సంజనకి నో ఫ్యామిలీ వీక్.. బిగ్ బాంబ్ పేల్చిన నాగార్జున!
on Nov 16, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం వీకెండ్ కి వచ్చేసింది. ఇక ఇప్పుడు హౌస్ లో పదకొండు మంది కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో ఇమ్మాన్యుయల్ మినహా అందరు నామినేషన్లో ఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రెండు బిగ్ బాంబ్స్ వేసాడు నాగార్జున.
ఇందులో ఒకటి డబుల్ ఎలిమినేషన్ కాగా రెండోది చెప్పేముందు ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్ లో మీకు సపోర్ట్ ఉన్నదెవరు.. మీ ఆటను ముంచుతోందెవరనేది చెప్పాలన్నాడు. ఇక అందులో మెజారిటీ కంటెస్టెంట్స్ సంజన వల్ల తమ గేమ్ చెడిపోతుందని అభిప్రాయపడ్డారు. దాంతో రెండో బిగ్ బాంబ్ సంజన మీద పడుతుందని నాగార్జున చెప్పాడు. తీరా ఆ బాంబ్లో ఉన్నది మరేంటో కాదు, నో ఫ్యామిలీ వీక్. ఇప్పటికే చంటిపిల్లలకు దూరంగా ఉన్న సంజనా.. రాత్రిళ్లు దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నా రోజంతా మాత్రం చలాకీగానే ఉంటోంది. ఫ్యామిలీ వీక్ లో పిల్లలు వస్తారన్న ఆశతో వేయికళ్లతో ఎదురుచూస్తోంది. అలాంటిది తన కోసం ఎవరు రారని అనడంతో గుక్కపెట్టి ఏడ్చింది సంజన.
నేను ఇంటికెళ్లిపోతాను సర్.. నా వల్ల కాదు.. నేను చచ్చిపోతా.. రోజుకు ఆరుసార్లు ఏడుస్తున్నాను. ఇంక నావల్ల కాదు. నేనిక్కడ ఉండలేనంటూ వెక్కెక్కి ఏడ్చింది సంజన. ఇంట్లో మెజారిటీ హౌస్ మేట్స్ నీవల్లే వాళ్ల ఆట మునిగిపోతుందన్నారు. వేరేవాళ్ల పేరు వచ్చుంటే ఆ బాంబ్ ఇంకొకరిపై పడేది. ఇది బిగ్‌బాస్ నిర్ణయం అని నాగార్జున అన్నాడు. ఇంతలో కళ్యాణ్, భరణి.. సంజనా కోసం తమ ఫ్యామిలీ వీక్ త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ, అందుకు నాగార్జున ఒప్పుకోలేదు. బాధను భరించలేకపోయిన సంజనా.. నన్ను ఇంటికి పంపించేయండి సర్.. ఇది నేను పొగరుతో చెప్పడం లేదని బ్రతిమాలుకుంది. అయితే ఇది గేమ్ అని నీ స్థానంలో ఎవరున్నా వారికి ఇదే ఉంటుందని నాగార్జున చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



