Karthika Deepam2 : టిఫిన్ బండి పెడదామనుకుంటున్న దీప.. వద్దన్న కార్తీక్!
on Dec 29, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -240 లో..... దీప వంటమనిషిగా జాయిన్ అయిన దగ్గరికి అప్పుడే సరుకులు తీసుకొని కార్తీక్ అక్కడికి వస్తాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. కార్తీక్ సరకులు చెప్తుంటే.. దీప సరి చూసుకుంటుంది. అక్కడే ఉన్న ఇంటి యజమాని అక్కడ యాభై రూపాయలున్నాయ్ తీసుకొని వచ్చి.. ఆ అబ్బాయికి ఇవ్వమనగానే దీప తీసుకొని వచ్చి కార్తీక్ ఇస్తుంటే.. నాకు ఇచ్చే అలవాటు ఉంది కానీ తీసుకునే అలవాటు లేదని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు.
ఏదో గొప్పగా బతికినట్లు ఆ పొగరు ఎందుకని యజమాని అంటుంది. మరొకవైపు జ్యోత్స్న ఇంటికి వెళ్లి పారిజాతంతో బావకి ఎక్కడ ఉద్యోగం రాకుండా చేసానని హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఇక బావ నా దగ్గరికి రావాలి వేరే ఆప్షన్ లేదని అనుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీపలు ఇంటికి ఒకేసారి వస్తారు. జాబ్ ఏమైందని కాంచన కార్తీక్ ని అడుగగా.. ఆ ఫోన్ చేసింది శ్రీధర్ అని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ ఇంట్లోకి వెళ్ళాక.. ఎందుకు మీరు అక్కడ సూపర్ మార్కెట్ లో జాయిన్ అయ్యారని దీప అడుగుతుంది. జాబ్ వచ్చేదాకా ఇంట్లో గడవాలి కదా అయిన నువ్వు ఎందుకు వంట మనిషిగా జాయిన్ అయ్యావని కార్తీక్ అడుగుతాడు.
మరొకవైపు స్వప్న వాంథింగ్ చేసుకుంటుంది. ప్రెగ్నెంట్ ఏమో అనీ కాశీ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
నువ్వు చేసిన వంటకి ఇలా అయిందని స్వప్న అంటుంది. అప్పుడే దాస్ వచ్చి దీప ఫోన్ చేసిందని వెళ్తున్నానని అంటాడు. ఆ తర్వాత స్వప్న, కాశీ, దాస్ లు కార్తీక్ ఇంటికి వెళ్తారు. మనం ఒక టిఫిన్ సెంటర్ పెడదామని దీప అనగానే.. నాకు ఇష్టం లేదు నేను వేరే ఆలోచిస్తున్నానని కార్తీక్ అంటాడు. నా దగ్గర పెట్టుబడికి ఉన్నాయ్ ఒక బండి చూడమని దాస్ కి చెప్తుంది దీప. టిఫిన్ సెంటర్ పేరు ఏంటని స్వప్న అనగానే దీప సర్ ప్రైజ్ అంటుంది. నేను కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను ఒప్పుకోండి అని కాంచనతో దీప అనగానే కాంచన ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read