Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి ప్రేమ తెలిసిపోయింది.. రివర్స్ డ్రామా!
on Oct 11, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -223 లో.....సందీప్, శ్రీలతలు రౌడీ తో ఉన్న ఫోటోలని నందిని వాళ్లకు పంపిస్తుంది. అది చూసి శ్రీలత, సందీప్ లు షాక్ అవుతారు అప్పుడే నందిని ఫోన్ చేసి.. మీరు ఇద్దరు ఇక్కడికి రావాలి లేదంటే ఆ ఫోటోలు సీతాకాంత్ కి పంపిస్తానని చెప్తుంది. దాంతో కంగారుగా శ్రీలత, సందీప్ లు నందిని దగ్గరికి వెళ్తారు. మీరూ చూపించే సవతి ప్రేమ నాకెలా తెలుసనుకుంటున్నారా అని నందిని అంటుంది. రామలక్ష్మి అడ్డు తొలగించి ఆస్తులు సొంతం చేసుకోవాలని చూస్తున్నారని నాకు తెలుసు అని నందిని అంటుంది. అప్పుడే సందీప్, శ్రీలతలు గోడకి సీతాకాంత్, నందినిలున్నా ఫోటోని చూసి రివర్స్ డ్రామ ప్లే చేస్తుంటారు.
నువ్వు ఆ విషయం సీతాకాంత్ తో చెప్పగలవా చెప్పు.. నిన్ను దక్కించుకోవాలని అందుకే ఇలా నాపై నిందలు వేస్తుందని చెప్తానని శ్రీలత అంటుంది. నువ్వు సీతాకాంత్ ని ప్రేమించావు.. నిన్ను కాదని రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు రామలక్ష్మిని అడ్డు తొలగించి సీతాకాంత్ ని సొంతం చేసుకోవాలనుకుంటున్నావని శ్రీలత అనగానే.. నందిని షాక్ అవుతుంది. మన ఇద్దరి లక్ష్యం ఒకటే అయినప్పుడు.. మనం శత్రువులలాగా ఉండొద్దు మిత్రల్లాగా ఉండాలని శ్రీలత అంటుంది. దాంతో ఇప్పుడు వీళ్ళతో చెయ్యి కలపకపోతే సీతాకీ నెగెటివ్ చెప్తారని అనుకొని సరేనని వాళ్ళతో నందిని చెయ్ కలుపుతుంది.. ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వచ్చి.. మాట్లాడాలని ట్రై చేస్తుంది కానీ సీతాకాంత్ దూరంగా వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత వాళ్ళు దగ్గర అవుతున్నారనుకుంటే.. మళ్ళీ ఇలా అయిందని పెద్దాయన అంటాడు. వాళ్ళని మళ్ళీ కలపాలంటే నువ్వు వెళ్లి సీతాని భోజనానికి తీసుకొని రా అని పంపిస్తాడు. సిరి వెళ్లి భోజనానికి రా అన్నయ్య అనగా.. రానని అంటాడు. అయినా బలవంతంగా తీసుకొని వస్తుంది సిరి. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. భోజనం చెయ్ వదిన అంటుంది. నాకు ఆకలిగా లేదని రామలక్ష్మి అంటుంది. మీ అమ్మ ఒక మాట అంటే ఇలాగే ఉండేదానివా అంటూ వారందరి ముందు శ్రీలత యాక్ట్ చేస్తుంది. నువ్వు అన్నయ్య తినకపోతే నేను తిననని సిరి అనగానే.. ఇద్దరు కూర్చొని భోజనం చేస్తారు. మళ్ళీ రామలక్ష్మి ఫై అన్నయ్యకి కోపం వచ్చేలా చెయ్యాలని శ్రీవల్లితో సందీప్ అంటాడు. కానీ రామలక్ష్మి రివర్స్ గా అత్తయ్య అంటూ భోజనం తినిపిస్తుంది. నీను తినిపిస్తే తినరా అని అనగానే.. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read