సుమ కనకాల భర్తకు లైన్ వేస్తున్న సౌమ్య..ఏకె 47 అని ఆదిని పెళ్లి చేసుకున్నా..కానీ
on Jan 1, 2025
న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో ప్రసారమైన దావత్ షో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక ఇందులో సౌమ్య రావు ఐతే ఆదిని ఫుల్ గా తన స్పెషల్ తెలుగు భాషతో ఆడేసుకుంది. సౌమ్య స్టేజి మీదకు రాగానే నాటి నరేష్ వచ్చాడు. తర్వాత ఆదిని ఒక రేంజ్ లో ఆడుకుంది సౌమ్య. "ఆదితో పెళ్ళై ఆరేళ్ళు అయ్యింది..ఆదికి కడుపొచ్చింది .. నాకు కడుపెక్కడిది ..నీకు అందరి దాహం గురించి తెలుసు. నా గురించి మాత్రం తెలీదు. ఎప్పుడూ బయట పని చేస్తాడు..ఇంట్లో నా పని చూడడు... నా మొగాడు,నా మొగుడు ఇంట్లో పని చేయడు. నన్ను పట్టించుకోవడం లేదు." అనేసరికి ఆది ఫుల్ జోష్ తో డైలాగ్ చెప్పేసాడు. "ఏమే రేపటి నుంచి మునక్కాకాయలు వంటి అరుదుగా దొరికేవన్నీ చేసి పెట్టు... తింటాను" అన్నాడు ఆది.. "ఎదురుగా కనిపించే నన్ను వదిలేస్తావు. అవన్నీ తింటావు.." అనేసరికి.."ఏంటే తాలింపులో కరివేపాకులా నన్ను తగులుకున్నావ్" అని ఆది అడిగేసరికి " నువ్వు కొత్తిమీరగాడివి కదా అందుకే నేను కరివేపాకులా కనిపిస్తాను నీకు" అంటూ ఘాటుగా ఆన్సర్ ఇచ్చింది. తర్వాత ఆది పక్కకు వచ్చిన రీతూ చౌదరి, ఆరియానా అతని భుజం మీద చేతులు వేసేసరికి "ఎవరండీ మీరు పంది మీద పురుగుల్లా వాలారు మా అయన మీద" అంటూ తిట్టింది సౌమ్య. "ఏకె 47 అని చెప్పారని పెళ్లి చేసుకున్నా కానీ పెళ్లయ్యాక తెలిసింది అసలు ఏకె 47 కాదు" అంటూ ఆది పరువు తీసేసింది సౌమ్య. "అలా అన్ని విషయాలు చెప్పకు వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు" అంటూ సుమ రాజీవ్ కనకాలను చూపిస్తూ చెప్పేసరికి .."బబుల్ గం తినేంత పెద్ద కొడుకు ఉన్నాడంటే నమ్మొచ్చు కానీ రాజీవ్ కనకాల చాలా యంగ్ గా ఉన్నారు" అని సౌమ్య అనేసరికి "ఏంటి మా ఆయనకు లైన్ వేస్తున్నావ్ వెళ్ళు" అంటూ పంపేసింది.
Also Read