిగా చూస్తుంటే భరించలేకపోతున్నానని రామలక్ష్మితో  సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.