అనామిక, నందగోపాల్ మంతనాలు.. కావ్య కనిపెట్టేనా!
on Dec 31, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -607 లో.....రుద్రాణి హాల్లో కూర్చొని.. పనిమనిషి శాంతని కాఫీ తీసుకొని రమ్మని చెప్తుంది. అప్పుడే ఇచ్చాను కదా అని శాంత అనగానే.. నాకు మళ్ళీ కావాలని రుద్రాణి అంటుంది. అయితే ఇక మళ్ళీ అడగొద్దు.. ఇంట్లో ఎవరికి అయిన కాఫీ, టీలు రోజుకి రెండు సార్లు ఇవ్వద్దని కావ్య చెప్పిందని శాంత అంటుంది. కోపంగా సరే తీసుకొని రా అని రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత రుద్రాణి కాఫీ తాగుతూ బయటకు చూస్తుంది. అక్కడ రాజ్, కావ్యలు డ్రైవర్ తో కార్లన్ని తీసుకొని వెళ్ళమనడం చూస్తుంది. అప్పుడే రుద్రాణి దగ్గరికి వస్తాడు రాహుల్.
ఇది మంచి ఛాన్స్ ఇంట్లో గొడవ చెయ్యొచ్చని హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్రాణి. మరొకవైపు రాజ్ , కావ్య ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. జగదీష్ చంద్ర గారి ప్రాజెక్ట్ కి ఇన్వెస్ట్‌మెంట్ కి అయిదు కోట్లు కావాలని రాజ్ టెన్షన్ పడుతుంటే.. అప్పుడే జగదీష్ చంద్ర వస్తాడు. కావ్య గారు ఫోన్ చేసి అయిదు కోట్లు అడ్వాన్స్ ఇవ్వడానికి రమ్మని చెప్పారు. ఇదిగోండి అయిదు కోట్ల చెక్కు అని ఇవ్వగానే రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను వెళ్ళిపోయాక ఎంత మంచి పని చేసావంటూ కావ్యని ఎత్తుకొని తిరుగుతాడు రాజ్. అప్పుడే శృతి వస్తుంది. తనని చూసి కావ్యని కింద పడేస్తాడు. పర్మిషన్ తీసుకొని రావాలి అని తెలియదా అని తనని రాజ్ కోప్పడి వెళ్ళిపోతాడు. ఏంటి మేడమ్ మిమ్మల్ని ఆఫీస్ కి రానిచ్చారు.. పొగిడారు.. ఇప్పుడు ఎత్తుకొని తిరుగుతున్నారని శృతి అనగానే.. కావ్య సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ఏదో వర్క్ ఉంది అంటూ సుభాష్ ఒక కార్ ని తీసుకొని వెళ్తాడు. ఇదే కరెక్ట్ టైమ్ అంటూ ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. మనం బయటకు వెళదాం పదా అని రుద్రాణి అంటుంది.
ఆ తర్వాత ఇద్దరు బయటకు వచ్చేసరికి కార్ ఉండదు. దాంతో ధాన్యలక్ష్మి డ్రైవర్ కి ఫోన్ చేస్తుంది. డ్రైవర్ తో ధాన్యలక్ష్మి కోపంగా మాట్లాడేసరికి.. అతను కూడా అలాగే మాట్లాడతాడు. కావ్య మేడమ్ కార్ లు అన్ని తీసుకొని వెళ్ళమందని చెప్తాడు. దాంతో ధాన్యలక్ష్మిని ఇంకా రెచ్చగొడుతుంది రుద్రాణి. లోపలికి వెళ్లి అపర్ణని పిలిచి.. నీ కోడలు ఇంట్లో కార్లు లేకుండా చేసింది.. మేము ఇప్పుడు ఆటోలో వెళ్లాలా ఎందుకు ఇలా చేసిందో కనుక్కోమని ధాన్యలక్ష్మి అంటుంది. తర్వాత కావ్యకి ఫోన్ చేస్తుంది అపర్ణ. బిజీ ఉన్నా అత్తయ్య అని కావ్య అనగానే.. అపర్ణ సరే అంటుంది. నా కోడలు బిజీగా ఉందని అపర్ణ చెప్పడంతో.. వాళ్లు ఇంకా కోప్పడతారు. తరువాయి భాగంలో అనామిక, నందగోపాల్ మాట్లాడుకుంటారు. మరొకవైపు రాజ్ తన పోలీస్ ఫ్రెండ్ కి కాల్ చేసి నందగోపాల్ ఫారెన్ వెళ్ళలేదని చెప్పగానే.. సరే నా భార్య నేను వాడిని ట్రేస్ అవుట్ చేస్తామని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read