కమిట్‌మెంట్ ఇస్తేనే ఆఫర్స్ అని లేదు...తెలుగు ఆర్టిస్టులు లేకపోవడానికి కారణం...
on Nov 16, 2025
సిల్వర్ స్క్రీన్ మీద జ్యోతి ఫేమస్ నటి. ఎన్నో మూవీస్ లో నటించిన ఆమె ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులు లేకపోవడానికి కారణం ఏమంటారు మీరు అని అడిగింది. దానికి జవాబిచ్చింది జ్యోతి. తెలుగు వచ్చని చెప్పడమే. దూరపు కొండలు నునుపు అంటారు కదా. బొంబాయి లాంటి ప్లేసెస్ నుంచి తీసుకొస్తున్నారు. అంటే వచ్చేయి రాని తెలుగు ఐతే అవకాశాలు ఉంటున్నాయి. అంటే ఏదో ఉంది వీళ్లల్లో అని పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. గుప్పిట ముడుచుకుని ఉన్నప్పుడే అనడం కదా ఓపెన్ ఐపోతే అందం ఉండదు కదా" అంటూ అసలు విషయాన్నీ చెప్పుకొచ్చింది. "ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఇస్తే కానీ ఆఫర్స్ రావు అంటారు. ఎంతవరకు నిజం అంటారు" అని అడిగింది హోస్ట్. "అది బుల్ షిట్. ఇప్పుడు ఉన్న జనరేషన్ చాలా ఫాస్ట్ ఉన్నారు. మొహం మీదే చెప్పేస్తున్నారు. నేను 2002 లో ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి నేను చూస్తోంది ఏంటంటే నేను కమిట్మెంట్ ఇచ్చి నేను ఎలాంటి ఆఫర్ ని తీసుకోలేదు సీరియస్ గా. నేను ఎక్కువగా చేసింది అంతా కృష్ణ రెడ్డి గారి సినిమాల్లోనే. ఆయన నాకు తండ్రితో సమానం. ఈ విషయాన్నీ చాల ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. నాకు ఇష్టమైతేనే నేను ఒక రిలేషన్ షిప్ లోకి ఎంటరవుతాను. అంతేకాని నన్ను ఇంతవరకు అలా ఎవరూ ఫోర్స్ చేసిన వాళ్ళు లేరు. ఈ విషయం ఎక్కువగా మన ఇండస్ట్రీలోనే ఫోకస్ గా ఉంటుంది. అదే బయట చూస్తే అదొక మ్యూచువల్ గా జరిగే విషయం. మన ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తారు లాంటిది ఏమీ లేదు. అదంతా టాలెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక ఇప్పుడు ఉన్న జనరేషన్ ఐతే చాల స్పీడ్ గా ఉంది. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా చాలా స్పీడ్ గా ఉంది. ఏ చిన్న నాన్సెన్స్ జరిగినా వాళ్ళు సోషల్ మీడియాని అప్రోచ్ అవుతున్నారు. నువ్వేంతరా, నువ్వు నాకేంటి చెప్పెదిరా అని అడిగేస్తున్నారు. ఒక్క సినిమాకు కాంప్రమైజ్ కావడం అనేది పెద్ద నాన్సెన్స్ విషయం. సక్సెస్ అనేది మనకు ఏమీ నేర్పించదు. కానీ ఫెయిల్యూర్ మాత్రం చాలా విషయాలు నేర్పిస్తున్నారు. కాబట్టి అవకాశం రావట్లేదు అన్నప్పుడు వేరే బిజినెస్ వైపు అడుగులు వేయడం మంచిది."అని చెప్పింది జ్యోతి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



