
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -984 లో...ఇంట్లో ఇందు పరిస్థితి చూసి ఇక ఆలస్యం చెయ్యకుండా పవర్ అఫ్ పటాని ఇందు పేరున రాయాలని సుభాష్ తో అపర్ణ చెప్తుంది. ఇందుకి మంచి జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలని సుభాష్ అంటాడు. మరొకవైపు ఇందు ఇంటర్వ్యూ కోసం రెడీ అవుతుంది. తన సర్టిఫికెట్స్ అన్ని బ్యాగ్ లో పెట్టుకుంటుంది. అప్పుడే స్వాతి వచ్చి ఎక్కడికి అని అడుగుతుంది. ఇంటర్వ్యూకి అని ఇందు చెప్తుంది.
హాల్లో భ్రమరాంబ కూర్చొని ఉంటుంది. పిన్ని నేను శివరాం గారి ఇంటికి వెళ్తున్నానని ఇందు చెప్తుంది. వెళ్లడం కాదు రేఖకి మంచి పేరు తీసుకొని రావాలని భ్రమరాంబ చెప్తుంది. బ్యాగ్ లో ఏమున్నాయని భ్రమరాంబ అడగ్గానే ఇందు టెన్షన్ పడుతుంది. అప్పుడే భ్రమరాంబ భర్త వచ్చి నువ్వు గతంలో దొంగతనం చేసినట్లు ఇప్పుడు ఇందు చేస్తుందని అనుకుంటున్నావా అని అనగానే నువ్వు గతం విషయాలు తియ్యొద్దని తన భర్తపై భ్రమరాంబ కోప్పడుతుంది. ఆ తర్వాత ఇందు వెళ్తుంటే.. ఆ సర్టిఫికెట్స్ ఎవరివి అని రేఖ వాయిస్ తో స్వాతి ఇమిటేట్ చేస్తుంది. దాంతో ఇందు భయపడి వెనక్కి తిరిగి చూస్తే స్వాతి ఉంటుంది. నీ సంగతి వచ్చాక చెప్తానని ఇందు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శివరాం ఇంటికి వెళ్లి తనతో మాట్లాడుతుంది. వంట త్వరగా చేసి వెళ్ళిపోతానని అంటుంది. అవసరం లేదమ్మా.. నువ్వు ఏదో అలా చెప్పమన్నవని చెప్పాను అంతే అని శివరాం అంటాడు. నేను బయటకి వచ్చింది జాబ్ చెయ్యడానికి అని ఇందు అంటుంది.
నేను జాబ్ విషయంలో హెల్ప్ చేస్తానని శివరాం అనగానే వద్దు సర్ నేను ట్రై చేస్తాను కానీ మా రేఖ ఆంటీ ఫోన్ చేస్తే వచ్చి వెళ్ళిందని చెప్పండి అనగానే సరేనని అతను అంటాడు. ఆ తర్వాత ఇందు ఇంటర్వ్యూకి వెళ్తుంటే రాజు, లక్కీ వెళ్తు తనకి డాష్ ఇస్తారు. దాంతో ఇందు ఫోన్ పగిలిపోతుంది. ఇప్పుడు రిపేర్ చెయ్యకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్తానని అనగానే రాజు, లక్కీ రిపేర్ చేయిస్తారు. ఇప్పుడు ఒకవేళ ఇంటర్వ్యూ అయిపోతే మాత్రం నీ సంగతి చెప్తానని రాజుకి ఇందు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తరువాయి భాగంలో సుభాష్ కి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఆ విషయం రేఖకి చెప్తే పట్టించుకోదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





